From Wikipedia, the free encyclopedia
Durian | |
---|---|
Durio kutejensis fruits, also known as durian merah | |
Scientific classification | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
(unranked): | |
Order: | Malvales |
Family: | Malvaceae |
Subfamily: | Helicteroideae |
Tribe: | Durioneae |
Genus: | Durio |
Species | |
There are currently 30 recognised species (see text) | |
Synonyms | |
Lahia Hassk.[1] |
రాజ పనస చెట్టు Malvaceae అనే కుటుంబం చెందినది. ఇది పనస జాతికి సమీప బంధువు. ఆంగ్లంలో డ్యురియన్ (Durian) గా పిలువబడే రాజ పనస యొక్క సాగు ఇండొనేషియా, మలేషియా మొదలగు ఆగ్నేయ దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇటీవల రాజపనస సాగు కేరళ రాష్ట్రంలోనూ జరుగుచున్నది.
ఈ చెట్టు యొక్క పండు పరిమాణంలో పెద్దదిగా ఉండి పరిమళాలను వెదజల్లుతూ ఉంటుంది. రాజపనస పండు లోపలి కండను పొట్టు వంటి ముళ్ళతో కూడిన బలీయమైన తొక్కుతో కప్పబడి ఉంటుంది. ఈ పండు 30 సెంటీమీటర్ల (12 అంగుళాలు) పొడవు, 15 సెంటీమీటర్ల (6 అంగుళాలు) అడ్డుకొలత వరకు పెరుగుతుంది. ఇది ఒకటి నుంచి మూడు కిలోగ్రాముల బరువు తూగుతుంది. దీని పండు దీర్ఘగోళాకారం నుంచి గోళాకారం మధ్యలో ఉంటుంది. పైన ఆకుపచ్చ రంగులో ఉండే ఈ పండ్లు వీటి జాతులను బట్టి లోపలి కండ రంగులో మార్పును కలిగి ఉంటాయి. పండు లోపలి కండ భాగం మాంసపు కండ వలె ఎరుపు నుంచి చామన చాయ వరకు, పసుపు నుంచి పాలిపోయిన పసుపు రంగు వరకు వివిధ రంగులను కలిగి ఉంటుంది.
Nutritional value per 100 గ్రా. (3.5 oz) | |
---|---|
శక్తి | 615 కి.J (147 kcal) |
27.09 g | |
పీచు పదార్థం | 3.8 g |
5.33 g | |
1.47 g | |
విటమిన్లు | Quantity %DV† |
విటమిన్ - ఎ | 44 IU |
థయామిన్ (B1) | 33% 0.374 mg |
రైబోఫ్లావిన్ (B2) | 17% 0.2 mg |
నియాసిన్ (B3) | 7% 1.074 mg |
పాంటోథెనిక్ ఆమ్లం (B5) | 5% 0.23 mg |
విటమిన్ బి6 | 24% 0.316 mg |
ఫోలేట్ (B9) | 9% 36 μg |
విటమిన్ సి | 24% 19.7 mg |
ఖనిజములు | Quantity %DV† |
కాల్షియం | 1% 6 mg |
రాగి | 10% 0.207 mg |
ఇనుము | 3% 0.43 mg |
మెగ్నీషియం | 8% 30 mg |
మాంగనీస్ | 15% 0.325 mg |
ఫాస్ఫరస్ | 6% 39 mg |
పొటాషియం | 9% 436 mg |
సోడియం | 0% 2 mg |
జింక్ | 3% 0.28 mg |
ఇతర భాగాలు | పరిమాణం |
నీరు | 65g |
Cholesterol | 0mg |
| |
†Percentages are roughly approximated using US recommendations for adults. Source: USDA Nutrient Database |
రాజపనస పండులో ఎక్కువమొత్తంలో షుగర్, విటమిన్ సి, పొటాషియం, సెరొటోనెర్జిక్ ఎమినో యాసిడ్, ట్రిప్టోఫాన్, కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, ఫ్యాట్లు ఉంటాయి.[3] మలేషియాలో రాజపనస ఆకులను, వేర్లను కషాయం కాచి జ్వరం వచ్చినప్పుడు శరీరానికి వ్రాస్తారు.
హైదరాబాద్ వంటి మెట్రోపొలిటాన్ నగరాల్లో రాజపనస కేజీ 750 రూపాయల ధర పలుకుచున్నది. అయితే రాజపనస వాసన కొందరు ఇష్టపడకపోవచ్చును. రాజపనస చాలా ఘాటు సువాసన వెదజల్లుతుంది. అందువలన ఆగ్నేయదేశాల్లోని హోటల్స్, పార్కులు వంటి బహిరంగ ప్రదేశాల్లో రాజపనస నిషేధించబడింది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.