నేనిక్కడ తొంభయ్యేడో వాణ్ణి. ఒకప్పుడు నిర్వాహకుణ్ణి, అధికారినీ. చురుగ్గా పాల్గొనలేక పోవడం వలన 2023 జూన్ 3 న స్వచ్ఛందంగా ఈ బాధ్యతల నుండి తప్పుకున్నాను. 2005 జూలై 30 న తెవికీలో తొలి దిద్దుబాటు చేసాను. అప్పట్లో విక్షనరీలో కొంత పని చేసాను. వికీలో నాణ్యత పెంచడం కోసం కృషి చేస్తూంటాను. వేగంగా పని చేసేందుకు ఇష్టపడతాను. అందుకే వాడుకరి:ChaduvariAWBNew పేరుతో సెమీ-ఆటో దిద్దుబాట్లు చేస్తూంటాను.
కృషి షో కేసు |
- సహాయం పేజీలు, వికీ వ్యవహార జ్ఞానానికి సంబంధించిన పేజీల్లో దాదాపు 75% పేజీలను సృష్టించాను, సమాచారం చేర్చాను. (2006 నుండి)
- వికిపీడియా ఇంటర్ఫేసును తెలుగు లోకి అనువదిస్తూంటాను. (2008 నుండి)
- వ్యాసాల్లో ఉండే ఎర్రలింకులను సవరించే ప్రాజెక్టు సృష్టి, నిర్వహణ. (2022)
- ఫొటోల చేర్పు పోటీలో తెవికీ 3 వ స్థానం సాధించడంలో తోడ్పాటు (2021)
- కొత్త వాడుకరుల కోసం గ్రోత్ ప్రాజెక్టు స్థాపన (2021)
- వికీపీడియా గణాంకాల సంకలన, వ్యవకలనాలు (2020)
- నిర్వాహకులు చేసే నిరోధ నిర్ణయాలను సమీక్షించే సంఘాన్ని ప్రతిపాదించాను (2020)
- వికీ పద్ధతులు, సాంకేతికాంశాలపై సూచనలిచ్చే పేజీ (2020)
- వికీలో వేరే పనులు చేస్తూ కూడా నిర్వాహక కృషి చేయని నిర్వాహకుల హక్కుల ఉపసంహరణ విధానాన్ని ప్రతిపాదించాను. (2019)
- భాష నాణ్యత కోసం ఐదొందలకు పైగా రెగెక్సులు రాసాను (2016 నుండి)
- వ్యాసాల నాణ్యతను గణించే మంచి వ్యాసాల ప్రమాణాలను రూపొందించడంలో తోడ్పడ్డాను (2018)
- భాషాంతక అనువాదాలపై, భాషా వ్యతిరేక చర్యలపై పోరాటం (2016 నుండి)
- మూడు వేల మొలకల విస్తరణ ఋతువు ప్రాజెక్టు నిర్వహణ, అందులో భాగంగా, స్వయంగా 900 మొలకల విస్తరణ. (2020)
- గ్రామాల పేజీల్లో జనగణన సమాచారం కూర్పు, చేర్పు (2017, 2018)
- క్రికెట్ 2023 ప్రాజెక్టు నిర్వహణ. అందులో నేను 558 వ్యాసాలు చేర్చాను
|
ChaduvariAWB, ChaduvariAWBNew, GrowthChaduvari1, GrowthChaduvari2, GrowthChaduvari3, GrowthChaduvari4 - ఈ ఖాతాలు నావే |
e · h · w · r To-do: | |
- వర్గాల క్రమబద్ధీకరణ చెయ్యాలి. అన్నీ ఒక్కసారే చేద్దాం అని పెట్టుకోవద్దు, ఏదీ అవదు. కొన్ని ఎంచుకో, పని కానిచ్చేయ్! మొదలెట్టు
- తెవికీకి పనికొచ్చే యూజర్ స్క్రిప్టుల జాబితా తయారు చెయ్యాలి
- యూజర్ స్క్రిప్టులను చేర్చడంలో ఎదురౌతున్న సమస్యలకు పరిష్కారం వెతకాలి
|
| 2024 సెప్టెంబరు 12 00:59:51 నాటికి, లక్షకు చేరేందుకు ఇంకా కావాల్సిన వ్యాసాలు: 561 |
వాసి ముఖ్యం
- భాషా దోషాలను సరిచేసేందుకు రెగెక్సులు రాసాను. 500 పైచిలుకు రెగెక్సుల ద్వారా వేలాది తప్పులకు సవరణలు రాసాను. AWB వాడి, 2 లక్షలకు పైగా దిద్దుబాట్లు చేసాను, చేస్తున్నాను (నా AWB వాడుకరితో 40 వేల పైచిలుకు, నా మరో AWB వాడుకరితో 1,87,000 పైచిలుకు). ఇతర వాడుకరులు కూడా, తాము ఎంచుకున్న పేజీల్లో ఈ తప్పులను సవరించవచ్చు.
- అనువాదాల నాణ్యత: యాంత్రికానువాదాల్లో నాణ్యతను మెరుగుపరచేందుకు సంరక్షణ చర్య ప్రతిపాదించి, అమలు పరచాను. ఈ సంరక్షణ చర్యను తిరగదోడేందుకు తలపెట్టిన చర్యను వ్యతిరేకించాను.
- "మంచి వ్యాసం" ప్రమాణాల ఏర్పాటు: ఈ పనిలో భాగంగా.. పవన్ సంతోష్ గారితో కలిసి, ఎన్వికీలో ఉన్న మంచి వ్యాసం ప్రమాణాలను ఇక్కడికి తెచ్చాను. ప్రాసెస్‌ను పరీక్షించి చూసాం. అంతా బానే ఉంది.
- "మరియు" ల తొలగింపు: 2018 ఆగస్టు 17 నాటికి వికీలో 20539 "మరియు"లున్నాయి. "మరియు"ను వాడకూడదు, ఉన్నవాటిని తొలగించాలి అనేది నా సంకల్పం. 2020 మార్చి 22 న ఈ పని పూర్తైంది. "మరియు"ల ఏరివేతపై చేసిన పని గురించి క్లుప్తంగా ఇక్కడ చూడవచ్చు
- నాలుగేళ్ళ పాటు అనేక చర్చోపచర్చలు జరిగిన తరవాత గూగుల్ యాంత్రికానువాద వ్యాసాలను (దాదాపు 1800 వ్యాసాలు) 2020 ఫిబ్రవరి 5 న తొలగించాను. ఆ మేరకు వికీ నాణ్యత మెరుగుపడింది.
- భాషను మెరుగుపరచేందుకు కృషి చేస్తూనే సవరించేందుకు వీలుకాని యాంత్రికానువాదాలను తొలగించేందుకు ప్రతిపాదిస్తూంటాను. వచ్చిన ప్రతిపాదనలపై అభిప్రాయాలు చెబుతూంటాను. చర్చలపై నిర్ణయాలు తీసుకుంటూ, తీసుకున్న నిర్ణయాలను అమలు చేస్తూంటాను.
- ఎర్రలింకుల సంస్కరణ ప్రాజెక్టులో భాగంగా, వ్యాసాల్లో ఉన్న లక్ష పైచిలుకు ఎర్రలింకుల గమ్యాలను సవరించి నీలి లింకులుగా మార్చాను
- మూలాల్లో లోపాలను సవరించే పనిని చేపట్టాను. ఒక ప్రాజెక్టును రూపొందించి ఇతర వాడుకరులతో కలిసి పని చేస్తున్నాను. వర్గం:CS1 errors లోని ఉపవర్గాల్లోని 9,000 పైచిలుకు పేజీల్లో లోపాలను సవరించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం.
- వికీపీడియా యూజరు ఇంటరుఫేసును తెలుగు లోకి అనువదిస్తూంటాను. మొదట్లో ఇక్కడి అన్ని సిస్టం సందేశాలను అనువదించాను. ఆ తరువాత ట్రాన్స్‌లేట్‌వికీలో అనువదించడం మొదలుపెట్టి అక్కడే చేస్తున్నాను. అక్కడ అత్యధికంగా అనువాదాలు చేసినది నేనే. (ఈ పేజీలో కింద తెలుగు అనే విభాగంలో వాడుకరుల పేర్లు, చేసిన అనువాదాల సంఖ్య వారీగా వరుసగా ఇచ్చి ఉంటాయి. వాడుకరి పేరుపై మౌసును ఉంచితే, ఆ వాడుకరి చేసిన మార్పుల సంఖ్యను చూపిస్తుంది) వికీపీడియా ఇంటేర్ఫేసులో ఎక్కడైనా అనువాదాన్ని సవరించాల్సిన అవసరం గానీ, కొత్తగా అనువదించాల్సిన అవసరం గానీ మీకు కనిపిస్తే, నా వాడుకరి చర్చ పేజీలో చెబితే నేను చేస్తాను.
రాసి కూడా ముఖ్యమే
నాణ్యతతో పాటు వికీ పరిమాణాన్ని పెంచడం లోనూ నా వంతు కృషి చేస్తూంటాను. వికీలో చేర్చిన స్థూల, నికర బైట్ల గణాంకాలను ఎప్పటికప్పుడూ పరిశీలిస్తూంటాను. వీలైనంత ఎక్కువ బైట్లను చేర్చేందుకు కృషి చేస్తాను. అనువాదాలు అందులో ఒక భాగం.
- అనువాదాలు: అనువాద పరికరం ద్వారా అనువాదాలు చెయ్యడం నా వికీ కృషిలో ప్రధానమైన అంశం. 2023 డిసెంబరు నాటికి 1,720 పైచిలుకు అనువాదాలు చేసాను. యాంత్రికానువాదాలు చెయ్యడంలో వేగం ఉంది. వాటిని ప్రచురించే ముందు లోపాలను సరిదిద్ది ప్రచురిస్తూంటాను. అయినప్పటికీ భాషా లోపాలు వస్తూనే ఉంటాయి. వాటిని ప్రచురించిన తరువాత పరిశీలించి దిద్దుతూంటాను. అయినా లోపాలు ఉంటూనే ఉంటాయి. వాటిని గమనిస్తే సరిచెయ్యండి, లేదా నాకు చెప్పండి. నేను సరిదిద్దుతాను.
- గ్రామాల వ్యాసాలు: భారత జనగణన వారి డేటా ఆధారంగా పేజీల్లో పాఠ్యాన్ని సాఫ్టువేరు ద్వారా తయారు చేసాను. వివిధ వాడుకరులు దాన్ని ప్రచురించారు. అరకొర సమాచారంతో పాతికో యాభయ్యో బైట్ల పరిమాణంలో ఉన్న 20 వేల పైచిలుకు గ్రామాల పేజీలు రెండేళ్ళలో 10,000 బైట్లు దాటాయి.
- 2023 డిసెంబరు 24 నాటికి నేను చేర్చిన బైట్లు ఇలా ఉన్నాయి:
మరింత సమాచారం 2023 జూన్ 1 నాటికి, ప్రధానబరిలో ...
2023 జూన్ 1
నాటికి |
ప్రధానబరిలో |
అన్ని పేరుబరుల్లోనూ |
స్థూల బైట్ల సంఖ్య |
8,98,61,095 (85.69 ఎం.బి) |
12,39,20,299 (118.17 ఎం.బి) |
నికర బైట్ల సంఖ్య |
7,03,50,047 (67.09 ఎం.బి) |
9,08,03,921 (86.59 ఎం.బి) |
మూసివేయి
శిక్షణ, తోడ్పాటు, పరిజ్ఞానం
వికీపీడియా గురించి కొత్తవారికి, కొంతమంది పాతవారికీ ఉపయోగకరంగా ఉండేలా కింది పనులు చేసాను
- వాడుకరులకు సూచనలు పేజీ ద్వారా వికీలోని కొత్త అంశాలనూ, పాత విశేషాలనూ, ఇక్కడ పనిచెయ్యడంలో ఉన్న కిటుకులనూ తెలియజేస్తూంటాను
- గ్రోత్ ప్రాజెక్టులో గురువుగా చేరాను. కొత్తవారికి సందేహాలను తీరుస్తూంటాను.
- సహాయం పేజీలు: సహాయం పేజీలను, వికీ వ్యవహార జ్ఞానానికి సంబంధించిన పేజీలనూ అనువదిస్తూ, కొత్తవి సృష్టిస్తూ ఉంటాను. ఈ పేజీల్లో 75% పేజీలు నేను సృష్టించినవే. ఈ పేజీల్లో నేను సృష్టించిన వాటితో పాటు ఇతరులు సృష్టించిన పేజీల్లో కూడా అత్యధిక సమాచారాన్ని చేర్చినది నేనే. వీటితో పాటు విధానాల, మార్గదర్శకాల పేజీలనూ అనువదిస్తూంటాను.
ఎడబ్ల్యుబి
ఎడబ్ల్యుబి వాడి కింది పనులు చేస్తూంటాను
- టైపోల పేజీ ద్వారా భాషా దోషాల సవరణ
- సామూహిక వర్గీకరణ
- అనేక ఇతర పనులు
నిర్వహణ
- నిర్వహణలో భాగంగా వికీపీడియాను మెరుగుపరచేందుకు కొన్ని విధానాలను మార్గదర్శకాలనూ ప్రతిపాదించాను. కొన్ని ప్రతిపాదనలు నెగ్గాయి. కొన్ని తగ్గాయి. కొన్ని ఆగాయి, కొన్ని వీగాయి.
గ్రామాల పేజీలు
గ్రామాల పేజీల్లో జనగణన సమాచారం చేర్చడం: ప్రాజెక్టు పేజీలో చూపినట్లుగా అప్లికేషను తయారీ, తెలుగీకరణ పని, టెక్స్టు ఫైళ్ళ తయారీ పని చేసి పేజీల్లో సమాచారాన్ని చేర్చాలన్న ఆసక్తి కలిగిన వారికి టెక్స్టు ఫైళ్ళను పంపించాను. నేనూ కొన్ని గ్రామాల పేజీల్లో పని చేసాను. భాస్కరనాయుడు, వెంకటరమణ, సుజాత, పవన్ సంతోష్, జెవిఆర్కె ప్రసాద్, యర్రా రామారావు, అజయ్ బండి మొదలైనవారు ఈ పనిలో విశేషమైన కృషి చేసారు. ముఖ్యంగా యర్రా రామారావు గారు - అందరూ ఈ పని నుండి పక్కకు తప్పుకున్నాక, ఒంటిచేత్తో వేలాది పేజీలను తీర్చిదిద్దారు. దాదాపుగా అన్ని గ్రామాల పేజీల్లోనూ సమాచారం చేరినట్టే.
నేను చేసిన పనుల గురించిన వివరాలున్న పేజీలు
వికీపీడియాలో నాకోసం నేను నిర్దేశించుకున్న పనులు 2017 నవంబరు నాటికి ఇవి. కింది జాబితా సుమారుగా ప్రాథమ్య పరంగా తయారు చేసాను.
- భాషా నాణ్యత:
- అవసరాన్ని బట్టి కొత్త రెగెక్సులను చేర్చడం. ఇవి నిరంతరం జరిగే పనులు.
- AWB ని వాడి వ్యాసాల్లోని భాషాదోషాలను సరిచెయ్యడం.
- సమాచార నాణ్యత: వికీపీడియాలో చేరుస్తున్న సమాచారపు నాణ్యతను పరిశీలించడం, మెరుగు పరచడం. ఇది నా పనులన్నిటి లోకీ ముఖ్యమైనది. మొట్టమొదటి ప్రాథమ్యం, అత్యధిక ప్రాథమ్యమూ దీనికే.
- గ్రామాల పేజీల్లో చేర్చిన సమాచారం నాణ్యంగా ఉందో లేదో గమనించడం, అవసరమైన మార్పులను చెయ్యడం, నాణ్యతను మెరుగుపరచడం. తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ తరువాత సమాచారం చేర్చేటపుడు పాత సమాచారాన్ని తగు విధంగా సవరించాల్సి ఉంది.
- ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లోని గ్రామాల పేజీలకు పేర్లు సరిగా లేవు. అనేక గ్రామాల పేర్లు తప్పుగా రాసాం. వాటిని సరైన పేర్లకు తరలించాలి. దాదాపు ఆరేడు వేల పేజీలను తరలించాల్సి ఉంటుందని నా అంచనా.
- విధానాలు, మార్గదర్శకాల చేర్పు,మార్పు: అవసరమైన చోట్ల విధానాలను నిర్వచించడం, అందుకోసం అవసరమైన చర్చలను నిర్వహించడం.
- నిర్వహణ పనులు
- ప్రత్యేక పేజీలు: అప్పుడప్పుడూ ప్రత్యేకపేజీలను చూస్తూ, అవసరమైన చోట్ల చర్య తీసుకోవడం. ఉదా: అనాథ పేజీలు, అగాధ పేజీలు, వికీడేటాలో అంశం లేని పేజీలు, భాషాంతర లింకులు లేని పేజీలు, అయోమయ నివృత్తి పేజీకున్న లింకులు, మూసల దిగుమతి వగైరాలు.
- సెమీ ఆటోమేషన్: అవకాశం ఉన్న అన్నిచోట్లా సెమీ ఆటోమేషన్ పద్ధతిలో మార్పు చేర్పులు చెయ్యడం.
- నాణ్యతా మూల్యాంకనం చెయ్యాలి. అందరికీ అమోదయోగ్యమైన పద్ధతులను రూపొందించాలి. ఆ పద్ధతులను విరివిగా వాడుక లోకి తేవాలి.
మరింత సమాచారం ముఖ్యమైనవి, మిగతావి ...
మూసివేయి
- తెలుగు భాష, సాహిత్యం: ఛందోబద్ధమైన పద్యాలు (కాస్తో కూస్తో రాయడం కూడా), అవధానాలు వగైరా.. కానీ వీటి గురించి వికీలో పెద్దగా రాయను.
- రాజకీయాలు: రాజకీయాలు నాకు బాగా ఇష్టం. రాష్ట్ర, దేశ, అంతర్జాతీయ - ఈ వరసలో ఉంటాయి నా ఇష్టాలు. అయితే వర్తమాన భారత రాజకీయాలకు సంబంధమున్న వ్యాసాలను వికీలో రాయడం ఎప్పుడో మానేసాను -నిష్పాక్షికంగా రాయడం కష్టం అనిపించింది కాబట్టి.
- అంతరిక్ష యాత్రలు: అంతరిక్ష విజ్ఞానంలో అనేక అంగాలు.. వాటిలో యాత్రలు ఒకటి. నాకెంతో ఇష్టమైన విషయాల్లో ఇదొకటి. కక్ష్యలు, అంతరిక్ష నౌకలు, వాహనాలు, వాటి ఇంజన్లు.. వగైరా. వీటి గురించి వికీలో రాస్తూంటాను.
- క్షిపణులు వగైరా: భారతీయ క్షిపణులు, యుద్ధనౌకల వంటి భారత రక్షణ వ్యవస్థకు చెందిన విషయాలు నాకు ఇష్టాలు. వికీలో రాస్తూంటాను కూడా.
- చరిత్ర: భారత చరిత్రకు సంబంధించిన విషయాలు వికీలో రాస్తూంటాను.
- మానవ పరిణామం: నాకు ఆసక్తి ఉన్న మరో అంశం మానవ పరిణామం. ఇందులో నేను కొన్ని వ్యాసాలు రాసాను. అన్నీ ఇంగ్లీషు నుండి చేసిన అనువాదాలే.
- యుద్ధాలు: యుద్ధాలు, ముఖ్యంగా భారత చైనా, భారత పాకిస్తాన్ యుద్ధాల గురించి రాయడం కూడా ఇష్టం.
AWB పనులు చేసేందుకు నేను రెండు ఖాతాలు సృష్టించాను. అవి:
- ChaduvariAWB,
- ChaduvariAWBNew
పై రెండు ఖాతాలతో AWB వాడి ప్రధానబరి లోని పేజీల్లో మార్పు చేర్పులు చేస్తూంటాను.
వివిధ పరీక్షల నిమిత్తం నేను మరికొన్ని ఖాతాలను సృష్టించాను. అవి:
- వాడుకరి:NewChaduvari1
- వాడుకరి:GrowthChaduvari1
- వాడుకరి:GrowthChaduvari2
- వాడుకరి:GrowthChaduvari3
- వాడుకరి:GrowthChaduvari4
గ్రోత్ ఎక్స్పెరిమెంట్స్ ప్రాజెక్టును పరీక్షించే నిమిత్తం పై 5 ఖాతాలను సృష్టించాను. ఈ ఖాతాలతో ప్రధానబరిలో ప్రయోగాలు చెయ్యడం గాని, దిద్దుబాట్లు చెయ్యడం గాని, చర్చల్లో పాల్గొనడం గాని, వోటింగులో పాల్గొనడం గానీ చెయ్యను. ఈ ఖాతా చేసే పనులన్నిటికీ పూర్తి బాధ్యత నాదే.
ప్రస్తుతం ఈ సంపాదకులు
Grandmaster Editor అనే సేవా పురస్కార స్థాయిని చేరుకున్నారు.
తరువాతి స్థాయికి వెళ్ళే దిశలో ప్రగతి (దిద్దుబాట్ల పరంగా): [
1906 /
18000
]