వికీపీడియా:సంతకం
From Wikipedia, the free encyclopedia
చర్చాపేజీల్లోను, ఇతర చర్చల్లోను సంతకం చెయ్యడం చక్కటి వికీ మర్యాదే కాకుండా, ఇతర సభ్యులకు తామెరివరితో చర్చిస్తున్నామో కూడా తెలుస్తుంది. సదరు సభ్యుని చర్చాపేజీకి వెళ్ళి వారికే ప్రత్యేకించిన సమాధానాలు రాసే అవకాశమూ ఉంటుంది. సమష్టిగా రాసే ఈ రచనల్లో రచన స్థాయి మెరుగుపడే విషయంలో చర్చకు చాలా ముఖ్యమైన పాత్ర ఉంది.
సంక్షిప్తంగా ఈ పేజీలోని విషయం: చర్చాపేజీల్లో మీ రచనలపై సంతకం చెయ్యండి, సంతకంలో కోడు తక్కువగా ఉంచండి, మరీ పెద్ద సంతకం తయారుచెయ్యకండి, సంతకం వర్ణాంధత్వం ఉన్నవారు కూడా చదవగలిగేలా ఉంచండి. |
వ్యాసాల పేజీలు, వ్యాసేతర పేజీల చర్చ పేజీల్లో, మీ పోస్టులపై సంతకం చేయడం తప్పనిసరి. దీనివలన వ్యాఖ్య ఎవరు రాసారో తెలుస్తుంది. ఇతర వాడుకరులు తమ వ్యాఖ్యలను ఎవరికి ఉద్దేశించారో వారిని ఉదహరించే వీలు కలుగుతుంది. పరస్పర సహకారంతో చేసే వికీపీడియా దిద్దుబాట్లలో చర్చ అనేది ఒక ముఖ్యమైన భాగం. ఇది పని పురోగతిని, పరిణామాన్నీ అర్థం చేసుకోవడంలో వాడుకరులందరికీ తోడ్పడుతుంది.
చర్చ పేజీల్లో, ప్రత్యుత్తర సాధనాన్ని గానీ, లేదా క్రొత్త అంశాన్ని చేర్చు సౌకర్యాన్ని గానీ ఉపయోగిస్తున్నప్పుడు సంతకాలు ఆటోమాటిగ్గా చేరతాయి. ఈ సాధనాలను ఉపయోగించకుండా సోర్స్ టెక్స్ట్ మోడ్లో రాసేటప్పుడు, సంతకం మానవికంగా చేర్చాలి. సంతకం నాలుగు "టిల్డె" లను (~~~~
) టైపు చేయడం ద్వారా చేయవచ్చు. లేదా దిద్దుబాటు పరికరాల పట్టీ లోని సంతకం చిహ్నాన్ని 22px క్లిక్ చేయడం ద్వారా కూడా సంతకాన్ని చేర్చవచ్చు.