వైజయంతిమాల
భారతీయ నటి, రాజకీయవేత్త మరియు మహిళా నర్తకి / From Wikipedia, the free encyclopedia
వైజయంతిమాల (ఆంగ్లం : Vyjayanthimala) పాత తరం తెలుగు, తమిళ సినిమా నటి. 1936 ఆగస్టు 13 చెన్నైలో జన్మించింది. తరువాత ఆమె హిందీ చిత్ర రంగంలో ప్రవేశించి పేరు తెచ్చుకొన్నారు. ఈమె మంచి నర్తకి, భరతనాట్యంలో ప్రవీణురాలు. 1950, 1960 దశకాలలో హిందీ సినిమాలలో నటించి అనేక అవార్డులు పొందారు. ఆ తరువాత పార్లమెంటు సభ్యురాలిగానూ ఉన్నారు.
త్వరిత వాస్తవాలు వైజయంతిమాల, జననం ...
వైజయంతిమాల | |
---|---|
![]() | |
జననం | ఆగస్టు 13, 1933 మద్రాసు |
వృత్తి | నటి, భరతనాట్య కళాకారిణి, గోల్ఫ్ క్రీడాకారిణి |
భార్య / భర్త | డాక్టర్.సి.యల్.బాలి |
పిల్లలు | ఒక మగబిడ్డ (సుచింద్ర బాలి) |
తండ్రి | యెం.డీ.రామన్ |
తల్లి | వసుంధరా దేవి |
మూసివేయి
వైజయంతీ మాలకు 2024 జనవరి 25న కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించగా[1], మే 10న రాష్ట్రపతి భవన్లో పురస్కారాన్ని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా అందుకుంది.[2]