శివగంగై
From Wikipedia, the free encyclopedia
శివగంగ, భారతదేశం,తమిళనాడు రాష్ట్రం,శివగంగ జిల్లాకు చెందిన ఒక నగరం.ఇది శివగంగ జిల్లాప్రధానకార్యాలయం.శివగంగ తమిళనాడులోని రాణి వేలునాచియార్ రాజ్యం.ఇది అధికారిక, వాణిజ్య ప్రయోజనాల కోసం శివగంగ జిల్లాలో ముఖ్య నగరం. దీని మారుపేరు శివగంగై సీమాయి. ఇది 16వ శతాబ్దానికి చెందిన శివగంగై కోటకు ప్రసిద్ధి చెందింది.నగరమధ్యన శివగంగై కోట ఉంది. కోట లోపల, రాజరాజేశ్వరి అమ్మన్ ఆలయం ఉంది. దానిలో అనేక అలంకరించబడిన శిల్పాలు ఉన్నాయి. సమీపంలో ప్రభుత్వ సంగ్రహశాల ఉంది. దానిలో చరిత్ర పూర్వ అవశేషాలు, సహజ చరిత్ర ప్రదర్శనలు ఉన్నాయి. ఈ నగరం మధురై నుండి 48 కిమీ (30 మైళ్లు) దూరంలో, రాష్ట్ర రాజధాని చెన్నైనుండి 449 కిమీ (279 మైళ్లు) దూరంలోఉంది.1965లో స్థాపించబడిన పురపాలకసంఘం ద్వారా శివగంగ పరిపాలన సాగుతుంది. 2011 నాటికి పురపాలక సంఘం 10.2 km2 (3.9 sq mi) విస్తీర్ణంలో విస్తరించి ఉంది. పట్టణ జనాభా మొత్తం 40,403. ఈ పట్టణం వ్యవసాయం, లోహపు పనులకు, నేత పనులకు ప్రసిద్ధి చెందింది.శివగంగ పరిసరప్రాంతాల్లో గణనీయమైన ఖనిజనిక్షేపాలు ఉన్నాయి. శివగంగ శాసనసభ నియోజకవర్గం పరిధిలోఒక భాగం. పట్టణానికి రోడ్డు మార్గాలు ప్రధాన రవాణా మార్గం. దీనికి రైలు ప్రయాణ సౌకర్య అనుసంధానం ఉంది.సమీప ఓడరేవు, వి.ఒ. చిదంబరనార్ పోర్ట్ ట్రస్ట్, తూత్తుకుడి 189 km (117 mi) దూరంలో ఉంది. శివగంగ నగరానికి సమీప విమానాశ్రయం, మధురై అంతర్జాతీయ విమానాశ్రయం, 53 km (33 mi) దూరంలో ఉంది.
Sivaganga
Kingdom of ramnad | |
---|---|
Municipality | |
Sivagangai | |
Nickname: Sivagangai Seemai | |
Coordinates: 9.843300°N 78.480900°E / 9.843300; 78.480900 | |
Country | India |
State | Tamil Nadu |
District | Sivaganga |
Region | Pandya Nadu |
Division | Madurai |
Government | |
• Type | 1st grade municipality |
• Body | Sivagangai Municipality |
• Chairperson | Mr CM. Durai Anand B.A.[1] |
• Vice Chairperson | Mr V.Sekar.[2] |
• Commissioner of Municipality | Mr R.Subramanian B.COM.[3] |
Area | |
• Total | 43.28 km2 (16.71 sq mi) |
Elevation | 124 మీ (407 అ.) |
Population (2011) | |
• Total | 40,403 |
• Density | 11,588/km2 (30,010/sq mi) |
Languages | |
• Official | Tamil |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 630561, 630562 |
Telephone code | 04575 |
Vehicle registration | TN-63 |
Distance from Madurai | 40 kilometres (25 mi) WEST (Road) |
Distance from Trichirapalli | 130 kilometres (81 mi) NORTH (Rail) |
Distance from Rameswaram | 120 kilometres (75 mi) SOUTH (Rail) |