సారా అలీ ఖాన్
భారతీయ నటి / From Wikipedia, the free encyclopedia
సారా అలీ ఖాన్ (ఆంగ్లం: Sara Ali Khan; జననం 1995 ఆగస్టు 12) హిందీ చిత్రసీమకు భారతీయ నటి. ఆమె నటులు అమృతా సింగ్, సైఫ్ అలీ ఖాన్ల కుమార్తె. కొలంబియా యూనివర్శిటీ నుండి హిస్టరీ అండ్ పొలిటికల్ సైన్స్‌లో పట్టా పొందిన తర్వాత, ఆమె తన నటనా జీవితాన్ని 2018లో రొమాంటిక్ డ్రామా కేదార్నాథ్, యాక్షన్ కామెడీ సింబాలతో ప్రారంభించింది. ఈ రెండు చిత్రాలు వాణిజ్యపరంగా విజయవంతమయ్యాయి. మొదటిది ఆమెకు ఉత్తమ మహిళా అరంగేట్రానికి ఫిల్మ్‌ఫేర్ అవార్డును సంపాదించిపెట్టింది.[2]
త్వరిత వాస్తవాలు సారా అలీ ఖాన్, జననం ...
సారా అలీ ఖాన్ | |
---|---|
జననం | సారా అలీ ఖాన్ పటౌడీ (1995-08-12) 1995 ఆగస్టు 12 (వయసు 28)[1] ముంబై, మహారాష్ట్ర, భారతదేశం |
విద్యాసంస్థ | కొలంబియా విశ్వవిద్యాలయం |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2018–ప్రస్తుతం |
తల్లిదండ్రులు | సైఫ్ అలీ ఖాన్, అమృతా సింగ్ |
మూసివేయి
2019లో ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ 100 జాబితాలో ఆమె పేరు నమోదు అయింది. ఆమె ఆత్రంగి రే (2021) డ్రామాలో నటించింది. ఆమె నటించిన రొమాంటిక్ కామెడీ జరా హాట్కే జరా బచ్కే (2023)లో వాణిజ్యపరంగా విజయం సాధించింది.