cover image

సాహిత్య అకాడమీ (ఆంగ్లం : Sahitya Akademi) (హిందీ : साहित्य अकादमी ) (తెలుగు : సాహిత్య అకాదెమీ) భారతదేశానికి చెందిన ఒక సంస్థ. సాహిత్య పోషణకు, సహకారానికి, ప్రోత్సాహం కొరకు స్థాపించబడింది. భారతీయ భాషలలో ప్రముఖంగా సేవచేసిన వారికి ఇది సన్మానిస్తుంది. దీనిని మార్చి 12 1954, న స్థాపించారు. దీని నిర్వహణ భారత ప్రభుత్వం చేపడుతున్నది.

ఢిల్లీలోని రవీంద్ర భవన్

సాహిత్య అకాడెమీ, సెమినార్లు, వర్క్‌షాపులు, సమావేశాలు, సదస్సులు చేపడుతుంది. పరిశోధకులకు, రచయితలకు, కవులకు ప్రోత్సాహకాలు అందిస్తుంది. రచనలకు, ముద్రణలకునూ ప్రోత్సాహకాలనిస్తుంది. పురస్కార గ్రహీతలకు రూ. 50,000 లు బహుమానం ప్రకటిస్తుంది. దీని గ్రంథాలయం, భారత్ లోనే అతిపెద్ద బహుభాషా గ్రంథాలయం. రెండు, ద్విమాస పత్రికలు ప్రచురిస్తూవున్నది, అవి -- భారతీయ సాహిత్యం (ఆంగ్లంలో), సమకాలీన్ భారతీయ సాహిత్య్ (హిందీలో).