సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం - Wikiwand
For faster navigation, this Iframe is preloading the Wikiwand page for సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం.

సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం

వికీపీడియా నుండి

బాలసాహిత్యం అభివృద్ధి చేసేందుకు కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నది. ఈ పురస్కారాన్ని 2010నుండి అమలు చేస్తున్నారు. ప్రతీ ఏడాదీ గుర్తించిన భాషల్లో వచ్చిన అత్యున్నత స్థాయి బాల సాహిత్యానికి ఈ పురస్కారం లభిస్తుంది. కొన్ని సందర్భాలలో రచయిత బాలసాహిత్యానికి చేసిన సేవ, బాలసాహిత్యరంగంలో వారి కృషిని మొత్తంగా పరిగణనలోకి తీసుకుని పురస్కారాన్ని అందిస్తున్నారు. ఈ పురస్కారం పొందే బాలసాహిత్య పుస్తకం ఆ అవార్డును ఇచ్చే సంవత్సరానికి ముందు సంవత్సరానికన్నా ఐదేళ్ల కాలంలో వెలువడిఉండాలి. ఉదాహరణకు 2016లో అవార్డుకు పరిగణించే పుస్తకం 2011-2014 సంవత్సరాల మధ్యకాలంలో ప్రచురింపబడి ఉండాలి. ఈ పురస్కారం క్రింద రూ 50,000/- నగదు, జ్ఞాపిక బహూకరిస్తారు.

తెలుగు భాషకు చెందిన బాల సాహిత్య పురస్కార విజేతలు

సంవత్సరం బొమ్మ పుస్తకం సాహితీ విభాగం రచయిత మూలము
2010 అడవి తల్లి నవల కలువకొలను సదానంద [1]
2011
ఉగ్గుపాలు కథాసంపుటి ఎం.భూపాల్ రెడ్డి [2]
2012 చిరుదివ్వెలు కవితా సంపుటి రెడ్డి రాఘవయ్య
2013 ఆటలో అరటిపండు కథాసంపుటి డి. సుజాతాదేవి [3]
2014
ఆనందం కథాసంపుటి దాసరి వెంకటరమణ [4]
2015 బాలసాహిత్యంలో చేసిన మొత్తం కృషికి చొక్కాపు వెంకటరమణ [5]
2016
స్వర్ణపుష్పాలు కవితా సంపుటి అలపర్తి వెంకటసుబ్బారావు [6]
2017 బాలసాహిత్యంలో చేసిన మొత్తం కృషికి వాసాల నరసయ్య [7]
2018
ఆనందలోకం జానపద నవల నారంశెట్టి ఉమామహేశ్వరరావు [8]
2019 తాత మాట వరాల మూట కథల సంపుటి బెలగాం భీమేశ్వరరావు [9]

మూలాలు

  1. 2010 సంవత్సరానికి బాల సాహిత్య పురస్కారాల ప్రకటన
  2. 2011 సంవత్సరానికి బాల సాహిత్య పురస్కారాల ప్రకటన
  3. "2013 సంవత్సరానికి బాల సాహిత్య పురస్కారాల ప్రకటన" (PDF). Archived from the original (PDF) on 2016-03-04. Retrieved 2016-06-29.
  4. "2014 సంవత్సరానికి బాల సాహిత్య పురస్కారాల ప్రకటన" (PDF). Archived from the original (PDF) on 2016-03-06. Retrieved 2016-06-29.
  5. 2015 సంవత్సరానికి బాల సాహిత్య పురస్కారాల ప్రకటన
  6. "2016 సంవత్సరానికి బాల సాహిత్య పురస్కారాల ప్రకటన" (PDF). Archived from the original (PDF) on 2016-08-04. Retrieved 2016-06-29.
  7. "2017 సంవత్సరానికి బాల సాహిత్య పురస్కారాల ప్రకటన" (PDF). Archived from the original (PDF) on 2017-07-12. Retrieved 2017-06-23.
  8. "2018 సంవత్సరానికి బాల సాహిత్య పురస్కారాల ప్రకటన" (PDF). Archived from the original (PDF) on 2018-07-12. Retrieved 2018-06-25.
  9. "Sahitya Akademi announces Bal Sahitya Puraskar and Yuva Puraskar 2019". pib.gov.in. Archived from the original on 2019-10-06. Retrieved 2019-10-06.
{{bottomLinkPreText}} {{bottomLinkText}}
సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం
Listen to this article