From Wikipedia, the free encyclopedia
సుందిళ్ళ బ్యారేజి కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా పెద్దపల్లి జిల్లా, కమాన్పూర్ మండలంలోని సుందిళ్ళ వద్ద నిర్మించిన బ్యారేజీ. గోదావరి నది లోని నీటిని తాగునీరు, నీటిపారుదల కోసం ఉపయోగించుకోవడమే ప్రధాన లక్ష్యంగా సుందిళ్ళ బ్యారేజి నిర్మించబడింది. యెల్లంపల్లి & మేడిగడ్డ మధ్య మూడు బారేజ్లను నిర్మించే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో ప్రతిపాదించిన బారేజిల్లో సుందిళ్ళ బ్యారేజి ఒకటి.
సుందిళ్ళ బ్యారేజి | |
---|---|
సుందిళ్ళ బ్యారేజి | |
ప్రదేశం | సుందిళ్ళ, కమాన్పూర్ మండలం, పెద్దపల్లి జిల్లా |
అక్షాంశ,రేఖాంశాలు | 18°44′08.6″N 79°36′39.6″E |
స్థితి | నిర్మాణంలో ఉంది |
నిర్మాణం ప్రారంభం | 02 మే, 2016 |
ప్రారంభ తేదీ | 21 జూలై, 2019 |
యజమాని | తెలంగాణ ప్రభుత్వం |
ఆనకట్ట - స్రావణ మార్గాలు | |
ఆనకట్ట రకం | బ్యారేజి |
నిర్మించిన జలవనరు | గోదావరి నది |
Spillways | 41 |
జలాశయం | |
సృష్టించేది | సుందిళ్ళ బ్యారేజి |
మొత్తం సామర్థ్యం | 5 tmcft |
విద్యుత్ కేంద్రం | |
నిర్వాహకులు | తెలంగాణ రాష్ట్రం |
Type | బ్యారేజి |
2016 మే 2న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారం వద్ద నిర్మించే బ్యారేజి పనులకు శంకుస్థాపన చేశారు.[1] గోదావరి నది నుంచి 160 టీఎంసీల నీటిని తరలించడం ద్వారా 16,50,000 ఎకరాలకు సాగునీరందించే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా కరీంనగర్ జిల్లా మహాదేవపూర్ మండలంలోని అన్నారం వద్ద బ్యారేజీ నిర్మించి రివర్స్ పంపింగ్ విధానం ద్వారా నీటిని ఎత్తిపోయడానికి డిజైన్ చేశారు.[2]
అంచనా బ్యారేజి వివరాలు:
బ్యారేజి | బెడ్ స్థాయి (మీటర్లు) | చెరువు స్థాయి (మీటర్లు) | స్థూల నిల్వ (TMC లో) | గేట్ల సంఖ్య |
---|---|---|---|---|
సుందిళ్ళ బ్యారేజి | 118.0 | 130.0 | 8.9 |
2019, జూలై 22న ప్రారంభించబడింది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.