సోనీ
From Wikipedia, the free encyclopedia
సోనీ కార్పొరేషన్ జపాన్ దేశానికి చెందిన బహుళజాతి వ్యాపార సంస్థ. దీని ప్రధాన కార్యాలయం టోక్యోలోని కొనన్ మినాటోలో ఉంది. సోనీ గ్రూప్ లో సోనీ కార్పొరేషన్, సోనీ సెమికండక్టర్ సొల్యూషన్స్, సోనీ ఎంటర్టైన్మెంట్ (సోనీ పిక్చర్స్, సోనీ మ్యూజిక్ గ్రూప్), సోనీ ఇంటరాక్టివ్ ఎంటర్టైన్మెంట్, సోనీ ఫైనాన్షియల్ గ్రూప్ మొదలైన సంస్థలు ఉన్నాయి. సోనీని 1946 లో మసారు ఇబుక, అకియో మొరీటా కలిసి టోక్యో సుషిన్ కోగ్యో అనే పేరుతో స్థాపించారు. ఈ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ట్రాన్సిస్టర్ రేడియో TR-55, ఇంటిలో వాడే వీడియో టేప్ రికార్డర్ CV-2000, ఎక్కడికైనా తీసుకుని వెళ్ళగలిగిన ఆడియో ప్లేయర్ వాక్మన్, CDP-101 అనబడే సిడీ ప్లేయర్ లాంటి అనేక ఉత్పత్తులు తీసుకువచ్చింది. తర్వాత వైవిధ్యమైన వ్యాపారాల్లోకి అడుగుపెట్టింది. ఈ సంస్థ ప్రధానంగా ఎలక్ట్రానిక్స్, ఆటలు, వినోదం మొదలైన రంగాల్లో వ్యాపారాలు నిర్వహిస్తుంది. ఈ సంస్థ రెండు రకాల ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ప్రముఖ తయారీదారులు, ఒకటి - వినియోగదారుల కొరకు, రెండు - వృత్తిపరమైన మార్కెట్లు . సోనీ ఫార్చ్యూన్ గ్లోబల్ 500 యొక్క 2012 జాబితాలో 87 వ స్థానంలో ఉంది.
నాణ్యతను మెరుగుపరచేందుకు గాను ఈ వ్యాసానికి శుద్ది అవసరం. వికీపీడియా శైలిని అనుసరించి వ్యాసాన్ని మెరుగు పరచండి. వ్యాసంలో మెరుగు పరిచవలసిన అంశాల గురించి చర్చా పేజిలో చర్చించండి. లేదా ఈ మూస స్థానంలో మరింత నిర్దుష్టమైన మూస పెట్టండి. |
Type | పబ్లిక్ |
---|---|
Traded as | TYO: 6758 NYSE: SNE |
ISIN | JP3435000009 |
పరిశ్రమ | సంఘటిత సంస్థ |
స్థాపన | 7 మే1946[1] (as Tokyo Tsushin Kogyo) 1958 (as Sony) |
Founders | మసారు ఇబుకా అకియో మొరిటా |
ప్రధాన కార్యాలయం | మినాటో, టోక్యో, జపాన్ |
Areas served | ప్రపంచవ్యాప్తం |
Key people | Osamu Nagayama (Chairman of the Board) Kazuo Hirai (President & CEO) |
Products | కంస్యూమర్ ఎలక్ట్రానిక్స్ అర్ధవాహకాలు వీడియో గేమ్స్ మీడియా, వినోదం కంప్యూటర్ హార్డ్వేర్ టెలికాం పరికరాలు |
Services | ఆర్థిక సేవలు, బీమా, బ్యాంకింగ్, ఆర్థిక రుణాలు |
Revenue | US$ 72.349 billion (2013)[2] |
Operating income | US$ 2.448 billion (2013)[2] |
Net income | US$ 458 million (2013)[2] |
Total assets | US$ 151.131 billion (2013)[2] |
Total equity | US$ 28.523 billion (2013)[2] |
Number of employees | 146,300 (2013)[3] |
Subsidiaries | List of subsidiaries |
Website | Sony.net |