సౌదీ అరేబియా
From Wikipedia, the free encyclopedia
సౌదీ అరేబియా ( లేక కింగ్ డమ్ ఆఫ్ సౌదీ అరేబియా ) తూర్పు మధ్య దేశాలలో అతి పెద్ద అరబ్బు దేశం.
Kingdom of Saudi Arabia |
||||||
---|---|---|---|---|---|---|
నినాదం "ప్రభువెవ్వడూ లేడు అల్లాహ్ ను తప్పి; మహమ్మద్ అతని ప్రవక్త" (షహాద) |
||||||
జాతీయగీతం "ఆష్ అల్ మలీక్" "రాజు అమరుడౌను గాక" |
||||||
రాజధాని | రియాధ్ 24°39′N 46°46′E | |||||
అతి పెద్ద నగరం | రాజధాని | |||||
అధికార భాషలు | అరబ్బీ | |||||
ప్రభుత్వం | రాజరికం | |||||
- | సౌదీ అరేబియా రాజు | అబ్దుల్లాహ్ బిన్ అబ్దుల్ అజీజ్ | ||||
- | రాకుమారుడు | సుల్తాన్ బిన్ అబ్దుల్ అజీజ్ | ||||
స్థాపనము | ||||||
- | రాజ్యం ప్రకటింపబడినది | జనవరి 8, 1926 | ||||
- | గుర్తింపబడినది | మే 20, 1927 | ||||
- | కేంద్రీకరణ జరిగినది | సెప్టెంబరు 23, 1932 | ||||
విస్తీర్ణం | ||||||
- | మొత్తం | 2,149,690 కి.మీ² (14వది) 829,996 చ.మై |
||||
- | జలాలు (%) | negligible | ||||
జనాభా | ||||||
- | 2007 అంచనా | 27,601,038 1 (45th2) | ||||
- | జన సాంద్రత | 11 /కి.మీ² (205వది) 29 /చ.మై |
||||
జీడీపీ (PPP) | 2007 అంచనా | |||||
- | మొత్తం | $446 బిలియన్లు (27వది) | ||||
- | తలసరి | $21,200 (41వది) | ||||
మా.సూ (హెచ్.డి.ఐ) (2004) | 0.777 (medium) (76వది) | |||||
కరెన్సీ | రియాల్ (SAR ) |
|||||
కాలాంశం | AST (UTC+3) | |||||
- | వేసవి (DST) | (not observed) (UTC+3) | ||||
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | .sa | |||||
కాలింగ్ కోడ్ | +966 | |||||
1 | Population estimate includes 5,576,076 non-nationals. | |||||
2 | Rank is based on 2005 figures. |
Kingdom of Saudi Arabia المملكة العربية السعودية Al-Mamlakah al-Arabiyah as-Sa'ūdiyah | |
---|---|
నినాదం: لا إله إلا الله، محمد رسول الله "Lā ʾilāha ʾillāl–lāh, Muhammadun rasūl allāh" "There is no god but God; Muhammad is the messenger of God."[1][lower-alpha 1] (Shahada) | |
గీతం: السلام الملكي (as an instrumental) "as-Salām al-Malakiyy" "The Royal Salute" | |
రాజధాని and largest city | Riyadh |
అధికార భాషలు | Arabic language[5] |
జాతులు | 90% Arab 10% Afro-Arab |
మతం | Sunni Islam (official)[6] |
పిలుచువిధం |
|
ప్రభుత్వం | Unitary state Islamic absolute monarchy |
• King of Saudi Arabia | Salman of Saudi Arabia |
• Crown Prince of Saudi Arabia | Muhammad bin Nayef |
• Deputy Crown Prince | Mohammad bin Salman Al Saud |
శాసనవ్యవస్థ | None (Legislation passed by the Council of Ministers)[lower-alpha 2] |
History of Saudi Arabia | |
• Unification of Saudi Arabia | 23 September 1932 |
విస్తీర్ణం | |
• మొత్తం | 2,149,690[5] km2 (830,000 sq mi) (13th) |
• నీరు (%) | 0.7 |
జనాభా | |
• 2014 estimate | 30,770,375[7] (41st) |
• జనసాంద్రత | 12.3/km2 (31.9/sq mi) (216th) |
GDP (PPP) | 2015 estimate |
• Total | $1,683 trillion[8] (14th) |
• Per capita | $53,624[8] (12th) |
GDP (nominal) | 2015 estimate |
• Total | $653.219 billion[8] (19th) |
• Per capita | $20,812[8] (38th) |
హెచ్‌డిఐ (2014) | 0.837[9] very high · 39th |
ద్రవ్యం | Saudi riyal (SR) (SAR) |
కాల విభాగం | UTC+3 (Arabia Standard Time) |
వాహనాలు నడుపు వైపు | right |
ఫోన్ కోడ్ | +966 |
ISO 3166 code | SA |
Internet TLD |
|
|
సౌదీ అరేబియా [lower-alpha 3] (/ˌsɔːdiː əˈreɪbiə/ ( listen), /ˌsaʊ-/ ( listen)), అధికారికంగా " కింగ్డం ఆఫ్ సౌదీ అరేబియా " (కె.ఎస్.ఎ) [lower-alpha 4] ఒక అరబ్ దేశం. ఇది పశ్చిమాసియాలో ఉంది. ఇది అరేబియన్ ద్వీపకల్పంలో అత్యధిక భాగం విస్తరించి ఉంది. దేశం వైశాల్యం 50,000 చ.కి.మీ. భౌగోళికంగా సౌదీ అరేబియా ఆసియా దేశాలలో 5వ స్థానంలో, అరబ్ ప్రపంచంలో 2వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో అల్జీరియా ఉంది. దేశ ఉత్తర సరిహద్దులలో జోర్డాన్, ఇరాక్, ఈశాన్య సరిహద్దులో కువైట్, తూర్పు సరిహద్దులో కతర్,బహ్రయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆగ్నేయ సరిహద్దులో ఓమన్, దక్షిణ సరిహద్దులో యెమన్ దేశాలు ఉన్నాయి. ఎర్రసముద్రం, పర్షియన్ గల్ఫ్ సముద్రతీరాలు ఉన్న ఒకేఒక దేశం సైదీ అరేబియా మాత్రమే. దేశంలో అత్యధికంగా ఇసుకతో నిండిన ఎడారి, నిర్మానుష్యమైన భూభాగాలు ఉన్నాయి. ఆధునిక సౌదీ అరేబియాలో నాలుగు ప్రాంతాలు ఉన్నాయి. అవి వరుసగా హెజాజ్, నజ్ద్, తూర్పు అరేబియా లోని భూభాగాలు (అల్- అషా), దక్షిణ అరేబియా (అసిర్) ప్రాంతాలు. [10] కింగ్డం ఆఫ్ సౌదీ అరేబియా ఇబ్న్ సౌదీ చేత 1932 లో స్థాపించబడింది. ఆయన నాలుగు ప్రాంతాలను ఒకే దేశంగా రూపొందించాడు. ఆయన తన పూర్వీక స్థానం అయిన 1902 లో రియాద్ మీద వియం సాధించి, తరువాత సౌదీ అరేబియా సంపూర్ణ రాజ్యంగా మారింది. తరువాత వారస్త్వంగా ఇస్లామిక్ రాజవ్యవస్థ దేశాన్ని పాలిస్తూ ఉంది. [11][12] సున్నీ ముస్లిముల మద్య తలెత్తిన తీవ్రమైన సంప్రదాయవాద మతమైన వహ్హాదిజం ఉద్యమం " ప్రధానమైన సౌదీ సంప్రదాయం "గా భావించబడుతుంది. [11][12] సౌదీ అరేబియా " లాండ్ ఆఫ్ ది టూ హోలీ మసీద్ " అని అభివర్ణించబడింది. మసీద్- అల్ - హరం (మక్కా) , అల్- మసీద్ అన్- నబావి (మదీనా) అనే ఇస్లాం మతస్థుల అతిపవిత్ర ప్రదేశాలు సౌదీలో ఉన్నాయి. దేశం మొత్తం జనసంఖ్య 28.7 మిలియన్లు. వీరిలో సౌదీ పౌరులు 20 మిలియన్లు ఉండగా 8 మిలియన్లు విదేశీయులు ఉన్నారు.[13][14][15] 1938లో పెట్రోలియం కనుగొనబడింది. పెట్రోల్ నిక్షేపాలు షియా ముస్లిములు అధికంగా ఉన్న సౌదీ అరేబియాలోని తూర్పు ప్రాంతంలో కనుగొనబడ్డాయి.[16] తరువాత సౌదీ అరేబియా ప్రపంచంలో అతిపెద్ద ఆయిల్ ఉత్పత్తి దేశంగా మారింది. ఆయిల్ ఉత్పత్తిలో సౌదీ అరేబియా ద్వితీయ స్థానంలో ఉంది. అలాగే సహజవావువు ఉత్పత్తిలో 6వ స్థానంలో ఉంది.[17] దేశాన్ని హై హ్యూమన్ డెవెలెప్మెంట్ ఇండెక్స్‌తో హై ఇంకం ఎకనమీగా వరల్డ్ బ్యాంక్ వర్గీకరించింది.[18] జి-20 దేశాలలో చోటు చేసుకున్న ఒకేఒక దేశం సౌదీ అరేబియా.[19][20] సౌదీ అరేబియా ఎకనమీ అతి తక్కువగా గల్ఫ్ కార్పొరేషన్ వైపు మళ్ళించబడింది. సేవారంగం , ఉత్పత్తి రంగానికి పెట్టుబడులు తక్కువగానే ఉన్నాయి. ఆయిల్ వెలికితీతకు మాత్రమే ప్రభుత్వ ధనం వ్యయం చేయబడుతుంది.[21] రాజరిక నిరంకుశత్వం [22][23] మిలటరీ కొరకు అత్యధికంగా వ్యయం చేస్తున్న ప్రపంచ దేశాలలో సౌదీ అరేబియా ఒకటి.[24][25] ప్రపంచదేశాలలో సౌదీ అరేబియా 2010-14 లో అత్యధికంగా ఆయుధాలను దిగుమతి చేసుకున్నట్లు ఎస్,ఐ.పి.ఆర్ పరిశోధన తెలియజేసింది.[26] సౌదీ అరేబియా ప్రాంతీయ మధ్యశక్తిగా భావించబడుతుంది. [27] సౌదీ అరేబియా ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోపరేషన్ , ఒ.పి.ఇ.సి.[28] ప్రజాస్వతంత్ర కొరత కారణంగా దేశం తరచూ విమర్శకు గురౌతూ ఉంది. ఫ్రీడం హౌస్ దేశాన్ని " నాట్ ఫ్రీ "గా వర్గీకరించింది.[29] సౌదీలో స్త్రీల హక్కులు,[30] అలాగే మరణశిక్ష అమలు కూడా సౌదీని విమర్శకు గురిచేస్తుంది.[31]