స్వామినారాయణ దేవాలయం (హ్యూస్టన్)
టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టన్ నగరంలో స్వామినారాయణ్ సంస్థచే నిర్మించబడిన సాంప్రదాయ హిందూ / From Wikipedia, the free encyclopedia
స్వామినారాయణ దేవాలయం, టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టన్ నగరంలో స్వామినారాయణ్ సంస్థచే నిర్మించబడిన సాంప్రదాయ హిందూ దేవాలయం.[1] మహంత్ స్వామి మహారాజ్ నేతృత్వంలోని స్వామినారాయణ్ సంస్థ, హిందూమతంలోని స్వామినారాయణ సంస్థకు చెందినది. ఇది 11,500 చదరపు అడుగుల (1,070 చదరపు మీటర్లు), 73-foot (22 m) ఎత్తైన దేవాలయం. చుట్టుపక్కల డెక్ 25,620 చ.అ. (2,380 చ.మీ.) ఉంది. 2004 జూలైలో దేవాలయాన్ని నిర్మించడానికి $7 మిలియన్లు ఖర్చు చేశారు. భారతదేశంలోని 3,000 మంది కళాకారులు ఇటాలియన్ పాలరాయి, టర్కిష్ సున్నపురాయితో దేవాలయానికి కావలసిన నగిషీలను చెక్కారు. నగిషీల ముక్కలు హ్యూస్టన్‌కు రవాణా చేయబడ్డాయి, 2002 మార్చిలో దేవాలయ నిర్మాణం ప్రారంభమైంది. కొంతమంది భారతీయలతోపాటు మొత్తం 175 మంది వాలంటీర్లు దేవాలయాన్ని నిర్మించడంలో సహాయం చేశారు.[2] 33,000 పాలరాయి, సున్నపురాయి నగిషీలతో 28 నెలల్లో దేవాలయం నిర్మాణం పూర్తయింది.
స్వామినారాయణ దేవాలయం (హ్యూస్టన్) | |
---|---|
భౌగోళికం | |
దేశం | యునైటెడ్ స్టేట్స్ |
రాష్ట్రం | టెక్సాస్ |
ప్రదేశం | ఫోర్ట్ బెండ్ కౌంటీ |
సంస్కృతి | |
దైవం | స్వామి నారాయణ రాధాకృష్ణ సీత-రాముడు శివుడు-పార్వతి |
వాస్తుశైలి | |
నిర్మాణ శైలులు | శిల్పశాస్త్రం |
చరిత్ర, నిర్వహణ | |
నిర్మించిన తేదీ | 2004 జూలై |
సృష్టికర్త | ప్రముఖ్ స్వామి మహారాజ్ |
వెబ్సైట్ | houston.baps.org |
ఈ దేవాలయం, పురాతన హిందూ గ్రంథాల ప్రకారం నిర్మించబడింది. 22 ఎకరాలలో దేవాలయ ప్రాంగణం విస్తరించి ఉంది. ఇక్కడ దేవాలయలంతోపాటు, హవేలీ, అండర్ స్టాండింగ్ హిందూయిజం ఎగ్జిబిషన్ ఉన్నాయి.[3] ఇక్కడ వారానికోసారి సభలు జరుగుతాయి. ప్రతిరోజూ ఆరాధనలు, సందర్శకుల కోసం ఈ దేవాలయం తెరిచే ఉంటుంది.