From Wikipedia, the free encyclopedia
హర్యానా రాష్ట శాసనసభలోని మొత్తం 90 మంది శాసన సభ్యులను ఎన్నుకునేందుకు 2024 హర్యానా శాసనసభ ఎన్నికలు 2024 అక్టోబరులో జరుగుతాయి. [1]
హర్యానా శాసనసభ పదవీకాలం 2024 నవంబరు 3న ముగుస్తుంది. [2]2019 హర్యానా శాసనసభ ఎన్నికలు అక్టోబరులో జరిగాయి. ఎన్నికల తర్వాత, భారతీయ జనతా పార్టీ, జననాయక్ జనతా పార్టీలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి, మనోహర్ లాల్ ఖట్టర్ హర్యానా ముఖ్యమంత్రి అయ్యారు. [3]
పోలింగ్ కార్యక్రమాలు | షెడ్యూల్ |
---|---|
నోటిఫికేషన్ తేదీ | TBD |
నామినేషన్ దాఖలుకు చివరి తేదీ | TBD |
నామినేషన్ పరిశీలన తేదీ | TBD |
నామినేషన్ ఉపసంహరణకు చివరి తేదీ | TBD |
పోలింగ్ తేదీ | TBD |
ఓట్ల లెక్కింపు తేదీ | TBD |
కూటమి/పార్టీ | జెండా | గుర్తు | నాయకుడు | పోటీ చేసే సీట్లు | |||
---|---|---|---|---|---|---|---|
భారతీయ జనతా పార్టీ | మనోహర్ లాల్ ఖట్టర్ | TBD | |||||
భారత జాతీయ కాంగ్రెస్ | భూపిందర్ సింగ్ హుడా | TBD | |||||
జననాయక్ జనతా పార్టీ | దుష్యంత్ చౌతాలా | TBD | |||||
భారత జాతీయ లోక్ దళ్ | అభయ్ సింగ్ చౌతాలా | TBD | |||||
ఆమ్ ఆద్మీ పార్టీ | సుశీల్ గుప్తా [4] | ||||||
హర్యానా లోఖిత్ పార్టీ | గోపాల్ కంద్ | TBD | |||||
బహుజన్ సమాజ్ వాదీ పార్టీ | రాజ్బీర్ సోర్ఖీ [5] | TBD | |||||
శిరోమణి అకాలీదళ్ | శరంజిత్ సింగ్ సోథ్ | TBD | |||||
2023 నవంబర్‌లో ఎన్నికలు జరుగుతాయని భావించిన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ఒక సంవత్సరం ముందు ర్యాలీతో ప్రారంభించింది. రాదౌర్‌లో జరిగిన ర్యాలీలో హర్యానా రాస్తా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా మాట్లాడుతూ, సబ్సిడీ వంట గ్యాస్ సిలిండర్లు, పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరణ వృద్ధాప్య పెన్షన్‌ను ₹ 6,000 కు పెంచుతామని హర్యానా రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు. భూపిందర్ సింగ్ హుడా చెరకు మద్దతు ధరను క్వింటాల్‌కు ₹450కి పెంచుతామని హర్యానా రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు. కాంగ్రెస్ లావో, దేశ్ బచావో (కాంగ్రెస్‌ను ఎన్నుకోండి, దేశాన్ని రక్షించండి) అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. కాంగ్రెస్ ప్రచారం నిరుద్యోగం, నేరాలు, అవినీతి రైతుల దుస్థితి వంటి ముఖ్యమైన పౌర సమస్యలను ఎత్తిచూపడమే లక్ష్యంగా పెట్టుకుందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు అఫ్తాబ్ అహ్మద్ పేర్కొన్నారు. [6] [7]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.