భారత వాతావరణ శాఖ
From Wikipedia, the free encyclopedia
భారత వాతావరణ శాఖ (ఆంగ్లం: India Meteorological Department (ఐఎండీ) ) అనేది భారత ప్రభుత్వ భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖకు చెందిన ఒక ఏజెన్సీ. ఇది వాతావరణ పరిశీలనలు, వాతావరణ అంచనా, భూకంప శాస్త్రానికి బాధ్యత వహించే ప్రధాన ఏజెన్సీ. ఐఎండీ ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది. భారతదేశం అంతటాను, అంటార్కిటికా లోనూ వందల కొద్దీ అబ్జర్వేషన్ స్టేషన్లను ఇది నిర్వహిస్తోంది. దీనికి చెన్నై, ముంబై, కోల్‌కతా, నాగ్‌పూర్, గౌహతి, న్యూఢిల్లీలలో ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి.
సంస్థ వివరాలు | |
---|---|
స్థాపన | 1875 (1875) |
అధికార పరిధి | భారత ప్రభుత్వం |
ప్రధానకార్యాలయం | మౌసమ్ భవన్, న్యూ ఢిల్లీ |
వార్షిక బడ్జెట్ | ₹514.03 crore (US$64 million) (2022)[1] |
మాతృ విభాగం | కేంద్ర భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖ |
ప్రపంచ వాతావరణ సంస్థ(World Meteorological Organization) వారి ఆరు ప్రాంతీయ ప్రత్యేక వాతావరణ కేంద్రాలలో ఐఎండీ కూడా ఒకటి. మలక్కా జలసంధి, బంగాళాఖాతం, అరేబియా సముద్రం, పర్షియన్ గల్ఫ్‌తో సహా ఉత్తర హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఉష్ణమండల తుఫానుల గురించి అంచనా వేయడం, పేరు పెట్టడం, హెచ్చరికల పంపిణీ బాధ్యత దీనికి ఉంది.