క్రికెట్‌లో, బ్యాటరు ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడానికి బయటకు వచ్చి, ఇన్నింగ్స్ ముగిసే సమయానికి ఔట్ కాకపోతే అతను నాటౌట్ అని అంటారు. [1] వారి ఇన్నింగ్స్ ఇంకా కొనసాగుతున్నప్పుడు కూడా బ్యాట్స్‌మన్ నాటౌట్ అనే అంటారు.

Thumb
లార్డ్స్‌లో ఇంగ్లాండు న్యూజీలాండ్ జట్ల మధ్య 2013 లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో స్కోరుబోర్డు. న్యూజీలాండ్ ఇన్నింగ్సు ముగిసిన తరువాత ట్రెంట్ బౌల్ట్ నాటౌట్‌గా ఉన్నట్లు చూపిస్తోంది.

నాటౌట్‌గా ఉండే సమయాలు

ప్రతి ఇన్నింగ్స్ ముగింపులో కనీసం ఒక్క బ్యాటర్ అయినా అవుట్ కాకుండా ఉంటారు. ఎందుకంటే పది మంది బ్యాటర్లు ఔటైన తర్వాత, పదకొండవ ఆటగాడు బ్యాటింగ్ చేయడానికి భాగస్వామి ఉండడు కాబట్టి ఆ జట్టు ఇన్నింగ్స్ ముగుస్తుంది. సాధారణంగా ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో బ్యాటింగ్ జట్టు ఆలౌట్ అవకుండానే డిక్లేర్ చేస్తే, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఆలౌట్ అవక ముందే నిర్ణీత ఓవర్ల సంఖ్య ముగిస్తే ఆ సమయానికి ఇద్దరు బ్యాటర్లు నాటౌట్‌గా ఉంటారు.

నాట్ అవుట్ బ్యాటర్ల కంటే బ్యాటింగ్ ఆర్డర్‌లో మరింత దిగువన ఉన్న బ్యాటర్లు క్రీజులోకి రారు. వారిని నాటౌట్ అని కాకుండా బ్యాటింగ్ చేయలేదు (డిడ్ నాట్ బ్యాట్) అంటారు; [2] దీనికి విరుద్ధంగా, క్రీజులోకి వచ్చిన బ్యాటరు అసలు బంతులు ఎదుర్కొనకపోయినా నాటౌట్ అంటారు. గాయపడి రిటైరైన బ్యాటర్‌ను నాటౌట్‌గా పరిగణిస్తారు; గాయపడని బ్యాటర్ రిటైరైన (అరుదైన సందర్భం) రిటైర్డ్ అవుట్ గా పరిగణిస్తారు.

సూచిక

ప్రామాణిక సంజ్ఞామానంలో బ్యాటరు తుది స్థితి నాట్ అవుట్ అని చూపించడానికి స్కోరు పక్కన నక్షత్రాన్ని చేరుస్తారు; ఉదాహరణకు, 10* అంటే '10 నాటౌట్' అని అర్థం.

బ్యాటింగ్ సగటులపై ప్రభావం

బ్యాటింగ్ సగటులు వ్యక్తిగతమైనవి. చేసిన పరుగులను అవుటైన ఇన్నింగ్సుల సంఖ్యతో భాగించగా వచ్చిన సంఖ్యను బ్యాటింగు సగటు అంటారు. కాబట్టి తరచుగా ఇన్నింగ్స్‌ను నాటౌట్‌గా ముగించే ఆటగాడి బ్యాటింగు సగటు ఎక్కువగా కనిపిస్తుంది.[3] MS ధోని (వన్‌డేల్లో 84 నాటౌట్‌లు), మైఖేల్ బెవన్ (వన్‌డేల్లో 67 నాటౌట్‌లు), జేమ్స్ అండర్సన్ (237 టెస్ట్ ఇన్నింగ్స్‌లలో 101 నాటౌట్‌లు) లు దీనికి ఉదాహరణలు. బిల్ జాన్‌స్టన్ 1953 ఆస్ట్రేలియన్ ఇంగ్లండ్ పర్యటనలో బ్యాటింగ్ సగటులలో అగ్రస్థానంలో ఉన్నాడు.[3]

చేసిన పరుగులను ఆడిన ఇన్నింగ్స్‌ల తో భాగహారించే సూత్రం, కింది కారణాల వల్ల అసలు పనితీరును తక్కువగా చూపుతుంది:

  • సాధారణంగా ఇన్నింగ్సు చివర్లో వచ్చి, అత్యధిక స్కోరు చేసే బ్యాటరుకు బ్యాటింగు చేసే అవకాశం కొద్దిసేపే ఉంటుంది. తక్కువ సంఖ్యలో బంతులను ఎదుర్కొంటూ, వారు తక్కువ స్కోర్లు చేసి, నాటౌట్‌గా మిగులుతారు. నాట్ అవుట్‌లను కూడా అవుట్‌లుగానే పరిగణించినట్లయితే, తమ నియంత్రణలో లేని అంశాలకు వాళ్ళకు నష్టం కలుగుతుంది.
  • ఇన్నింగ్స్ ప్రారంభంలో బ్యాటరు నిలదొక్కుకునే లోపు వారు ఔటయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా, 40 పరుగుల ఒక్క స్కోరు చేయడం కంటే రెండుసార్లు 20 నాటౌట్ (అంటే సగటున 40) చెయ్యడం మెరుగైన విజయం కావచ్చు. రెండవ సందర్భంలో బ్యాటరు రెండు రకాల పరిస్థితులను ఎదుర్కొంటాడు. మొదటి సందర్భంలో మాత్రం ఒకే రకమైన పరిస్థితులను ఎదుర్కొంటాడు కాబట్టి అది మొదటిదాని కంటే కొంత సులువుగా ఉంటుంది.

పరస్పరం సమతుల్యతలో ఉండే పై అంశాల కారణంగా 18 వ శతాబ్దం నుండీ వాడుతున్న ఈ సూత్రాన్నే (పరుగులను ఔట్లతో భాగహారించడం) 21వ శతాబ్దంలో కూడా క్రికెట్ గణాంకవేత్తలు వాడుతున్నారు.

మూలాలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.