పబ్మెడ్
From Wikipedia, the free encyclopedia
పబ్మెడ్ అనేది లైఫ్ సైన్సెస్, బయోమెడికల్ అంశాలకు సంబంధించిన ఉచిత సెర్చి ఇంజను. ఇది ప్రధానంగా రిఫరెన్స్‌లు, సారాంశాల MEDLINE డేటాబేస్‌ను యాక్సెస్ చేస్తుంది. అమెరికా లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌లోని యునైటెడ్ స్టేట్స్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ (NLM) ఎంట్రెజ్ సిస్టమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిట్రీవల్లో భాగంగా ఈ డేటాబేసును నిర్వహిస్తుంది. [1]
త్వరిత వాస్తవాలు Contact, పరిశోధనా కేంద్రం ...
Contact | |
---|---|
పరిశోధనా కేంద్రం | United States National Library of Medicine (NLM) |
విడుదల తేదీ | జనవరి 1996; 28 సంవత్సరాల క్రితం (1996-01) |
మూసివేయి
1971 నుండి 1997 వరకు, MEDLINE డేటాబేస్‌ను ఆన్లైన్లో అందుకోగలిగే అనుమతి ప్రాథమికంగా విశ్వవిద్యాలయ లైబ్రరీల వంటి సంస్థాగత సౌకర్యాల వారికే ఉండేది. పబ్మెడ్, 1996 జనవరిలో మొదటిసారిగా విడుదలై, ప్రైవేటు వ్యక్తులకు, ఉచితంగా, ఇంటికీ, కార్యాలయానికీ -మెడ్లైన్ శోధన యుగానికి నాంది పలికింది. [2] 1997 జూన్ నుండి పబ్మెడ్ వ్యవస్థ ప్రజలకు ఉచితంగా అందిస్తున్నారు. [3]