అణు విద్యుత్
From Wikipedia, the free encyclopedia
Remove ads
అణు విద్యుత్ లేదా అణు శక్తి అనగా ఒక పదార్థం యొక్క పరమాణు కేంద్రకాలను పట్టి ఉంచే ఒక శక్తి. పరమాణువులు (Atoms) అంటే పదార్థాన్ని విడగొడుతూ పోతే చివరికి మిగిలే అతి సూక్ష్మమైన కణాలు. ప్రతి పరమాణువుకు ఒక కేంద్రం ఉంటుంది. వీటిలోనే అణుశక్తి దాగి ఉంటుంది. కొన్ని రేడియో ధార్మిక పదార్థాలకు సంబంధించిన కొన్ని పరమాణువులు ఈ శక్తినంతటినీ దాచుకోకుండా కొంత భాగాన్ని వికిరణ (రేడియేషన్) రూపంలో బయటకు వెదజల్లుతూ ఉంటాయి.[1]

ఈ అణుశక్తిని వెలికితీయడానికి ప్రధానంగా రెండు పద్దతులున్నాయి. ఒకటి కేంద్రక విచ్ఛిత్తి మరొకటి కేంద్రక సంలీనం. కేంద్రక విచ్ఛిత్తి అంటే ఒక పరమాణువును రెండుగా విడగొట్టడం. కేంద్రక సంలీనం అంటే రెండు పరమాణువులను కలిపి ఒక అణువును తయారు చేయడం. ఈ రెండు పద్ధతుల్లోనూ అపారమైన శక్తి విడుదలౌతుంది. ఈ ప్రక్రియ ప్రకృతి సిద్ధంగా కూడా జరుగుతుంది. ఉదాహరణకు సూర్యుడి నుంచి వేడిమి పుట్టడానికి కేంద్రక సంలీనమే కారణం. అణు విద్యుత్కేంద్రాలలో కేంద్రక విచ్ఛిత్తిని ఉపయోగించి విద్యుదుత్పత్తి చేస్తారు. ఈ రెండూ ప్రక్రియలను అణ్వాయుధాల తయారీలో కూడా వాడతారు.
Remove ads
ఇవి కూడా చూడండి
- కేంద్రక విచ్ఛిత్తి - అణువు యొక్క కేంద్రకాన్ని చిన్న భాగాలుగా విడగొట్టే ప్రక్రియ ద్వారా అణు విద్యుత్‌ను ఉత్పత్తి చేయగల ఒక పద్ధతి.
- కేంద్రక సంలీనం - రెండు పరమాణువుల యొక్క కేంద్రకాలను ఒకే ఒక కేంద్రంగా కలిపే ప్రక్రియ ద్వారా అణు విద్యుత్‌ను ఉత్పత్తి చేయగల ఒక పద్ధతి
- అణు రియాక్టరు - కేంద్రక విచ్ఛిత్తి లేదా కేంద్రక సంలీనం పద్ధతుల ద్వారా అణు విద్యుత్‌ను ఉత్పత్తి చేసే పరికరము
- ద ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ - అణు విద్యుత్‌ను తయారు చేసేందుకు ఫ్రాన్స్ లో నిర్మించతలపెట్టిన అతిపెద్ద కేంద్రక సంలీన అణు రియాక్టరు.
Remove ads
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads