అనంతపురం

ఆంధ్ర ప్రదేశ్, అనంతపురం జిల్లా లోని నగరం From Wikipedia, the free encyclopedia

అనంతపురం
Remove ads

అనంతపురం, ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా నగరం, జిల్లా కేంద్రం. అనంతపురం మండలానికి , రెవెన్యూ విభాగానికి కేంద్రం. 1799 లో దత్తమండలాలకు కేంద్రంగా వుండేది. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో బ్రిటీషు వారికి వ్యూహాత్మక స్థావరంగా వుండేది. నగరంలో పలు విశ్వవిద్యాలయాలున్నాయి. ఇక్కడి రథం ఆకారంలో గల ఇస్కాన్ దేవాలయం ప్రముఖ పర్యాటక ఆకర్షణ.

త్వరిత వాస్తవాలు అనంతపురం, దేశం ...
Remove ads

పేరు వ్యుత్పత్తి

అనంతపురం అన్న గ్రామనామాలు వ్యక్తి నామసూచిగా పరిశోధకులు వర్గీకరిస్తున్నారు.[2]

చరిత్ర

ఇది 1799లో దత్త మండలానికి (రాయలసీమతో కూడిన బళ్ళారి) కేంద్రంగా ఉండేది. అనంతపురానికి సర్ థామస్ మన్రో మొదటి కలెక్టరు. రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటీషు భారత సైన్యానికి అనంతపురం వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగి ఉంది.ఇప్పటి జె ఎన్ టి యు ప్రాంగణం అప్పట్లో ఆయుధ బంకరుగా వాడేవారు.వాటి అవశేషాలను ఈ ప్రాంగణంలో ఇప్పటికీ చూడవచ్చును.

భౌగోళికం

అనంతపురం భౌగోళిక స్థానం 14.68°N 77.6°E / 14.68; 77.6. దీని సరాసరి ఎత్తు 335 మీ (1099 అడుగులు). రాష్ట్ర రాజధాని అమరావతి నుండి నైఋతి దిశలో 505 కి.మీ దూరంలో ఉంది, తెలంగాణ రాజధాని హైదరాబాదు నుండి దక్షిణ దిశంలో సుమారు 360 కిలోమీటర్ల దూరంలో వుంది.

వాతావరణం

అనంతపురం శుష్క వాతావరణం కలిగిన ప్రదేశం. ఏడాదిలో అధికభాగం పొడిగా, వేడిమితో కూడి ఉంటుంది. ఫిబ్రవరి ద్వితీయార్థం నుండి వేసవి మొదలయి మేలో అత్యధిక ఉష్ణోగ్రత 40-42 డిగ్రీల సెంటీగ్రేడు (104 - 107.6 డిగ్రీల ఫారెన్ హీట్) సరాసరిగా నమోదవుతుంది. నైఋతి రుతుపవనాల వలన మార్చి లోనే తొలకరి జల్లులు పడతాయి. ఋతుపవనాలు సెప్టెంబరులో మొదలై నవంబరులో ముగుస్తుంది. వీటివలన 250 ఎం. ఎం. (9.8 ఇంచి) ల వర్షం నమోదవుతుంది. పొడిగా ఉండే తేలికపాటి శీతాకాలం నవంబరు ద్వితీయార్థంలో మొదలయి ఫిబ్రవరి ప్రథమార్థం వరకూ కొనసాగుతుంది. ఈ వాతావరణంలో ఉష్టోగ్రత యొక్క సరాసరి 30 నుండి 32 డిగ్రీల సెంటీగ్రేడు (86 నుండి 89.6 డిగ్రీల ఫారెన్ హీట్) గా నమోదవుతుంది. సాలీన వర్షపాతం 22 అంగుళాలు (560 ఎం ఎం).

జనగణన గణాంకాలు

2011 జనగణన ప్రకారం, నగర జనాభా 340,613. లింగ నిష్పత్తి 995/1000. 9% జనాభా 6 సంవత్సరాలలోపు పిల్లలు.[3] అక్షరాస్యత 82%. పురషుల అక్షరాస్యత 89% కాగా స్త్రీల అక్షరాస్యత 75%. అధికారిక భాష తెలుగు. ఉర్దూ, హిందీ, కన్నడ, తమిళాలు గణనీయమైన అల్ప సంఖ్యాకుల భాషలు.[4]

పరిపాలన

అనంతపురం నగరపాలక సంస్థ అనంతపురం జిల్లా లోని ఏకైక నగరపాలక సంస్థ.రాయలసీమ ప్రాంతంలో ఒక కుగ్రామంగా పురుడు పోసుకున్న 'అనంతపురం' అంచెలంచెలుగా ఎదుగుతూ నగర పాలక సంస్థగా రూపాంతరం చెందింది. బ్రిటీష్ ప్రభుత్వ హయాంలో 'స్థానిక' పాలన హోదాను దక్కించుకుని అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. అనాటి నుంచి 145 ఏళ్లు 'స్థానిక' పాలన సాగింది. 2014 దాకా 38 మంది ఛైర్మన్లు, ప్రత్యేక అధికారులు పాలించారు. వీరిలో 15 మంది ఛైర్మన్లు, 23 మంది ప్రత్యేక అధికారులు ఉన్నారు. 1869లో బ్రిటీష్ ప్రభుత్వం అనంతపురానికి మున్సిపాల్టీ హోదా కల్పించింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1952లో ఛైర్మన్ల వ్యవస్థ ఆరంభమైంది. 'ఎన్నిక' విధానం అమల్లోకి వచ్చింది.

Remove ads

రవాణా

బెంగళూరు-హైదరాబాదులను కలిపే జాతీయ రహదారి 44, క్రిష్ణగిరి-జోలదరాసి కలిపే జాతీయ రహదారి 42 అనంతపురం మీదుగానే వెళ్తుంది. అనంతపురం రైల్వే స్టేషన్ దక్షిణ మధ్య రైల్వే జోన్ గుంతకల్ డివిజన్ లో వుంది. సమీప విమానాశ్రయం 190 కిలో మీటర్ల దూరంలో బెంగళూరులో గల కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం

విద్య

నగరంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలలో కొన్ని:

వైద్యం

అనంతపురం ప్రభుత్వ వైద్యశాల, కిమ్స్ (KIMS), కె.సి. రామన్న హాస్పిటల్ నగరంలో ప్రముఖ ఆధునిక వైద్యశాలలు.

పర్యాటక ఆకర్షణలు

Thumb
ఇస్కన్ (ISKCON) దేవాలయం
  • ఇస్కన్ (ISKCON) దేవాలయం
  • శ్రీ మౌనగిరి క్షేత్రం (39 అడుగుల ఏకశిలా హనుమంతుని విగ్రహం)

ప్రముఖులు

Remove ads

మైదానాలు

చిత్రమాలిక

ఇవికూడా చూడండి

మూలాలు

వెలుపలి లంకెలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads