అన్నపూర్ణ మహారాణా
ఒడియ స్వాతంత్ర్య సమరయోధురాలు From Wikipedia, the free encyclopedia
Remove ads
అన్నపూర్ణ మహారాణా (నవంబర్ 3, 1917 - డిసెంబర్ 31, 2012) భారతదేశ స్వాతంత్ర్య సమరయోధురాలు, సామాజిక కార్యకర్త. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో చాలా చురుకుగా పనిచేసింది. సామాజిక, మహిళల హక్కుల కార్యకర్తగా[1] పనిచేసిన ఈవిడ గాంధీజీకి యొక్క దగ్గరి మిత్రురాలు.[2]
Remove ads
జననం
అన్నపూర్ణ 1917, నవంబర్ 3న గోపబంధు చౌదరి, రామదేవి దంపతులకు ఒడిశాలోని కటక్లో జన్మించింది.[1][3]
ఉద్యమంలో పాత్ర
అన్నపూర్ణ తల్లిదండ్రులు యునైటెడ్ కింగ్‌డమ్ నుండి భారత స్వాతంత్ర్య ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు.[1] తల్లిదండ్రుల స్ఫూర్తితో అన్నపూర్ణ పద్నాలుగు సంవత్సరాల వయస్సులోనే గాంధీజీకి మద్దతుగా ప్రచారం సాగించింది.[1] అంతేకాకుండా 1934లో గాంధీ ఆధ్వర్యంలో ఒరిస్సాలోని పూరి నుండి భద్రక్ వరకు జరిగిన "హరిజన్ పాద యాత్ర"లో పాల్గొన్నది.[1] 1942 ఆగస్టులో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమం భాగంగా శాసనోల్లంఘన నేరంకింద అరెస్టుకావడంతోపాటూ అనేకసార్లు అరెస్టు చేయబడింది.[1]
స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, భారతదేశంలోని స్త్రీలు, పిల్లల తరఫున వాదించడమేకాకుండా గిరిజన ప్రాంతంలోని పిల్లలకు రాయగడ జిల్లాలో ఒక పాఠశాలను కూడా ప్రారంభించింది.[1] వినోబా భావే ప్రారంభించిన భూదాన్ ఉద్యమంలో కూడా పాల్గొన్నది.[1] భారత అత్యవసర స్థితి విధించిన సమయంలో రామాదేవి చౌదరి యొక్క గ్రామీ సేవాక్ ప్రెస్ లోవార్తాపత్రికలు ప్రచురించేందుకు సహకరించింది. ప్రభుత్వం ఆ ఈ వార్తాపత్రికను నిషేధించడమేకాకుండా రామదేవి చౌదరి, నబకృష్ణ చౌదరి, హరేక్రునా మహాత్బాబ్, మన్మోహన్ చౌదరి, జేక్రుశన మొహంతి లను, ఇతర నాయకులను అరెస్టు చేయించింది.[4]
2012, ఆగస్టు 19న కటక్ లోని అన్నపూర్ణ ఇంటిలో జరిగిన వేడుకలో సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ ఒడిశా నుండి గౌరవ డిగ్రీ అందుకుంది.[5]
Remove ads
వివాహం
శరత్ చంద్ర మహారాణాతో అన్నపూర్ణ వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు (కుమారదేవ్ మహారాణా, జ్ఞానదేవ్ మహారాణా)
మరణం
అన్నపూర్ణ 96 సంవత్సరాల వయసులో సుదీర్ఘ అనారోగ్యంలో 2012, డిసెంబర్ 31న రాత్రి గం 10.30 నిముషాలకు కటక్, బహరాబాద్ లోని తన ఇంటిలో మరణించింది.[1] 2013 జనవరి 2న కటక్ లోని ఖన్నాగర్ శ్మశానంలో గౌరవ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.[2] ఈవిడ భర్త శరత్ మహారాణా 2009లో మరణించాడు.
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads