అమర్ కంటక్

From Wikipedia, the free encyclopedia

అమర్ కంటక్
Remove ads

అమర్‌ కంటక్‌ (Amarkantak; अमरकंटक) హిందువులు పవిత్రంగా బావించే నర్మదానది జన్మస్థానం. ఇది మధ్య ప్రదేశ్‌ రాష్ట్రంలో ఉన్నది. అపురూప మైన జలపాతాలు.. శిల్పకళ ఉట్టిపడే దేవాలయాలతో అలరారుతోంది. ప్రకృతి అందాలతో, ఆధ్యాత్మిక భావాలను ఒలికిస్తున్న అమర్‌ కంటక్‌ ప్రముఖ పర్యాటక కేంద్రంగా భాసిల్లుతుంది.[1]

త్వరిత వాస్తవాలు అమర్‌ కంటక్‌Amarkantak अमरकंटकAmraKutt, Country ...
Remove ads

విశేషాలు

Thumb
అమర్‌ కంటక్‌ అడవులలోంచి ప్రవహిస్తున్న నర్మదా నది
Thumb
అమర్‌ కంటక్‌ వద్ద నర్మదా గుండం

ఎటుచూసినా.. దేవదారు, సాల్‌, టేకు, దుగ్గిలం, కెండు లాంటి పెద్ద పెద్ద వృక్ష సంపద. పేర్లు కూడా సరిగా తెలియని పచ్చని తీగలతో అల్లుకున్న పొదలు. కటిక చీకటిగా, మౌన గంభీరంగా ఉండే ఆ ప్రాంతానికి వెళ్లాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిందే. పట్టపగలే ఎవరికైనా సరే వెన్నులో వణుకు పుట్టించే ఆ ప్రాంతం నుండి ధైర్యం చేసి అలా అలా ముందుకు సాగితే... కనుచూపు మేరలో ఎత్తైన కొండలతో కనిపించే పచ్చటి అరణ్య సౌందర్యం మీ ముందు కదలాడుతుంది. ఇంతటి అందాన్ని తనలో దాచుకున్న ప్రాంతమే అమర్‌ కంటక్‌. ఇది మధ్యప్రదేశ్‌లోని అనుప్పూర్‌ జిల్లాలో ఉంది. నర్మదానది జన్మస్థలంగా పేరుగాంచిన ఈ ప్రాంతం చేరుకోవాలంటే... దట్టమైన అడవుల గుండా ప్రయాణించాల్సి ఉంటుంది. అమర్‌ కంటక్‌ సముద్ర మట్టానికి 1060 మీటర్ల ఎత్తులో ఉంది. చంద్రవంశరాజైన పురూరవ చక్రవర్తి తన పాపపరిహారం నిమిత్తం మార్గం చెప్పమని బ్రాహ్మణులను కోరితే, దివినున్న నర్మదా నదియే పాప ప్రక్షాళనకు మార్గమని చెప్పారట. ఆయన తపస్సు ఫలితంగా దివినుంచి భువికి దిగివచ్చింది నర్మద. అలా అమర్‌ కంటక్‌ లో జన్మించిన నర్మదను తన చేతులతో తాకి తన పితృదేవతలకు తర్పణం చేసిన పురూరవుడు స్వర్గప్రాప్తి పొందాడట...!

Remove ads

నర్మదానది

పాపపరిహారార్థం పురూరవుడు తపస్సు చేస్తే.. శివుడు ప్రత్యక్షమై ‘నర్మదను దివి నుంచి భువికి పంపిస్తాను. మరి నర్మద ప్రవాహానికి అడ్డుగా నిలిచే వారెవర’ని ప్రశ్నిస్తాడట. వింధ్య పర్వత రాజు తన కుమారుడైన అమర్‌ కంటక్‌ అడ్డుగా నిలుస్తాడని చెప్పగా శివుడు నర్మదను అనుగ్రహించాడట. అలా నర్మదా నదీమతల్లి దివి నుండి భువికి వచ్చిందని ఓ పురాణ గాథ. నర్మదా నది స్థానిక మైకల్‌ కొండల్లో పుట్టి వింధ్య, సాత్పురా పర్వత శ్రేణుల మధ్య నుండి 1290 కిలోమీటర్ల మేర ప్రవహించి, అరేబియా సముద్రంలో ఐక్యమవుతుంటుంది. పశ్చిమ దిశగా ప్రయాణించి అరేబియాలో ఐక్యమయ్యే నదుల్లో నర్మదా, తపతి నదులు పేరెన్నికగన్నవిగా చెప్పవచ్చు.

Remove ads

పుట్టినచోటే గుడి

నర్మదానది పుట్టిన చోటనే నర్మదామాత గుడి వెలసింది. నర్మదామాత ఆలయం క్రీశ 1042-1122 మధ్యకాలంలో చేది రాజైన కర్ణదేవుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ గుడికి ఎదురుగా పార్వతీదేవి ఆలయం కూడా ఉంటుంది. ప్రతి శివరాత్రికి, నర్మదా జయంతికి, వైశాఖ పూర్ణిమకు ఇక్కడ జాతరలు జరుగుతుంటాయి. అన్నింటికంటే, శివరాత్రికి ఇక్కడ జరిగే జాతరే చాలా పెద్దది. అమర్‌ కంటక్‌ మూడు జిల్లాల కూడలిగా పేరుగాంచింది. వివిధ ప్రాంతాల నుండి వేలాదిమంది భక్తులు జాతరలు సమయంలో ఇక్కడికి చేరుకుంటారు. చాలామంది భక్తులు వంటలు చేస్తూ రాత్రంతా ఇక్కడే గడుపుతుంటారు. శివరాత్రినాడు నర్మదానదిలో స్నానం చేసి, ముందుగా శివుడిని దర్శించుకుని తరువాత నర్మదామాతను పూజించినట్లయితే పుణ్యం కలుగుతుందని భక్తులు నమ్ముతుంటారు. నర్మదాదేవి గుడి చుట్టూ పార్వతిదేవితోపాటు శివుడు, సీతా రాములు, హనుమంతుడి ఆలయాలు కూడా ఉన్నాయి.

పుణ్యం

నర్మదామాతను దర్శించే ముందు ఆలయ ప్రాంగణంలోని ఒక మీటరు కంటే తక్కువ ఎత్తులో చెక్కిన రాతి ఏనుగుబొమ్మ ఉంటుం ది. ఆ ఏనుగుబొమ్మ కాళ్ల మధ్యనుంచి దూరి ఒక వైపు నుండి మరో వైపునకు వెళ్ళాలి. ఇలా దూరితే మరింత పుణ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. అదే ఏనుగుపైన అంబారీ ఎక్కిన ఓ స్ర్తీ విగ్రహం తలలేకుండా మొండెం మాత్రమే ఉంటుంది. బహుశా ఔరంగజేబు జరిపిన దాడిలో తల ధ్వంసం అయి ఉండవచ్చుననే అభిప్రాయం ఇక్కడి ప్రజల్లో ఉంది.

కపిలధార

అమర్‌ కంటక్‌కు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండే కపిల ధార అనే ప్రాంతం ముఖ్యమైనది. నర్మదానది కపిల ధార వద్ద ఒక లోయగుండా ప్రవహిస్తుంటుంది. నూరు అడుగుల ఎత్తు నుంచి దూకే కపిల ధార జలపాతం ఓంకార శబ్దంతో దూకుతుంటుందని, ఆ నాదం వినేం దుకే చాలామంది పర్యాటకులు వస్తుంటారని స్థానికులు చెబుతుంటారు.

ఆధ్యాత్మక కేంద్రాలు

నర్మదామాత ఆలయానికి దగ్గర్లో శ్రీ శంకరాచార్య ఆశ్రమం, బర్ఫానాశ్రమం, కళ్యాణ సేవాశ్రమం, శ్రీ ఆదినాథ్‌ జైన్‌ మందిరం, మాయికీ బగియా గా వ్యవహరించే దేవతావనం, యంత్ర మందిరం తదితర ప్రాంతాలను కూడా సందర్శించవచ్చు. యంత్ర మందిరానికి దగ్గర్లోనే సోనే నది పుట్టిన స్థలం, రామకృష్ణ మందిరం లాంటి ప్రాంతా లనూ వీక్షించవచ్చు.

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads