అరుణ మిల్లర్

భారతదేశంలో జన్మించిన అమెరికా రాజకీయ నాయకురాలు. From Wikipedia, the free encyclopedia

అరుణ మిల్లర్
Remove ads

అరుణా కాట్రగడ్డ మిల్లర్ (జననం 1964 నవంబరు 6) భారతదేశంలో జన్మించిన అమెరికా రాజకీయ నాయకురాలు. మేరీలాండ్ రాష్ట్రపు ప్రతినిధుల సభలో సభ్యురాలు. ఈమె మాంట్‌గొమెరీ కౌంటీలోని 15వ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుంది.[1] మేరీలాండ్ శాసననియోజకవర్గం 15, విస్తీర్ణంలోనూ, జనాభాలోనూ మాంట్‌గొమెరీ కౌంటీలోకెల్లా అతిపెద్ద నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో బాయిడ్స్, క్లార్క్స్‌బర్గ్, డార్న్‌స్‌టౌన్, పూల్స్‌విల్, పటోమెక్, డికర్సన్, బార్న్‌స్‌విల్, బీల్స్‌విల్ లతో పాటు, గెయిథర్స్‌బర్గ్, ఉత్తర పటోమెక్, రాక్‌విల్ లోని కొన్నిప్రాంతాలు కూడా ఉన్నాయి. అప్రాప్రియేషన్స్ కమిటీ సభ్యురాలైన మిల్లర్, మేరీలాండ్ విధాన సభకు ఎన్నికైన తొలి భారతీయ అమెరికన్ మహిళ.

త్వరిత వాస్తవాలు అరుణ మిల్లర్, 10వ మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ ...

అరుణ మిల్లర్, వర్జీనియా, హవాయి, కాలిఫోర్నియాలతో పాటు మాంట్‌గొమెరీ కౌంటీలో పాతికేళ్లపాటు ఇంజనీరుగా పనిచేసింది. ఇంజనీరుగా మిల్లర్, పాఠశాలకు, ఉపాధికేంద్రాలకు, సామూహిక సదుపాయాలను అందరికీ అందుబాటులో ఉండేలా, పాదచారులకు, సైకిలు నడిపేవారికి, బస్సుల్లో ప్రయాణించేవారికి, వికలాంగులకు అనువుగా ఉండే విధంగా కార్యక్రమాలు రూపొందించింది. 2015లో మాంట్‌గొమెరీ కౌంటీ ప్రభుత్వ ఉద్యోగంనుండి విరమణ పొంది పూర్తిస్థాయిలో మేరీలాండ్ శాసనమండలి కార్యకలాపాల్లో నిమగ్నమైంది.

Remove ads

అరుదైన గౌరవం

అమెరికా 2023 మధ్యంతర ఎన్నికల్లో మేరీల్యాండ్‌ రాష్ట్రానికి 10వ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా అరుణా మిల్లర్‌ ఎన్నికయ్యింది. భగవద్గీతపై చేయి వేసి ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించింది. ఈ పదవిని చేపట్టిన తొలి ఇండియన్‌-అమెరికన్‌గా ఆమె అగ్రరాజ్యంలో చరిత్ర సృష్టించింది. అలాగే మరో ఐదుగురు భారత–అమెరికన్లు ఈ ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. వీరంతా అధికార డెమొక్రాటిక్‌ పార్టీ సభ్యులు కాగా వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెషనల్‌ జిల్లాల నుంచి రాజా కృష్ణమూర్తి, రో ఖన్నా, అమీ బేరా, ప్రమీలా జయపాల్, థానేదార్‌ ఉన్నారు.[2]

Remove ads

కుటుంబనేపథ్యం

వెంట్రప్రగడ గ్రామంలో జన్మించిన కాట్రగడ్డ వెంకటరామారావు, భారతదేశంలో ఇంజనీరింగ్ విద్యనభ్యసించి, ఉన్నత చదువులకోసం 1960లో అమెరికా వెళ్ళినారు. చదువుల అనంతరం వీరు విజయవాడకు చెందిన వెనిగళ్ళ హేమలతను వివాహం చేసుకొని అక్కడే స్థిరపడినారు. ఈ దంపతుల కుమార్తె అరుణ కాట్రగడ్డ.[3] అరుణకు 8 ఏళ్ల వయసులో కుటుంబం అమెరికా తరలివచ్చి స్థిరపడింది. అమెరికా వ్యక్తినే వివాహం చేసుకున్నాగానీ, మన తెలుగు సంప్రదాయాలనూ, భారతదేశాన్నీ మరచిపోలేదు. ఈమె డెమోక్రాటిక్ పార్టీ కార్యకర్తగా, అమెరికా దేశ రాజకీయాలలో చురుకుగా పాల్గొనుచుంటున్నది. 2010 ఎన్నికలలో ఈమె, మేరీలాండ్ రాష్ట్రంలో డెమోక్రాటిక్ పార్టీ తరఫున, డెలిగేట్ గా పోటీ చేసి, ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులపై విజయం సాధించింది. మొదటిసారి గెలిచిన తరువాత ఈమె, తన రాష్ట్ర గవర్నరును హైదరాబాదుకు తీసికొని వచ్చి, భారతదేశంతో, పలు వ్యాపార విభాగాలలో, అరవై మిలియను డాలర్ల వ్యాపార భాగస్వామ్య ఒప్పందాలను కుదిర్చారు. ఈమె 2014లో రెండవసారి గూడా డెలిగేట్ గా ఎన్నికై, అమెరికా లోని ఒక చట్టానికి సంబంధించి కొన్ని సవరణలు తేగలిగినారు. అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసిన తొలి మహిళ హిల్లరీ క్లింటన్ ప్రచార బృందంలో, మౌంట్ గోరీ కౌంటీలోని 15వ డిస్ట్రిక్ట్ డెలిగేట్ అయిన మన తెలుగు మహిళ అరుణ, ఆరు గజాల చీర కట్టుకుని, ఎర్రని బొట్టు పెట్టుకుని, అందరినీ ఆకట్టుకొనుచున్నది. ఈమె ప్రస్తుతం, మేరీల్యాండ్ రాష్ట్ర ప్రతినిధుల సభలో ప్రాతినిధ్యం వహించుచున్నది.

Remove ads

మూలాలు

ఇతర లింకులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads