అల్-ఫాతిహా

From Wikipedia, the free encyclopedia

అల్-ఫాతిహా
Remove ads

సూరా అల్-ఫాతిహా (అరబ్బీ:الفاتحة), ఇస్లాం ధార్మికగ్రంథమైన ఖురాన్ యొక్క ముఖ "పరిచయం", మొదటి సూరా ఈ సూరా అల్-ఫాతిహా ఇది మక్కీ సూర. ఇందు 7 ఆయత్ లు గలవు. ఇది ఒక దుఆ లేక ప్రార్థన. దీనిని ప్రతి నమాజ్ యందు తప్పకుండా పఠిస్తారు.

త్వరిత వాస్తవాలు الفاتحةఅల్-ఫాతిహా ప్రారంభం, వర్గీకరణ ...
Thumb
మొదటి సూరా అల్-ఫాతిహా అజీజ్ ఆఫంది ఖురాన్ వ్రాతప్రతి.
Remove ads

తాత్పర్యం

అల్లాహ్ ద్వారా సమస్త జనులకు అవతరింపబడ్డ గ్రంథం ఖురాన్. ఇది అరబ్బీ భాషలో గలదు. ఇది దాదాపు ప్రపంచపు అన్ని భాషలలోను గల గ్రంథం. ఈ సూరా అల్-ఫాతిహా క్రింది విధంగా కొనసాగుతుంది. (ఖురాన్: మొదటి సూరా)

మరింత సమాచారం ఖురాన్ క్రమం, అరబిక్ ...

ఈ సూరా పఠించడం పూర్తయిన తరువాత ఆమీన్ పలుకవలెను.

వ్యాసాల పరంపర ఖురాన్

ముస్‌హఫ్

సూరా · ఆయత్

ఖురాను పఠనం

తజ్వీద్ (ఉచ్ఛారణ) · హిజ్‌బ్ · తర్‌తీల్ · Qur'anic guardian · మంజిల్ · ఖారి · జుజ్ · రస్మ్ · రుకూలు · సజ్దాలు ·

భారతీయ భాషలలో ఖురాన్ అనువాదాలు

జాబితా

ఖురాన్ పుట్టుక, పరిణామం

మక్కాలో అవతరింపబడినవి  · మదీనాలో అవతరింపబదినవి

తఫ్సీర్

ఆయత్ ల సంబంధిత వ్యక్తులు · న్యాయం · అవతరణకు గల కారణాలు · నస్‌ఖ్ · బైబిలు కథనాలు · తహ్‌రీఫ్ · బక్కాహ్ · ముఖత్తాత్ · Esoteric interpretation

ఖురాన్, సున్నహ్

Literalism · మహిమలు · సైన్స్ · స్త్రీ

ఖురాన్ గురించి అభిప్రాయాలు

షియా · విమర్శ · Desecration · Surah of Wilaya and Nurayn · తనజ్‌జులాత్ · ఖససుల్ అంబియా · బీత్ అల్ ఖురాన్


Remove ads

లేఖనం

ఈ సూరా మొత్తం ఒక ప్రార్థన దుఆ లాగానూ ఒక అమితభక్తుడు తన స్వామిని మొరపెట్టుకోవడంలాగానూ ఉంటుంది. సృష్టికర్తకు సృష్టి ఏవిధంగా వేడుకొంటుందో ఈ సూరాలో గోచరిస్తుంది. భక్తుడు తన ప్రభువును వేడుకొని ప్రసన్నం చేసుకునే వ్యవస్థ ఈ సూరాలోవున్నది.

అవతరణ

ఇస్లామీయ ధార్మికసాహిత్య వ్యవస్థలో ఉల్లేఖనాలు అతిముఖ్యం. ఇబ్న్ అబ్బాస్ ఉల్లేఖనం ప్రకారం ఈ సూరా మహమ్మద్ ప్రవక్తపై అల్లాహ్ మక్కాలో అవతరింపజేశాడు. అబూ హురైరా ఉల్లేఖనం ప్రకారం ఈ సూరా మదీనాలో అవతరింపజేశాడు. ఇబ్న్ అబ్బాస్ ఉల్లేఖనమే ముస్తనద్ అని, దాన్నే అందరూ ఆమోదించారు. మరికొందరు ఈ సూరా మక్కా, మదీనా రెండుప్రదేశాలలోనూ అవతరింపబడినదని భావిస్తారు.

ఇతరనామాలు

హదీసుల ప్రకారం ఈ సూరాకు క్రింది పేర్లు గూడా గలవు.

  • ఉమ్మ్ అల్-కితాబ్ (పుస్తకపు (ఖురాన్) మాత)
  • ఉమ్మ్ అల్-ఖురాన్ (ఖురాన్ (యొక్క) మాత)
  • సూరా అల్-షిఫా (మోక్షమును కలుగజేసే సూరా)
  • అల్-హిజ్ర్

గణాంకాలు

ఈ సూరాలో 7 ఆయత్ లు, 29 పదములు, 139 అక్షరాలు గలవు.

ప్రాముఖ్యత

ఎందరో ధార్మిక పండితులు ఈ సూరా ప్రాముఖ్యత గూర్చి చర్చించారు, వివరించారు. ప్రపంచంలోని ప్రతిముస్లిం ప్రతిరోజూ కనీసం 17 సార్లు ఈ సూరా పఠించవలెను. ఇలా పఠించినచో మాత్రమే ప్రార్థనలు పూర్తవును.

ఇవీ చూడండి

బయటి లింకులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads