ఇల్లెందు

తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇల్లెందు మండలం లోని పట్టణం From Wikipedia, the free encyclopedia

Remove ads

ఇల్లెందు, (పాత పేరు ఇల్లందుపాడు), తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇల్లెందు మండలానికి చెందిన నగర పంచాయితి.[1] ఇది 1986, సెప్టెంబరు 23న 3వ గ్రేడ్ పురపాలక సంఘంగా ఏర్పడింది.[2]

త్వరిత వాస్తవాలు ఇల్లెందు ఇల్లందు, దేశం ...
Remove ads

గ్రామజనాభా

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 95,394 - పురుషులు 46,626 - స్త్రీలు 48,768.[3] పిన్ కోడ్: 507123.

ఖమ్మం జిల్లా నుండి భద్రాద్రి జిల్లాకు మార్పు.

2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా లోగడ ఖమ్మం జిల్లా, కొత్తగూడెం రెవెన్యూ డివిజను పరిధిలో ఉన్న ఇల్లందు (యల్లెందు/Yellandu) మండలాన్ని (1+6) గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[1]

పట్టణ విశేషాలు

ఇల్లందు సింగరేణి బొగ్గు గనులకు పుట్టినిల్లు. ఈ ప్రాంతంలో బొగ్గు నిల్వలను బ్రిటిష్ వారు కనుగొన్నారు. కనుక ఇక్కడి గనులకు "కింగ్", "క్వీన్" వంటి పేర్లున్నాయి. ఇక్కడ మైనింగ్ కార్యకలాపాలకు 100 పైగా సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ పట్టణాన్ని "బొగ్గూట" అని కూడా అంటారు.భౌగోళికంగా ఇల్లందు స్థానం 17.6°N 80.33°E / 17.6; 80.33.[4] సగటు ఎత్తు 205 మీటర్లు (672 అడుగులు). ఇక్కడికి దగ్గరలో ఉన్న రైల్వేస్టేషన్ సింగరేణి.

విద్యా సంస్థలు

  • సింగరేణి కాలరీస్ ఉన్నత పాఠశాల - 1977లో ప్రారంభమైంది.
  • సింగరేణి కాలరీస్ ప్రాథమికోన్నత పాఠశాల - 1979/80లో ప్రారంభమైంది.
  • కాకతీయ కాన్సెప్త్ పాఠశాల - 2010 లో ప్రారంభమైంది
  • మాంటిసొరి ఉన్నత పాఠశాల
  • సాహితి,, చైతన్య జూనియర్ కాలేజీలు
  • ప్రభుత్వ జూనియర్ కాలేజీ
  • ప్రభుత్వ డిగ్రీ కళాశాల 1991 లో ప్రారంభమైంది.

శాసనసభ నియోజకవర్గం

మూలాలు

వెలుపలి లింకులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads