ఉండవెల్లి మండలం
తెలంగాణ, జోగులాంబ గద్వాల జిల్లా లోని మండలం From Wikipedia, the free encyclopedia
Remove ads
ఉండవెల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన మండలం.[1] గతంలో ఉండవెల్లి గ్రామం మహబూబ్ నగర్ జిల్లా, మానోపాడ్ మండలానికి చెందిన గ్రామంగా ఉండేది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ గ్రామం మండల కేంద్రంగా ఉండవెల్లి మండలాన్ని కొత్తగా ఏర్పరచారు.[2] ఇందులో 15 గ్రామాలున్నాయి.[3] ప్రస్తుతం ఈ మండలం గద్వాల రెవెన్యూ డివిజనులో భాగం.[4].ఇది సమీప పట్టణమైన కర్నూలు నుండి 19 కి. మీ. దూరంలో ఉంది.ఈ మండలంలో 15 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.
Remove ads
గణాంకాలు
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 168 చ.కి.మీ. కాగా, జనాభా 29,923. జనాభాలో పురుషులు 15,226 కాగా, స్త్రీల సంఖ్య 14,697. మండలంలో 7,160 గృహాలున్నాయి.[5]
2016 లో ఏర్పడిన మండలం
లోగడ ఉండవెల్లి గ్రామం మహబూబ్ నగర్ జిల్లా, గద్వాల రెవెన్యూ డివిజను పరిధిలోని మనోపాడ్ మండలానికి చెందింది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా ఉండవెల్లి గ్రామాన్ని (1+14) పదిహేను గ్రామాలుతో నూతన మండల కేంధ్రంగా జోగులాంబ జిల్లా, గద్వాల రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[6]
Remove ads
మండలం ఉనికి
ఉండవెల్లి మండలానికి తూర్పున అలంపూర్ మండలం, దక్షిణాన తుంగభద్రా నది ఉత్తరాన కృష్ణానది, పశ్చిమాన మానోపాడ్,వడ్డేపల్లి మండలాలు సరిహద్దులుగా ఉన్నాయి.
మండలం లోని గ్రామాలు
రెవెన్యూ గ్రామాలు
మండలం లోని రైల్వే స్టేషన్లు
మండలం లోని ప్రసిద్ధ దేవాలయాలు
- ఎల్లమ్మ దేవాలయం, కంచుపాడు
మండలంలో ఉన్నత పాఠశాలలు ఉన్న గ్రామాలు
మండల రక్షక భట నిలయాలు
మండలానికి చెందిన ప్రముఖులు
- సురవరం ప్రతాపరెడ్డి
- సురవరం సుధాకర్ రెడ్డి
- దుంపల రామిరెడ్డి
మూలాలు
వెలుపలి లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads