ఉప్పల్ మండలం

తెలంగాణ, మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లా లోని మండలం From Wikipedia, the free encyclopedia

ఉప్పల్ మండలం
Remove ads

ఉప్పల్ మండలం, తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లాలోని మండలం,దీని ప్రధాన కార్యాలయం ఉప్పల్. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌లో విలీనం కావడానికి ముందు ఉప్పల్ పురపాలక సంఘంగా ఉండేది.ఈ మండలం ఉప్పల్ శాసనసభ నియోజకవర్గం. మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం రంగారెడ్డి జిల్లాలో ఉండేది.[1] ప్రస్తుతం ఈ మండలం కొత్తగా ఏర్పాటైన కీసర రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మల్కాజ్‌గిరి డివిజనులో ఉండేది.

త్వరిత వాస్తవాలు అక్షాంశరేఖాంశాలు: 17.38°N 78.55°E /, రాష్ట్రం ...
Thumb
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త రంగారెడ్డి జిల్లా పటంలో మండల స్థానం
Remove ads

గణాంకాలు

ఈ మండలంలో  14  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 50 చ.కి.మీ. కాగా, జనాభా 384,835. జనాభాలో పురుషులు 172,701 కాగా, స్త్రీల సంఖ్య 165,319. మండలంలో 90,207 గృహాలున్నాయి.[2]

మండలం లోని గ్రామాలు

రెవెన్యూ గ్రామాలు

  1. మల్లాపూర్
  2. మీర్‌పేట్
  3. నాచారం
  4. హబ్సిగూడ
  5. ఉప్పల్ భగాయత్
  6. ఉప్పల్ ఖల్సా
  7. రామంతాపూర్ ఖల్సా
  8. నాగోల్
  9. బండ్లగూడ
  10. ఫతుల్లాగూడ

ఎటువంటి డేటా లేని గ్రామాలు

ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం ఈ గ్రామాలు రెవెన్యూ గ్రామాలు, కానీ దీనికి ఎటువంటి డేటా లేనందున పేజీలు సృష్టించలేదు.

  • రామంతపూర్ భగాయత్
  • నౌరంగ్‌గూడ ఖల్సా
  • నౌరంగ్‌గూడ భగాయత్
  • కొత్తపేట్

మూలాలు

వెలుపలి లంకెలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads