From Wikipedia, the free encyclopedia

Remove ads

() తెలుగు వర్ణమాలలోని ఒక అచ్చు. ఇది బ్రాహ్మీ లిపిలోని Ḷ అక్షరం నుండి రూపాంతరం చెందింది. ఇది కన్నడ లిపిలోని కి సమానమైనది. తెలుగు లిపిలోని ఇతర అచ్చుల మాదిరిగానే "ఌ"కు సంపూర్ణ అక్షరంతో పాటు, దీనికి గుణింత రూపంకూడా ఉన్నది. అయితే ఈ అచ్చు గుణింత రూపం హల్లులను ఏ విధంగా తాకకుండా, రూపాంతరం చేయకుండా, హల్లు క్రింద వ్రాయబడుతుంది. దేవనాగరిలో కలిగిన సంస్కృత పదాలను తెలుగులో వ్రాసేందుకు ఇది తెలుగు లిపిలో చేర్చబడిందని భావిస్తారు.

Thumb
Thumb
తెలుగు అక్షరమాలలోని ఌ అక్షరం, దాని వత్తు రూపం
Remove ads

ఉదాహరణలు

క్లుప్తము అనే పదము యొక్క అసలు రూపం కౢప్తము అని కకు ఌ గుణింతం జేర్చి వ్రాయబడేది। కాలక్రమేణా ఈ వాడుక మూలపడింది. ఆంగ్లములో ఈ శబ్దం యొక్క వాడకము అధికము. కౢప్తములో వచ్చెడి 'కౢ'ను ఆంగ్ల పదము tackle వంటి పదాలలో గమనించవచ్చు.

Thumb
ఌ యొక్క గుణింత రూపం, క, ఖ, గ, ఘ & ఙ అచ్చులతో చేరి సృష్టిస్తున్న శబ్దాలు Kḷ, Khḷ, Gḷ, Ghḷ and Ngḷ.

యూనీకోడు

  • యూనీకోడు - ఌ
  • కోడు పాయింటు - U+0C0C [1]
  • గుణింతం - ౢ
  • గుణింతం కోడుపాయింటు - U+0C62

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads