ఎన్.రాజేశ్వర్ రెడ్డి

From Wikipedia, the free encyclopedia

Remove ads

ఎన్.రాజేశ్వర్ రెడ్డి (డిసెంబరు 25, 1956 - అక్టోబరు 30, 2011) మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు.

త్వరిత వాస్తవాలు నియోజకవర్గం, వ్యక్తిగత వివరాలు ...

జననం

ఇతను డిసెంబరు 25, 1956లో జన్మించాడు.[1] బెంగళూరులో బి.ఇ (మెకానికల్) విద్యను పూర్తిచేశాడు. 1991 నుంచి భారతీయ జనతాపార్టీలో ఉంటూ ప్రముఖ పదవులను అలంకరించాడు. భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శిగా, జిల్లా అధ్యక్షుడిగా పదవులు చేపట్టినాడు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు జిల్లాలో ఎడ్లబండ్ల యాత్ర చేసి రైతుల మన్ననలు అందుకున్నాడు.

1996లో పశుగ్రాసం కోసం కాడెడ్ల ప్రదర్శన చేయగా, 2003లో పెండింగ్ ప్రాజెక్టుల కోసం రాయచూరు సరిహద్దు నుంచి నల్గొండ జిల్లా సరిహద్దు వరకు 200 కిమీ పైగా పాదయాత్ర చేశాడు.[2] 1995లో భారతీయ జనతా పార్టీ తరఫున శాసనసభకు పోటీచేసి ఓడిపోయాడు. 2005లో భారతీయ జనతా పార్టీ తరఫున మహబూబ్ నగర్ పురపాలక సంఘం కౌన్సిలర్‌గా ఎన్నికైనాడు. అప్పుడు చైర్మెన్ అభ్యర్థిగా విజయం సాధించిననూ పురపాలక సంఘంలో భారతీయ జనతా పార్టీకు తగినన్ని స్థానాలు లభించకపోవడంతో కేవలం కౌన్సిలర్‌గా కొనసాగినాడు.

2009 శాసనసభ ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీకు రాజీనామా చేసి ప్రజారాజ్యం పార్టీలో చేరిననూ శాసనసభ ఎన్నికలలో టికెట్టు లభించలేదు. స్వంతంత్య్ర అభ్యర్థిగా పోటీచేసి మహబూబ్‌నగర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మేల్యేగా ఎన్నికైనాడు.[3] ఈ ఎన్నికలలో సమీప ప్రత్యర్థి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన ఇబ్రహీంఖాన్‌పై 5137 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు.[4]

Remove ads

మరణం

అక్టోబరు 30, 2011లో మరణించాడు.[5]

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads