యం.యస్.స్వామినాధన్

From Wikipedia, the free encyclopedia

యం.యస్.స్వామినాధన్
Remove ads

ఎం.ఎస్. స్వామినాథన్ (1925 ఆగస్టు 7 - 2023 సెప్టెంబరు 28), భారతీయ ప్రధాన కృషి విజ్ఞాని, విదేశీ సభ్యుల ప్రశస్తుడు. ఆయన వివిధ రాష్ట్రాల్లో కృషి పరిష్కారం, ప్రజాగ్రాహకత,, పరిసర సూచనలకు నేతగా అందించడంలో అవతరించాడు. ఆయన కృషి విజ్ఞానంలో పరిష్కృతుడు, సుసంబద్ధత గురించి అనేక కృషి సాంకేతిక పరిష్కరణలను చేసినట్లు అయిన భాషానందం చేస్తుండడానికి ముఖ్య పాత్రపూరణగా పనిచేసాడు.

త్వరిత వాస్తవాలు యం.యస్.స్వామినాధన్, జననం ...

భారతీయ పరిసర వ్యవస్థ, కృషి చేసే కార్యక్రమాలను మెరుగుపెడించడంలో ఆయన ముఖ్య భూమిక అదనపు చేసాడు. భూసుఖోనాలను కడిచించడం, ప్రాకృతిక ఆపదల నివారణలో ఆయన ముఖ్య యోగదానం చేసాడు. అదనపులో, ఆయన "గ్రీన రెవాల్యూషన్" ప్రణాళికలు, కృషి ప్రక్షేత్రాన్ని ఆధునికీకరించడంలో మహత్వపూర్ణ పాత్ర ఆడుతున్నాడు.

1972 నుండి 1979 వరకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సంస్థకు జనరల్ డైరక్టరుగా పనిచేసాడు. 1979 నుండి 1980 వరకు భారతదేశ వ్యవసాయ మంత్రిత్వశాఖకు ప్రధాన కార్యదర్శిగా పనిచేసాడు. అతను అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థకు 1982 నుండి 1988 వరకు డైరక్టరుజనరల్ గా తన సేవలనందించాడు. 1988లో ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రీసోర్స్ సంస్థకు అధ్యక్షునిగా ఉన్నాడు.[1] 1999లో 20వ శతాబ్దంలో అత్యధికంగా ప్రభావితం చేసిన ఆసియా ప్రజల జాబితా "టైం 20"లో అతని పేరును టైమ్‌ మ్యాగజైన్ ప్రచురించింది.

కేంద్ర ప్రభుత్వం యం.యస్.స్వామినాధన్ కు భారతరత్న పురస్కారాన్ని 2024 ఫిబ్రవరి 9న ప్రకటించింది.[2][3]

Remove ads

ప్రారంభ జీవితం, విద్య

స్వామినాథన్ 1925 ఆగష్టు 7తమిళనాడులోని కుంభకోణంలో జన్మించాడు. అతను డా.ఎం.కె.సాంబశివన్, పార్వతి దంపతులకు రెండవ కుమారుడు. అతను తన తండ్రి నుంచి "మన మనస్సులో 'అసాధ్యం' అనే మాట సాధారణంగా వస్తుంది. దానికి ధృఢ సంకల్పంతో కృషిచేసిన తరువాత గొప్పపనులు సాధించవచ్చు." అనే విషయాన్ని నేర్చుకున్నాడు. వైద్యవృత్తిలో ఉన్న అతని తండ్రి ఎం.కె. సాంబశివన్ మహాత్మాగాంధీ అనుచరుడు. మహాత్మా గాంధీ పిలుపు మేరకు స్వదేశీ ఉద్యమంలో భాగంగా విదేశీ వస్తువుల బహిష్కరణ సందర్భంగా కుంభకోణంలో అతని విదేశీ దుస్తులను దగ్దం చేసాడు. స్వదేశీ ఉద్యమం భారతీయులు విదేశీ దిగుమతులపై ఆధారపడకుండా, గ్రామీణ పరిశ్రమను కాపాడడటం అనే రాజకీయ ప్రయోజనంతో రూపొందించబడింది. అతని తండ్రి తమిళనాడులో భారత స్వాతంత్ర్యోద్యమంలో భాగంగా జరిగిన దేవాలయ ప్రవేశ ఉద్యమంలో దళితుల ఆలయ ప్రవేశ కార్యక్రమానికి నాయకత్వం వహించాడు. ఫైలేరియాసిస్ అనే భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న కుంభకోణం ప్రాంతంలో ఆ వ్యాధిని నిర్మూలించడానికి అతని తండ్రి కృషిచేసాడు. తన తండ్రి చేస్తున్న కార్యక్రమాల వల్ల బాల్యంలో అతనికి సేవాభావన కలిగింది.

తన 11వ యేట తండ్రి మరణించాడు. అతని బాధ్యతలను అతని మామయ్య ఎం.కె.నారాయణస్వామి (రేడియాలజిస్టు) చూస్తుండేవాడు. ప్రారంభ విద్యను స్థానిక పాఠశాలలో చదివాడు. తరువాత కుంభకోణంలోని కాథలిక్ లిటిల్ ఫ్లవర్ హైస్కూలులో చదివి మెట్రిక్యులేషన్ ను పూర్తిచేసాడు.[4] వైద్యులు గల కుటుంబ నేపథ్యంలో అతను మెడికల్ పాఠశాలలో చేరాడు. కానీ అతను 1943 నాటి భయంకరమైన బెంగాల్ కరువును చూసినప్పుడు, భారతదేశం నుండి ఆకలిని తొలగించటానికి తన జీవితాన్ని అంకితం చేయాలని నిర్ణయించుకున్నాడు. అతను మహాత్మా గాంధీ చే ప్రభావితమై ఈ నిర్ణయం తీసుకున్నాడు. వెంటనే అతను వైద్యరంగం నుండి వ్యవసాయ రంగానికి మారిపోయాడు.[5] అతను కేరళ రాష్ట్రంలోని త్రివేండ్రం లోని మహారాజా కళాశాలలో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పూర్తిచేసాడు. అతను ఆ కళాశాలలో 1940 నుండి 44 వరకు చదివి జంతుశాస్త్రంలో బి.యస్సీ డిగ్రీని తీసుకున్నాడు.

ఎం.ఎస్. స్వామినాథన్ వివాహం మీనా స్వామినాథన్ తో 1955లో జరిగింది.[6] 1951లో కేంబ్రిడ్జ్ లో చదివినప్పుడు ఆమె పరిచయమయింది. వారు తమిళనాడులోని చెన్నైలో నివసించారు. వారికి ముగ్గురు కుమార్తెలు, ఐదుగురు మనుమలు ఉన్నారు. వారి కుమార్తెలలో డా.సౌమ్యా స్వామినాథన్ ప్రపంచ ఆరోగ్య సంస్థకు డిప్యూటీ డైరక్టరు జనరల్ గానూ, రెండవ కుమార్తె డా. మధుర స్వామినాథన్ బెంగళూరులోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్ లో ఆర్థిక శాస్త్రంలో అధ్యాపకురాలిగానూ, మూడవ కుమార్తె నిత్యా స్వామినాథన్ ఉత్తర అంగోలియా విశ్వవిద్యాలయంలో సీనియర్ అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు.

మీనా స్వామినాథన్ 88 సంవత్సరాల వయస్సులో 2022 మార్చి 14న చెన్నైలోని తేనాంపేట్‌లోని తన స్వగృహంలో సహజ కారణాలతో మరణించింది.[7]

Remove ads

వృత్తి జీవితం

స్వామినాథన్ వ్యవసాయ శాస్త్రాలలో తన వృత్తిని కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. అతను మద్రాసు వ్యవసాయ కళాశాల (ప్రస్తుతం తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం) లో చేరి అక్కడ వ్యవసాయ శాస్త్రంలో మరో బ్యాచిలర్స్ డిగ్రీని పొందాడు. ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణాన్ని అతను ఇలా చెప్పాడు: "నేను కేరళ విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా ఉన్నప్పుడు నాకు వ్యక్తిగత ప్రేరణ '1943' నాటి బెంగాల్ కరువు' తో మొదలైంది. అప్పుడు తీవ్రమైన బియ్యం కొరత ఉంది. బెంగాల్ లో మూడు మిలియన్ల ప్రజలు ఆకలితో మరణించారు. నాతో పాటు అనేక మంది యువకులు గాంధీతో స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు. అపుడు వ్యవసాయ రైతులకు ఎక్కువ ఉత్పత్తి అందించాలనే థ్యేయంతో నేను వ్యవసాయ పరిశోధన చేయాలని నిర్ణయించుకున్నాను"[8]

స్వాతంత్ర్యానంతరం భారతదేశం ప్రజల అవసరాలకు సరిపడినంత ఆహారధాన్యాలను ఉత్పత్తి చేయలేని పరిస్థితుల్లో ఉంది. ఆకాలంలో నోబెల్ బహుమతి గ్రహీత నార్మన్ బోర్లాగ్ సృష్టించిన మెక్సికన్ పొట్టి గోధుమ రకాలను మనదేశంలోకి ప్రవేశపెట్టారు. వీని ప్రభావంతో పరిశోధనలు సాగించి అధిక దిగుబడినిచ్చే గోధుమ రకాలను రూపొందించాడు. దీని వలన గోధుమ ఉత్పత్తి పెరిగింది.

స్వాతంత్ర్యం వచ్చిన సంవత్సరం 1947లో అతను జన్యుశాస్త్రం, మొక్కల పెంపకం అంశాలలో పోస్టుగ్రాడ్యుయేట్ విద్యార్థిగా న్యూఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ కు మారాడు. 1949లో అతను సైటోజెనెటిక్స్ (జీవకణ నిర్మాణం, విధులకు సంబంధించిన శాస్త్రం) లో డిస్టింక్షన్ లో పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీని పొందాడు. అతను యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ పరీక్ష రాసి "ఇండియన్ పోలీసు సర్వీసు"కు ఎంపికయ్యాడు.[9] అతను నెదర్లాండ్స్ లోని వాగెనేంజెన్ అగ్రికల్చర్ యూనివర్శిటీ లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ విభాగంలో బంగాళా దుంపల జన్యువులపై తన ఐ.ఎ.ఆర్.ఐ పరిశోధనను కొనసాగించడానికోసం యునెస్కో ఫెలోషిప్ ను అంగీకరించాడు. సోలానమ్ యొక్క విస్తృతమైన అడవి జాతుల నుండి సాగు బంగాళాదుంప (సోలనమ్ ట్యుబరేసం) కు జన్యువులను బదిలీ చేయడానికి కావలసిన విధానాలను ప్రామాణీకరించడంలో అతను విజయం సాధించాడు. 1950లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్లాంట్ బ్రీడింగ్ ఇనిస్టిట్యూట్ లో చదవడానికి వళ్ళాడు. అతను రాసిన "స్పెసీస్ డిఫెరెన్సియేషన్, అండ్ ద నేచుర్ ఆఫ్ పోలీఫ్లోడీ ఇన్ సెర్టయిన్ స్పెసీస్ ఆహ్ ద జెనస్ సోలానం - సెక్షన్ టుబెరారియం" అంశంపై 1952 లో పి.హెచ్.డి డిగ్రీని పొందాడు. 2014లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ ఫెలోషిప్ పొందాడు.[10]

స్వామినాథన్ USDA బంగాళాదుంప పరిశోధన స్టేషన్ ఏర్పాటుకు తన సహాయం కోసం విస్కాన్సిన్ విశ్వవిద్యాలయం, జెనెటిక్స్ శాఖ వద్ద ఒక పోస్ట్ డాక్టరల్ పరిశోధనకు అంగీకరించాడు. విస్కాన్సిన్లోని పరిశోధనా పనిలో అతనికి వ్యక్తిగతమైన, వృత్తిపరమైన సంతృప్తి ఉన్నప్పటికీ, పూర్తిస్థాయి అధ్యాపక హోదాను వదలి 1954లో భారతదేశానికి తిరిగి వచ్చాడు.

Remove ads

వృత్తిపరమైన విజయాలు

స్వామినాథన్ ప్రాథమిక, అనువర్తిత మొక్కల పెంపకం, వ్యవసాయ పరిశోధన, అభివృద్ధి, సహజ వనరుల పరిరక్షణ వంటి సమస్యలలో ప్రపంచవ్యాప్తంగా అనేక మంది సహచరులు, విద్యార్థులతో కలసి పనిచేసాడు.

అతని వృత్తిపరమైన జీవితం 1949 నుండి ప్రారంభమైనది:

  • 1949–55 – బంగాళాదుంప (సోలానం ట్యుబరోసం), గోధుమ (ట్రిటికం ఏస్తివం), వరి (ఒరైజా సటైవా), జనపనార జన్యువులపై పరిశోధన.
  • 1955–72 – మెక్సికన్ మరగుజ్జు గోధుమ వంగడాలపై పరిశోధన. ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ లో సైటొజెనెటిక్స్, రేడియేషన్ జెనెటిక్స్, మ్యుటేషన్ బ్రీడింగ్, గోధుమ, వరి జెర్మోప్లాసం నమూనాల అభివృద్ధి.
  • 1972–79 – డైరక్టర్-జనరల్ : ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చి; భారతదేశంలో మొక్కలు, జంతువులు, చేపల జన్యువనరుల కొరకు జాతీయ బ్యూరో ఏర్పాటు.[11] అంతర్జాతీయ మొక్కల జన్యువనరుల సంస్థ ఏర్పాటు (2006లో బయోడైవర్శిటీ ఇంటర్నేషనల్ గా మారినది).[12]
  • 1979–80 – భారత ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వశాఖకు ప్రధాన కార్యదర్శి; ముందస్తు పెట్టుబడుల ఫారెస్టు సర్వే ప్రోగ్రాంను ఫారస్టు సర్వీస్ ఆఫ్ ఇండియాగా మార్పు.[13]
  • 1981–85 – స్వతంత్ర చైర్మన్, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO) కౌన్సిల్, రోం, మొక్కల జన్యువనరుల కమిషన్ స్థాపించడంలో ముఖ్యమైన పాత్ర.[14]
  • 1983 – రైతుల హక్కుల భావన, ప్లాంట్ జెనెటిక్స్ రీసోర్సెస్ కు గ్రంథం రూపకల్పనను అభివృద్ధి చేశాడు.[15]
  • 1982–88 – డైరక్టరు జనరల్, ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (IRRI), అంతర్జాతీయ రైస్ జెర్మ్‌ప్లాసం వ్యవస్థాపన, ప్రస్తుతం అంతర్జాతీయ రైస్ జెనీబ్యాంకు.
  • 1984–90 – అధ్యక్షుడు, అంతర్జాతీయ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రీసోర్సెస్ ( IUCN), జీవవైవిధ్యం మీద సమావేశం అభివృద్ధి.
  • 1986–99 – వాషింగ్టన్ డి.సి లోని వరల్డ్ రీసోర్స్ ఇనిస్టిట్యూట్ సంపాదక మండలి చైర్మన్., మొట్టమొదటి "వరల్డ్ రిసోర్స్ రిపోర్ట్." రూపకల్పన.[16]
  • 1988–91 –ఇంటర్నేషనల్ స్టీరింగ్ కమిటీ చైర్మన్, కీస్టోన్ ఇంటర్నేషనల్ డైలాగ్ ఆన్ ప్లాంట్ జెనెటిక్ రీసోర్సెస్., [17] మొక్కల జెర్మ్‌ప్లాజం లభ్యత, ఉపయోగం, మార్పిడి, రక్షణ గురించి కృషి.
  • 1991–1995 – సభ్యుడు, గవర్నింగ్ బోర్డు, ఆరోవిల్లీ ఫౌండేషన్.
  • 1988–96 – అధ్యక్షుడు, వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ - ఇండియా WWF, [18] ఇందిరాగాంధీ పర్యవేక్షణ, పరిరక్షణ కేంద్రం నడుపుట.[19] కమ్యూనిటీ బయోడైవర్శిటీ కన్జర్వేషన్ ప్రోగ్రాం నిర్వహణ.[20]
  • 1988–99 – చైర్మన్/ట్రస్టీ, కామన్‌వెల్త్ సెక్రటేరియట్ ఎక్స్‌పర్ట్ గ్రూపు., [21] గయానాలోని ఉష్ణమండల వర్షారణ్యాల నిర్వహణ, రైన్ ఫారెస్టు పరిరక్షణ, అభివృద్ధి కోసం ఇవోక్రమ ఇంటర్నేషనల్ సెంటర్ నిర్వహణ., [22] గయానా అధ్యక్షుడు 1994లో "స్వామినాథన్ లేకుండా ఇవోక్రమ లేదు" అని రాసాడు.
  • 1990–93 – వ్యవస్థాపకుడు/అధ్యక్షుడు, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ మాంగ్రోవ్ ఎకోసిస్టమ్స్.[23]
  • 1988–98 – జీవవైవిధ్యానికి సంబంధించిన ముసాయిదా చట్టం, పెంపకందారులు, రైతుల హక్కులు చట్టం రూపకల్పనలో భారత ప్రభుత్వం నియమించిన అనేక కమిటీలలో స్థానం పొందాడు.[24]
  • 1993లో స్వామినాథన్ నేషనల్ పాపులేషన్ పాలసీ డ్రాఫ్ట్ రూపకల్పనలో భారత పార్లమెంటుచే నియమింపబడిన నిపుణుల బృదానికి నాయకత్వం వహించాడు. 1994లో నివేదిక అందజేసాడు.[25]
  • 1994 - వరల్డ్ హుమానిటీ ఏక్షన్ ట్రస్టు జెనెటిక్ డైవర్సిటీ పై వేసిన కమిషన్ కు చైర్మన్.[26] సాంకేతిక వనరుల కేంద్రాన్ని స్థాపించాడు.
  • 1994 తర్వాత - చైర్మన్, జెనెటిక్ రీసోర్స్ పాలసీ కమిటి, కన్సల్టేటివ్ గ్రూప్ ఆఫ్ ఇంటర్నేషనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్.
  • 1995–1999 చైర్మన్, ఆరోవిల్లీ ఫౌండేషన్
  • 1999 – జీవావరణ నిల్వల గూర్చి ట్రస్టీ ఏర్పాటు భావనను పరిచయం చేసాడు.
  • 2001 – చైర్మన్, రీజనల్ స్టీరింగ్ కమిటీ, జీవావరణ నిర్వహణపై ఇండియా - బంగ్లాదేశ్ ఉమ్మడి ప్రాజెక్టు.
  • 2004 – 2014 – చైర్మన్, నేషనల్ కమిషన్ ఆన్ ఫార్మర్స్.
  • అతని సారథ్యంలో 68 మంది విద్యార్థులు పి.హెచ్.డి చేస్తున్నారు.
Remove ads

మరణం

యం.యస్.స్వామినాధన్ 98 సంవత్సరాల వయస్సులో 2023 సెప్టెంబరు 28న చెన్నైలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచాడు.[27]

మూలాలు

బయటి లంకెలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads