ఎస్.ఎమ్. కృష్ణ
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి From Wikipedia, the free encyclopedia
Remove ads
సోమనహళ్లి మల్లయ్య కృష్ణ (1932 మే 1 - 2024 డిసెంబరు 10) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక రాష్ట్ర 16వ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, గవర్నర్‌గా వివిధ హోదాల్లో పనిచేశాడు.
ఎస్.ఎం. కృష్ణ రాజకీయలలో చేసిన సేవలకుగాను 2023లో భారతదేశ్ రెండవ అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ అవార్డు అందుకున్నాడు.[3]
ఆయన కాంగ్రెస్ తో ఉన్న దాదాపు 50 ఏళ్ల అనుబంధానికి ముగింపు పలికి 2017లో బీజేపీలో చేరాడు.[4] ఆయన 2023 జనవరి 5న క్రీయాశీల రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.[5]
Remove ads
నిర్వహించిన పదవులు
- 1962–67, మద్దూరు నుండి శాసనసభ్యుడిగా ఎన్నిక. కానీ 1967లో పీఎస్పీ టికెట్‌పై
- 1968–1971 మాండ్య నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నిక
- 1971–1972 మాండ్య నుండి రెండోసారి కాంగ్రెస్ తరపున లోక్‌సభ సభ్యుడిగా ఎన్నిక
- 1972 నుండి 1977 - కర్ణాటక శాసనమండలి సభ్యుడు
- 1972 నుండి 1977 - కర్ణాటక రాష్ట్ర వాణిజ్యం & పరిశ్రమలు & పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి
- 1980–1984 - మాండ్య నుండి మూడోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నిక
- 1983 నుండి 1984లో కేంద్ర పరిశ్రమల శాఖ సహాయ మంత్రి
- 1984 నుండి 1985 - కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి
- 1989 నుండి 1994 - కర్ణాటక శాసనసభ సభ్యుడిగా ఎన్నిక
- 1989 నుండి 1993 - కర్ణాటక శాసనసభ స్పీకర్
- 1993 నుండి 1994 - కర్ణాటక ఉప ముఖ్యమంత్రి
- 1996 ఏప్రిల్లో రాజ్యసభకు ఎన్నిక
- కర్ణాటక ముఖ్యమంత్రి 1999 అక్టోబరు – 2004 (మద్దూరు నుండి ఎమ్మెల్యే )
- కర్ణాటక శాసనసభకు తిరిగి ఎన్నికయ్యారు: 2004 (చామ్‌రాజ్‌పేట నియోజకవర్గం)
- 2004 నుండి 2008 - మహారాష్ట్ర గవర్నర్
- 2008 నుండి 2014 - కర్ణాటక నుండి రాజ్యసభకు ఎన్నిక
- 2009 మే 22 నుండి 2012 అక్టోబరు 26 వరకు కేంద్ర విదేశాంగ మంత్రి
Remove ads
మరణం
ఎస్ఎం కృష్ణ కొంతకాలంగా వయసు సంబంధిత అనారోగ్యంతో బాధపడుతూ బెంగళూరు సదాశివనగర్‌లోని తన నివాసంలో చికిత్స పొందుతూ 2024 డిసెంబరు 10న మరణించాడు. ఆయనకు భార్య ప్రేమ కృష్ణ, కుమార్తెలు శాంభవి, మాళవిక ఉన్నారు.[6]
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads