ఐరావతం
From Wikipedia, the free encyclopedia
Remove ads
ఐరావతం అనగా భారీకాయంతో, తెల్లటి మేనిఛాయతో మెరిసిపోయే ఏనుగు. క్షీరసాగర మథన సమయంలో పుట్టిన ఈ ఏనుగును దేవరాజు ఇంద్రుడు తన వాహనంగా చేసుకున్నాడు. దీనిని మేఘాల ఏనుగు, పోరాట ఏనుగు, సూర్యుని సోదరుడిగా కూడా పిలుస్తారు.[1]
పుట్టుక
ఐరావతం పుట్టుక గురించి పురాణాల్లో రకరకాల కథలు ప్రాచూర్యంలో ఉన్నాయి.[2]
- పాలసముద్రాన్ని చిలికినప్పుడు లక్ష్మీ దేవి, కల్పవృక్షము, కామధేనువులతో పాటు ఈ ఐరావతం ఉద్భవించింది.
- మాతంగలీల గ్రంథం ప్రకారం బ్రహ్మ వరంతో ఎనిమిది మగ ఏనుగులూ, ఎనిమిది ఆడ ఏనుగులూ ఉద్భవించాయి. మగ ఏనుగులకు ఐరావతం ప్రాతినిధ్యం వహించగా, ఆడ ఏనుగులకి ‘అభరాము’ అనే ఏనుగు నాయకత్వం వహించింది.
- కద్రు, కశ్యపల కుమార్తె అయిన ఐరావతికి ఐరావతం జ`న్మించింది.
Remove ads
ఇతర వివరాలు
జైన, బౌద్ధ మతాలలో కూడా ఐరావత ప్రస్తావన ఉంది. థాయిలాండ్, లావోస్ వంటి దేశాలలో ఐరావతాన్ని ఆరాధిస్తారు. అంతేకాకుండా అక్కడి ప్రాచీన రాజ్యాల పతాకాల మీద మూడు తొండాలతో ఉండే ఐరావతం బొమ్మ చిత్రించబడివుంటుంది.
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads