ఐరోపా

ఖండం From Wikipedia, the free encyclopedia

ఐరోపా
Remove ads

సాంప్రదాయకంగా ఏడు ఖండాలు అని చెప్పుకొనేవాటిలో ఐరోపా ఒకటి. ఐరోపా భూఖండానికి పశ్చిమాన ఉన్న ద్వీపకల్పము. ఐరోపాకు ఉత్తరాన ఆర్కిటిక్ మహాసముద్రము, పశ్చిమాన అట్లాంటిక్ మహాసముద్రము, దక్షిణాన మధ్యధరా సముద్రము, ఆగ్నేయాన కాకసస్ పర్వతాలు, నల్ల సముద్రం , నల్లసముద్రాన్ని, మధ్యధరా సముద్రాన్ని కలుపుతున్న కాలువలు సరిహద్దులుగా ఉన్నాయి. తూర్పు దిశన ఐరోపా, ఆసియా ఖండాలకు సరిహద్దులుగా ఉరల్ పర్వతాలు, ఉరల్ నది, కాస్పియన్ సముద్రం ఉన్నాయి.[1] విస్తీర్ణాన్ని బట్టి ఐరోపా, 10,180,000 చదరపు కిలోమీటర్లు (3,930,000 చ.మై) వైశాల్యముతో ప్రపంచములో రెండవ చిన్న ఖండము. ఇది 2% భూమి వైశాల్యము కలిగి ఉంది. ఐరోపా ఖండంలో దాదాపు 50 దాకా సర్వసత్తాక దేశాలు ఉన్నాయి. కానీ వీటి కచ్చితమైన సంఖ్య ఐరోపా యొక్క సరిహద్దుల నిర్ణయాన్ని బట్టి, పూర్తిస్థాయి గుర్తింపులేని ప్రదేశాలను పరిగణనలోకి తీసుకోవటం, తీసుకోకపోవటం వంటి విషయాలపై ఆధారపడుతుంది. ఐరోపా దేశాలలో జనాభా వారిగా, వైశాల్యము వారీగా రష్యా అన్నింటికంటే పెద్దదేశం కాగా వాటికన్ అన్నింటికంటే చిన్నదేశం. 71 కోట్ల జనాభాతో ఆసియా, ఆఫ్రికాల తర్వాత ఐరోపా అత్యంత జనాభా కలిగిన ఖండము. ప్రపంచము యొక్క 11% ప్రజలు ఐరోపాలో నివసిస్తున్నారు. అయితే, ఖండము అంటే ఒక భౌగోళిక ఉనికితో పాటు, సాంస్కృతిక, రాజకీయ ఉనికిని కూడా సూచిస్తుంది కాబట్టి ఐరోపా యొక్క సరిహద్దులు, జనాభా గురించి ఏకాభిప్రాయము లేదు.

Thumb
Sentiero del Viandante లోని Lierna నుండి Bellagio వైపు చూడగా కోమో సరస్సు యొక్క అత్యంత ఐకానిక్ దృశ్యం
త్వరిత వాస్తవాలు విస్తీర్ణం, జనాభా ...
Remove ads

రాజకీయ భౌగోళికం

అనేక సిద్ధాంతాలు, విపులీకరణల తరువాత ఐరోపా ఖండాన్ని భౌగోళిక, రాజకీయ ప్రాంతాలుగా వర్గీకరించారు. వీటిలో 50 దేశాలు ఉన్నాయి. ఐరోపా సమాఖ్యలో 27 దేశాలు సభ్యత్వం కలిగివున్నాయి. క్రింది పట్టిక ఐక్యరాజ్యసమితి ఉపయోగిస్తున్నది.[2]

మరింత సమాచారం ప్రాంతము లేదా ఉప-ప్రాంతము పేరు , పతాకము, విస్తీర్ణం (కి.మీ²) ...
Remove ads

ఇవి కూడ చూడండి

చార్లెస్ హర్బట్

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads