ఓలీ రాబిన్సన్

From Wikipedia, the free encyclopedia

ఓలీ రాబిన్సన్
Remove ads

ఆలివర్ ఎడ్వర్డ్ రాబిన్సన్ (జననం 1993 డిసెంబరు 1) ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ జట్టు కోసం ఆడుతున్న ఇంగ్లీష్ ప్రొఫెషనల్ క్రికెటరు. దేశీయ క్రికెట్‌లో, అతను సస్సెక్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తాడు. గతంలో యార్క్‌షైర్, హాంప్‌షైర్‌ల తరపున ఆడాడు. 2021లో తన టెస్టు రంగప్రవేశం చేసాడు. రైట్ ఆర్మ్ మీడియం ఫాస్టు బౌలర్‌గా ఆడతాడు. [1]

త్వరిత వాస్తవాలు వ్యక్తిగత సమాచారం, పూర్తి పేరు ...
Remove ads

దేశీయ కెరీర్

రాబిన్సన్ తన కెరీర్‌ను కెంట్ సెకండ్ XI తరపున ఆడటం ప్రారంభించాడు. 2013 సీజన్‌లోని ఒక మ్యాచ్ తర్వాత, యార్క్‌షైర్ సెకండ్ XI కోసం ఆడటానికి ముందు కెంట్ నుండి లీసెస్టర్‌షైర్‌కు వెళ్ళాడు. 2013 సీజన్‌లో సెకండ్ XI క్రికెట్‌లో 59 వికెట్లు, 1,282 పరుగులు సాధించాడు. 2013 జూలై లో లీసెస్టర్‌షైర్‌పై యార్క్‌షైర్ తరపున లిస్ట్ A రంగప్రవేశం చేశాడు. [2] 2013 అక్టోబరులో, రాబిన్సన్ యార్క్‌షైర్‌తో వృత్తిపరమైన ఒప్పందంపై సంతకం చేశాడు. [2]

2014 సీజన్‌లో యార్క్‌షైర్ కోసం ఏడు T20 బ్లాస్టు ప్రదర్శనలు చేసిన తర్వాత యార్క్‌షైర్, రాబిన్‌సన్‌ను జూలైలో తొలగించింది. సమయాన్ని సరిగ్గా పాటించనందుకు గాను, ఆ చర్య తీసుకుంది.[3] [4] తర్వాత 2014 సీజన్‌లో రాబిన్సన్, హాంప్‌షైర్ కోసం లిస్టు Aలో కనిపించాడు. [5] [6]

2015 ఏప్రిల్లో, సస్సెక్స్ ఒక స్వల్పకాలిక ఒప్పందంపై రాబిన్సన్‌తో సంతకం చేసింది. బౌలర్లు టైమల్ మిల్స్, జేమ్స్ అయాన్, లూయిస్ హాట్చెట్‌లు అందరూ అందుబాటులో లేరు. [7] [6] రాబిన్సన్ సస్సెక్స్ కొరకు సెకండ్ XI మ్యాచ్ ఆడాడు [7] మరుసటి రోజు కౌంటీ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లో డర్హామ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను ఫస్టు క్లాస్ రంగప్రవేశం చేసాడు. [6] [8] ఈ మ్యాచ్‌లో రాబిన్సన్, తొమ్మిదో నంబర్‌లో బ్యాటింగ్ చేస్తూ, మాట్ హోబ్డెన్‌తో కలిసి 164 పరుగులు చేసాడు.[9] 95 సంవత్సరాలలో వారి కౌంటీ ఛాంపియన్‌షిప్ రంగప్రవేశంలో సెంచరీ సాధించిన మొదటి ససెక్స్ ఆటగాడిగా నిలిచాడు.[9] రాబిన్సన్ 2015 మేలో వార్విక్‌షైర్‌పై తన మొదటి ఐదు వికెట్లు సాధించాడు. [10] 2015 సీజన్‌లో 24.71 సగటుతో 46 ఛాంపియన్‌షిప్ వికెట్లు తీసి, LV= బ్రేక్‌త్రూ ప్లేయర్ అవార్డుకు నామినేట్ అయ్యాడు [11] ససెక్స్ యంగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు. [12] 2015 అక్టోబరులో, రాబిన్సన్ ససెక్స్‌తో కొత్త మూడేళ్ల ఒప్పందంపై సంతకం చేశాడు. [12]

2021 ఏప్రిల్లో, కౌంటీ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లలో రాబిన్సన్ సస్సెక్స్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. [13] ఆ నెలలో, అతను గ్లామోర్గాన్‌తో జరిగిన కౌంటీ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లో 78 పరుగులకు 9 వికెట్లు తీసుకున్నాడు; [14] ఇది 2016 తరువాత ఒక ఇంగ్లాండ్ క్రికెటరు సాధించిన అత్యుత్తమ బౌలింగు గణాంకాలు [15]

2021 జూన్ 10న, రాబిన్సన్ "ఆట నుండి స్వల్ప విరామం" తీసుకుంటున్నట్లు ప్రకటించాడు, [16] 2021 టి20 బ్లాస్ట్‌లో తమ మొదటి రెండు గేమ్‌లకు తాను అందుబాటులో ఉండలేనని ససెక్స్‌తో చెప్పాడు. [17] 2021 జూలైలో, ది హండ్రెడ్ 2021 సీజన్ కోసం మాంచెస్టర్ ఒరిజినల్స్ హ్యారీ గుర్నీకి బదులుగా రాబిన్సన్‌ను తీసుకుంది.[18] 2022 ఏప్రిల్లో, ది హండ్రెడ్ 2022 సీజన్ కోసం అతన్ని మాంచెస్టర్ ఒరిజినల్స్ కొనుగోలు చేసింది. [19]

Remove ads

అంతర్జాతీయ కెరీర్

2020 మే 29న, COVID-19 మహమ్మారి తరువాత ఇంగ్లాండ్‌లో ప్రారంభమయ్యే అంతర్జాతీయ మ్యాచ్‌లకు ముందు శిక్షణను ప్రారంభించడానికి 55 మంది ఆటగాళ్ల బృందంలో రాబిన్సన్ పేరు పెట్టారు. [20] [21] 2020 జూన్ 17న, వెస్టిండీస్‌తో జరిగే టెస్టు సిరీస్ కోసం శిక్షణ ప్రారంభించడానికి 30 మంది ఇంగ్లండ్ సభ్యుల జట్టులో అతన్ని తీసుకున్నారు. [22] [23] 2020 జూలై 4న, సిరీస్‌లోని మొదటి టెస్టు మ్యాచ్‌కి రాబిన్సన్ తొమ్మిది మంది రిజర్వ్ ఆటగాళ్లలో ఒకరిగా ఎంపికయ్యాడు. [24] [25] ఆ తర్వాత అతను సిరీస్‌లోని రెండవ టెస్టు మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ జట్టులో ఎంపికయ్యాడు, [26] సీనియర్ జట్టుకు అది తొలి పిలుపు. [27] 2020 ఆగష్టు 12న, అతను పాకిస్తాన్‌తో జరిగే రెండవ టెస్టు కోసం కూడా ఇంగ్లాండ్ జట్టులో ఎంపికయ్యాడు. [28]

2020 డిసెంబరులో, రాబిన్సన్ శ్రీలంకతో సిరీస్ కోసం ఇంగ్లాండ్ టెస్టు జట్టులో ఏడుగురు రిజర్వ్ ఆటగాళ్ళలో ఒకరిగా ఎంపికయ్యాడు. [29] 2021 జనవరిలో, అతను భారత్‌తో సిరీస్ కోసం కూడా ఇంగ్లాండ్ టెస్టు జట్టులో రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపికయ్యాడు. [30]

2021 మేలో, రాబిన్సన్ న్యూజిలాండ్‌తో సిరీస్ కోసం ఇంగ్లాండ్ టెస్టు జట్టుకు ఎంపికయ్యాడు. [31] 2021 జూన్ 2న ఇంగ్లండ్ తరఫున న్యూజిలాండ్‌పై టెస్టు రంగప్రవేశం చేశాడు. [32] అతని మొదటి టెస్టు వికెట్ టామ్ లాథమ్. [33] తన అంతర్జాతీయ టెస్టు రంగప్రవేశం రోజున రాబిన్సన్, 2012, 2013లో తాను జాత్యహంకార, సెక్సిస్టు ట్వీట్లు చేసినందుకు క్షమాపణలు చెప్పాడు [34] [35] ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) 2021 జూన్ 3న రాబిన్‌సన్ ట్వీట్‌లకు అనుమతి ఇవ్వాలా వద్దా అనేదానిపై విచారణ ప్రారంభించింది. [36] [37] 2021 జూన్ 6న, రాబిన్సన్‌ను సిరీస్‌లోని రెండవ టెస్టు మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ జట్టు నుండి తొలగించారు. ECB అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌ల నుండి అతన్ని సస్పెండ్ చేసింది.[38] డిజిటల్, కల్చర్, మీడియా అండ్ స్పోర్ట్స్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఒలివర్ డౌడెన్, ECB ఆంక్షలను "ఓవర్ ది టాప్" గా అభివర్ణించారు. సస్పెన్షన్‌ను పునఃపరిశీలించమని అతను ECBని కోరాడు: "అవి కూడా ఒక దశాబ్దం నాటివి, ఒక కుర్రాడు వ్రాసినవి" అని చెప్పాడు. తరువాత, బ్రిటీష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ తాను డౌడెన్‌తో ఏకీభవిస్తున్నట్లు పేర్కొన్నాడు. [39] 2021 జూలై 3న, క్రికెట్ క్రమశిక్షణ కమిషన్ విచారణ తర్వాత, రాబిన్సన్ క్రికెట్‌కి తిరిగి రావడానికి అనుమతి పొందాడు. [40] అదే నెలలో, రాబిన్సన్ భారత్‌తో జరిగే సిరీస్ కోసం ఇంగ్లాండ్ టెస్టు జట్టులో ఎంపికయ్యాడు. [41] మొదటి మ్యాచ్‌లో, రాబిన్సన్ 5/85తో టెస్టు క్రికెట్‌లో తన మొదటి ఐదు వికెట్లు సాధించాడు. [42] రాబిన్సన్ వేసవిలో ఇంగ్లండ్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడు (19.60 సగటుతో 28 వికెట్లు); అతను 2022 ఏప్రిల్లో విజ్డెన్ యొక్క ఐదుగురు క్రికెటర్లలో ఒకరిగా ఎంపికయ్యాడు [43]

Remove ads

వ్యక్తిగత జీవితం

రాబిన్సన్ కాంటర్బరీ లోని ది కింగ్స్ స్కూల్‌లో చదువుకున్నాడు.[44] అతనికి సస్సెక్స్లో అతని సవతి తండ్రి పాల్ ఫార్బ్రేస్ శిక్షణ ఇచ్చాడు.[45]

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads