కపిల్ శర్మ

భారతదేశ హాస్యనటుడు From Wikipedia, the free encyclopedia

కపిల్ శర్మ
Remove ads

కపిల్ శర్మ (జననం 1981 ఏప్రిల్ 2)[1] ప్రముఖ భారతీయ స్టాండప్ కమెడీయన్, నటుడు, టివి వ్యాఖ్యాత, నిర్మాత. జూన్ 2013 నుంచి జనవరి 2016 వరకు భారత అతిపెద్ద కామెడీ షో కామెడీ నైట్స్ విత్ కపిల్ కు వ్యాఖ్యాతగా వ్యవహరించారు ఆయన. 2013లో ఫోర్బ్స్ సంస్థ భారతీయ సెలబ్రటీ జాబితాలో 93వ వ్యక్తిగా పేర్కొంది. 

త్వరిత వాస్తవాలు

2013లో ఎంటర్టైన్మెంట్ క్యాటగిరీలో సి.ఎన్.ఎన్-ఐబిఎన్ కపిల్ ను ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కరించింది.[2] ది ఎకనమిక్ టైమ్స్ 2015లో మోస్ట్ ఎడ్మైర్డ్ ఇండియన్ పర్సనాలిటీ జాబితాలో 3వ ర్యాంకు ఇచ్చింది.[3]  భారత ప్రధాని నరేంద్రమోడి కపిల్ ను స్వచ్ఛ  భారత్ అభియాన్ కు ఎంపిక చేశారు.[4] సెప్టెంబరు 2015లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కపిల్ ను రాష్ట్రపతి భవన్ కు పిలిచి స్వచ్ఛ్ భారత్  అభియాన్ గురించి వివరించారు.[5] 2015 సెప్టెంబరు 25న విడుదలైన కిస్ కిస్కో ప్యార్ కరూన్ సినిమాతో బాలీవుడ్ తెరంగేట్రం చేశారు కపిల్.[6][7]

Remove ads

తొలినాళ్ళ జీవితం

కపిల్ శర్మ పంజాబ్ రాష్ట్రంలోని అమృత్ సర్లో పంజాబీ హిందూ  కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి జీతేంద్ర కుమార్ పంజాబ్ పోలీస్ శాఖలో కానిస్టేబుల్ గా పనిచేసేవారు. తల్లి గృహిణి.[8] క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన తండ్రి ఢిల్లీలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2004లో మరణించారు.[9] ఆయన సోదరుడు అశోక్ కుమార్ కూడా కానిస్టేబులే. అమృత్ సర్ లోని హిందూ కళాశాలలో చదువుకున్నారు కపిల్

Remove ads

కెరీర్

ఎంహెచ్ వన్ లో హస్దే హసాందే రహో షోలో కనిపించారు కపిల్. ది గ్రేట్ ఇండియన్ లాఫర్ చాలెంజ్ కామెడీ షోతో మొట్టమొదటి విజయం సాధించారు ఆయన. ఆ తరువాత 9 రియాలిటీ షోల్లో విజేతగా నిలిచారు కపిల్. 2007లో ఒక షోలో 10లక్షల నగదు బహుమతి గెలుచుకున్నారు.[10]

ఆ తరువాత సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్ లో కామెడీ సర్కస్ లో చేశారు.[11] కామెడీ సర్కస్ లో 6 సీజన్లు గెలుచుకున్నారు కపిల్.[12] ఝలక్ ధికలాజా సీజన్ 6, కామెడీ షో చోటే మియాన్ లకు  వ్యాఖ్యాతగా వ్యవహరించారు.[13][14][15] ఉస్తాదోం కా ఉస్తాద్ షోలో కూడా పాల్గొన్నారు కపిల్

2013లో కలర్స్ లో తన స్వంత నిర్మాణ సంస్థ కె9 ప్రొడక్షన్స్ నిర్మాణంలో కామెడీ నైట్స్ విత్ కపిల్ షో మొదలు పెట్టారు కపిల్.[16]

2013లో సి.ఎన్.ఎన్-ఐబిఎన్ కపిల్ ను ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కరించింది. ఈ అవార్డును అమోల్ పాలేకర్ చేతి నుండి  అందుకున్నారు ఆయన.[17] 2014 లోక్ సభ ఎన్నికలలో ఢిల్లీ ఎన్నికలు కమిషన్ కు కపిల్ ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది.[18]

కరణ్ జోహార్ తో కలసి 2015 ఫిలింఫేర్ అవార్డు ఫంక్షన్ కు వ్యాఖ్యాతగా  వ్యవహరించారు కపిల్.[19] సెలెబ్రటీ క్రికెట్ లీగ్ 2014 4వ సీజన్ కు ప్రెజెంటర్ గా వ్యవహరించారు ఆయన.[20] 17 ఆగస్టున మొదలైన కౌన్ బనేగా కరోడ్ పతీ సీజన్ 8కు ఆయన మొదటి అతిథిగా పాల్గొన్నారు.[21] ది అనుపమ్ ఖేర్ షోకు కూడా అతిథిగా వచ్చారు కపిల్.[22]

యశ్ రాజ్ ఫిలింస్ నిర్మాణంలో తన మొదటి సినిమా చేయడానికి మొదలుపెట్టారు, కానీ ఆ సినిమా నిర్మాణదశలోనే ఆగిపోయింది.[23]   కిస్ కిస్కో ప్యార్ కరూన్ సినిమాతో బాలీవుడ్ తెరంగేట్రం చేశారు కపిల్. ఈ సినిమా 2015 సెప్టెంబరు 25న విడుదలై చాలా పెద్ద హిట్ అయింది.[24]

కామెడీ నైట్స్ విత్ కపిల్ షో తరువాత సోనీ టివిలో ది కపిల్ శర్మ షోను 2016 ఏప్రిల్ 23న మొదలుపెట్టారు.[25][26] 2016 జూన్ 26న ప్రో కబడ్డీ లీగ్ 4 ప్రారంభోత్సవంలో జాతీయ గీతం పాడి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు కపిల్.[27]

Remove ads

వ్యక్తిగత జీవితం

కపిల్ శర్మ ముంబై లో ఉంటున్నారు.[9] కిస్ కిస్కో ప్యార్ కరూన్ సినిమాలో ఒక పాటలో నటిస్తున్నప్పుడు ఆయన వెన్నులో ఒక డిస్క్ జారిపోయింది. ఫిబ్రవరి 2015లో ఈ విషయమై ట్వీట్ చేస్తూ 8 ఏళ్ళ నిర్విరామ పని తర్వాత మొదటిసారి విశ్రాంతి తీసుకుంటున్నాని తెలిపారు కపిల్.[28]

సామాజిక సేవ

జులై 2014లో ఒక అనాథ కుక్కను దత్తత తీసుకున్నారు కపిల్. దానికి జంజీర్ అని పేరు పెట్టారు. అది ముంబైలోని ఒక విశ్రాంత పోలీస్ ఉద్యోగి కుక్క. కామెడీ నైట్స్ విత్ కపిల్ షోలోనూ, సోషల్ మీడియాలోనూ కనిపించింది అది. ఏనుగులపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు ఆయన.[29]

అనాధ కుక్కలను, పిల్లులను దత్తత తీసుకునే కార్యక్రమానికి కపిల్, కామెడీ నైట్స్ విత్ కపిల్ కాస్ట్ ప్రచారంలో పాల్గొన్నారు.[30]

టెలివిజన్

మరింత సమాచారం సంవత్సరం, షో ...
Remove ads

సినిమాలు

మరింత సమాచారం సంవత్సరం, చిత్రం ...

అవార్డులు

కామెడీ సర్కస్ సిరీస్ 6 సీజన్లలోనూ మొదటి బహుమతి గెలుచుకున్నారు కపిల్.

మరింత సమాచారం సంవత్సరం, అవార్డులు ...
Remove ads

References

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads