కలియుగం
From Wikipedia, the free encyclopedia
Remove ads
కలి యుగం (దేవనాగరి: कलियुग) హిందూ పురాణాలననుసరించి మహాయుగములోని చివరి, నాలుగవ యుగం. ఇది ప్రస్తుతం నడుస్తున్న యుగం. వేదాల ననుసరించి యుగాలు నాలుగు,
- సత్యయుగం
- త్రేతాయుగం
- ద్వాపరయుగం
- కలియుగము
కలి యుగం కాల పరిమాణం 432000 సంవత్సరములు, అందు సుమారుగా ఐదు వేల సంవత్సరాలు గడిచిపోయాయి. హిందూ, బౌద్ధ కాలమానములకు ఆధార గ్రంథమైన సూర్య సిద్ధాంత ప్రకారం సా.శ.పూ. 3102 ఫిబ్రవరి 13 (00:00) కలియుగం ప్రారంభమైంది. [1] కృష్ణుడు సరిగ్గా అదే సమయానికి అవతారంను చాలించాడని హిందువులు భావిస్తారు. కలియుగాంతంలో కల్కి రూపంలో భగవంతుడు అవతరించి శివుని గురించి తపస్సు చేసి ఖడ్గం పొంది ఆ ఖడ్గం తో దుష్టశిక్షణ చేసి తిరిగి సత్య యుగ స్థాపనకు మార్గం సుగమం చేస్తాడు .
కలియుగం 5,126 సంవత్సరాల క్రిందట ప్రారంభమైంది. ఈ తేదీని ఫిబ్రవరి 17/18, మధ్యరాత్రి పరిగణిస్తారు. ప్రస్తుత సా.శ.2025 సంవత్సరానికి ఇంకా 4,26,874 సంవత్సరాలు మిగిలివుంది. సా.శ. 428,899లో అంతమవుతుంది.[2] క్రీ.పూ. 3102 నుండి ప్రస్తుత సంవత్సరాన్ని కలిపి కలియుగ వయస్సును లెక్కిస్తారు (ఉదా: 3102 + 2024 = 5126).సూర్య సిద్ధాంతం మరియు భగవద్గీత వంటి గ్రంథాలలో యుగ గణనలు ప్రస్తావించబడ్డాయి. కొన్ని వివాదాస్పద అభిప్రాయాలు ఉన్నప్పటికీ, సాంప్రదాయిక హిందూ సాహిత్యం, ఖగోళీయ గణనల ప్రకారం 3102 BCE సాధారణంగా అంగీకరించబడింది.
Remove ads
కలియుగ లక్షణాలు
కలియుగంలో అంతా అధర్మమే. అధర్మం అని తెలిసి కూడా మనుషులు అధర్మం చేస్తారు. అంతా అన్యాయమే. మంచి వాళ్ళకు చెడు ఎదురవుతూ ఉంటుంది. అసలు భగవంతుడిని తలచుకొనే వారే కనిపించరు. సంసారంలో భార్యాభర్తలు, ధనధాన్యాలు లాంటి వన్నీ సులభంగా సమకూరతాయి.
ఇవి కూడా చూడండి
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads