కల్పము (కాలమానం)
From Wikipedia, the free encyclopedia
Remove ads
కల్ప (సంస్కృతం: कल्प కల్ప) ఒక సంస్కృత పదం. విశ్వోద్భవంలో హిందూ, బౌద్ధ మతములలో సాపేక్షకంగా సుదీర్ఘ కాలం (మానవ గణన ద్వారా) అని అర్ధం సూచిస్తుంది. ఈ పద్ధతి మహాభారతంలో మొట్టమొదట ప్రస్తావించబడింది. రోమిల థాపర్, "కల్పం అశోక శాసనాల్లో మొట్టమొదటిగా ప్రస్తావించబడింది" అని పేర్కొనడం జరిగింది.[1] బౌద్ధమతం యొక్క ప్రారంభ కాలంలో పాలి భాషలో, ఈ పదం రూపం కప్పా అని కనపడుతుంది. ఇది సుత్తా నిపత బౌద్ధ మతము (బుద్ధిజం) యొక్క పురాతన గ్రంథాలలో పేర్కొనబడింది.[2] [3][2] ఇది "కప్పాటిత: సమయం దాటి పోయినవాడు, అరహంత్" గురించి తెలియజేస్తుంది. బౌద్ధ లిఖిత లిపిలోని ఈ భాగం, గతించిన సహస్రాబ్ది బిసిఈ యొక్క మధ్య కాలము భాగానికి చెందినది.[4]
ఈ వ్యాసం పురాణోక్త కాలమానం గురించి. వేదాంగాలలో విభాగం కొరకు, కల్పము (వేదాంగం) చూడండి.
సాధారణంగా చెప్పాలంటే, ఒక కల్పము అనేది ప్రపంచం లేదా విశ్వం యొక్క సృష్టి, స్థితి, లయముల మధ్య కాలం అని అర్థం.[5]
Remove ads
కల్పం కాలప్రమాణం
కల్పము అనగా 4.32 బిలియన్ సంవత్సరాలకు సమానం అని హిందూ మతము యొక్క పురాణాలు యందు నిర్వచించ బడింది. ప్రత్యేకంగా విష్ణు పురాణం, భాగవత పురాణాల్లో పేర్కొన బడింది.[6]
బౌద్ధ మతము
విశుద్ధిమగ్గా ప్రకారం, కల్పాలు, వాటి కాల వ్యవధులకు అనేక వివరణలు ఉన్నాయి. ఇందులో మొదటి వివరణలో, నాలుగు రకాలు ఉన్నాయి:
ఆయు కల్పం
ఒక ప్రత్యేకమైన యుగంలో లేదా యుగాలలో ఒక సాధారణ మానవుడి యొక్క జీవన కాలపు ప్రమాణపు అంచనాను సూచించే సమయం. ఇది ఒక అసంఖ్యాకం వంటి అధిక సంఖ్యతో లేదా చిన్న వయస్సు 10 సంవత్సరాలుగా ఉంటుంది. ఈ సంఖ్య స్థాయికి నేరుగా ఆ శకంలో ప్రజల ధర్మం అనుపాతంలో ఉంటుంది. ప్రస్తుతం ఈ కాలంలో దీని విలువ సుమారు 100 ఏళ్లుగా ఉంటుంది, ఇది నిరంతరంగా తగ్గుతుంది.
అనంత కల్పం
బౌద్ధమతం ప్రకారం, మానవ జీవిత కాలం అసంఖ్యాకం సంవత్సరాలు, 10 సంవత్సరాల మధ్య మారుతూ ఉంటుంది. అసంఖ్యాకం అనగా 10 140 అని అర్థం. అసంఖ్యాకం నుండి 10 సంవత్సరాల వరకు మానవ జీవితకాలం తగ్గడానికి సమయం పడుతుంది. అలాగే 10 సంవత్సరాల నుండి అసంఖ్యాకం వరకు పెరగడాన్ని అనంత కల్పం అని పిలుస్తారు. ఒక అనంత కల్పం ముగియడం (లేదా సామూహిక-విలుప్తం) అన్నింటికన్నా ఎక్కువ మంది మానవ జాతి అంతరించి పోవడానికి అనేది మూడు విధాలలో ఒకటిగా జరిగి ఉండవచ్చును.
- శస్త్రాంత కల్పం - యుద్ధాల ద్వారా అధిక సంఖ్యలో ప్రజలు విలుప్తం కావడం.
- దుర్భిక్షాంత కల్పం - ఆకలిచే వినాశనం.
- రోగాంత కల్పం - ప్లేగు వ్యాధి ద్వారా విలుప్తం కావడం.
- అసంఖ్య కల్పం - 20 అంతం కల్పాలు సమయం. ఈ కాలసమయం ఒక మహా కల్పములో పావుకి సమానం.
- మహా కల్పం - మహా కల్పము బౌద్ధమతంలో అతిపెద్ద కాల వ్యవధి.
- ఒక మహా కల్పం (అపోకాలిప్స్) ముగియడం అనేది మూడు విధాలుగా జరుగుతుంది: అగ్ని, నీరు , గాలి. ఇది నాలుగు భాగాలుగా విభజించబడింది.
ఒక్కొక్కటి అసంఖ్యాకం కల్పము నకు సమానమైనది.
- మొదటి భాగంలో - ఈ ప్రపంచంలో ఏర్పడిన సమయం.
- రెండవ భాగంలో - అన్ని జీవులు వృద్ధి చెందగల ఈ ప్రపంచంలోని స్థిరమైన వ్యవధి.
- మూడవ భాగంలో - నాశనం చేయబడటానికి ఈ ప్రపంచానికి తీసుకున్న (పట్టిన) సమయం.
- నాలుగవ భాగంలో - ఖాళీ సమయం.
కల్పం సరళమైన వివరణ
కల్పం అనగా మరొక సరళమైన వివరణలో, కల్పాలకు నాలుగు వేర్వేరు నిడివి కాలాలున్నాయి.
- ఒక సాధారణ కల్పం సుమారు 16 మిలియన్ సంవత్సరాలు (16,798,000 సంవత్సరాలు) గా ఉంటుంది.[7]) ఒక చిన్న కల్పం అనగా 1000 సాధారణ కల్పాలు లేదా సుమారు 16 బిలియన్ సంవత్సరాలు.
- ఇంకా, ఒక మధ్యమ కల్పం సుమారుగా 320 బిలియన్ సంవత్సరాలు లేదా 20 చిన్న కల్పాలకు సమానం.
- ఒక మహా కల్పం 4 మధ్యమ కల్పాలకు, లేదా 1.28 ట్రిలియన్ సంవత్సరాలకు సమానం.
ఒక సందర్భంలో, కొంతమంది బౌద్ధ సన్యాసులు ఇప్పటివరకు ఎన్ని కల్పాలు అంతరించి పోయాయోనని తెలుసుకోవాలనుకున్నారు. బుద్ధుడు సామ్యంతో ఇలా చెప్పాడు: మీరు గంగా నది యొక్క అడుగు భాగంలో నుండి మొత్తం ఇసుక ఎక్కడ నుంచి ప్రారంభమవుతోంది, తిరిగి ఎక్కడ సముద్రంలో ముగుస్తోంది వరకు ఉన్న ఇసుక రేణువులను లెక్కించినట్లయితే, ఆ లెక్కించిన సంఖ్య కంటే అంతరించి పోయిన కల్పాల సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది.[8]
హిందూ మతము
కల్పం అంటే బ్రహ్మకు ఒక పగలు. ఇది 432 కోట్ల సంవత్సరాలు. ఒక కల్పంలో 14 మన్వంతరాలుంటాయి. మన్వంతరాన్నే మనుయుగమని కూడా అంటారు. మన్వంతరానికి 31,10,40,000 సంవత్సరాలు. ఒక్కో మన్వంతరంలో భూమిని ఒక్కో మనువు పాలిస్తాడు. ప్రస్తుతం నడుస్తున్నది ఏడవ మన్వంతరం. పాలిస్తున్నది వైవస్వత మనువు. దీన్ని వైవస్వత మన్వంతరం అంటారు. ఒక్కో మన్వంతరంలో 71 మహాయుగాలు, ఒక్కో మహాయుగంలో నాలుగు యుగాలు (కృత, త్రేతా, ద్వాపర, కలి యుగాలు) ఉంటాయి.
దేవతల కాల ప్రమాణము మన (మానవ) కాలప్రమాణమునకు 360 రెట్లు అధికము. అనగా మన ఒక సంవత్సరకాలము దేవతలకు ఒక దివారాత్రము (పగలు + రాత్రి). మన 30 సంవత్సరములు దేవతలకు ఒక నెల. మన 360 సంవత్సరములు వారికి ఒక (దివ్య) సంవత్సరము. ఇట్టి 12,000 దివ్య సంవత్సరములు వారికి ఒక దివ్య యుగము (మహాయుగము). ఇది మనకు ఒక చతుర్యుగకాల సమానము. ఈ విధముగా లెక్క పెడితే మన 43,20,000 సంవత్సరములు ఒక మహాయుగము అగును.
- కృత యుగము = 4,800 దివ్య సంవత్సరములు = 17,28,000 మానవ సంవత్సరములు
- త్రేతా యుగము = 3,600 దివ్య సంవత్సరములు = 12,96,000 మానవ సంవత్సరములు
- ద్వాపర యుగము = 2,400 దివ్య సంవత్సరములు = 8,64,000 మానవ సంవత్సరములు
- కలియుగము = 1,200 దివ్య సంవత్సరములు = 4,32,000 మానవ సంవత్సరములు
- మొత్తము 12,000 దివ్య సంవత్సరములు = 43,20,000 మానవ సంవత్సరములు - ఒక దివ్య యుగము (చతుర్యుగము, మహాయుగము)
ఇలాంటి వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక పగలు. బ్రహ్మ పగలును కల్పము (సర్గము) అంటారు. మరొక వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక రాత్రి. ఈ రాత్రిని ప్రళయము అంటారు. అటువంటి 360 దివారాత్రములు బ్రహ్మకు ఒక సంవత్సరము. అటువంటి 100 సంవత్సరములు బ్రహ్మ ఆయుఃకాలము.
Remove ads
కల్పముల పేర్లు
మహాభారతంలో చెప్పిన ప్రకారం ప్రస్తుతం బ్రహ్మకు 51వ సంవత్సరంలో "శ్వేతవరాహ కల్పం" నడుస్తున్నది. మత్స్య పురాణం (290.3-12)లో 30 కల్పాల పేర్లు చెప్పబడ్డాయి. అవి:[9]
- శ్వేత కల్పము
- నీలలోహిత కల్పము
- వామదేవ కల్పము
- రత్నాంతర కల్పము
- రౌరవ కల్పము
- దేవ కల్పము
- బృహత్ కల్పము
- కందర్ప కల్పము
- సద్యః కల్పము
- ఈశాన కల్పము
- తమో కల్పము
- సారస్వత కల్పము
- ఉదాన కల్పము
- గరుడ కల్పము
- కౌర కల్పము
- నారసింహ కల్పము
- సమాన కల్పము
- ఆగ్నేయ కల్పము
- సోమ కల్పము
- మానవ కల్పము
- తత్పుమాన కల్పము
- వైకుంఠ కల్పము
- లక్ష్మీ కల్పము
- సావిత్రీ కల్పము
- అఘోర కల్పము
- వరాహ కల్పము
- వైరాజ కల్పము
- గౌరీ కల్పము
- మహేశ్వర కల్పము
- పితృ కల్పము
వాయు పురాణం 21వ అధ్యాయంలో 28 కల్పాల పేర్లున్నాయి. తరువాతి అధ్యాయంలో మరో ఐదు కల్పాలపేర్లున్నాయి.
Remove ads
ఇవికూడా చూడండి
మూలాలు
బయటి లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads