కల్వకుర్తి

తెలంగాణ, నాగర్‌కర్నూల్ జిల్లా, కల్వకుర్తి మండలం లోని జనగణన పట్టణం From Wikipedia, the free encyclopedia

కల్వకుర్తిmap
Remove ads

కల్వకుర్తి, తెలంగాణ రాష్ట్రంలోని నాగర్‌కర్నూల్ జిల్లా, కల్వకుర్తి మండలానికి చెందిన గ్రామం.[1] ఇది జనగణన పట్టణం. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మహబూబ్ నగర్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది.[2] 2013 మార్చి 22న కల్వకుర్తి పురపాలకసంఘంగా ఏర్పడింది.[3] ఇది మహబూబ్ నగర్ నుండి నల్గొండ వెళ్ళు ప్రధాన రహదారిపై ఉంది. హైదరాబాదు నుండి కూడా బస్సు సౌకర్యము ఉంది., ప్రతి 15 నిమిషాలకి ఒకసారి కల్వకుర్తి నుండి హైదరాబాదుకు, హైదరాబాదు నుండి కల్వకుర్తికి బస్సులు ఉన్నాయి. మండలపు దక్షిణ సరిహద్దులో డిండి నది ప్రవహిస్తోంది. కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గంలో 5 మండలాలు ఉన్నాయి.పిన్ కోడ్: 509324.

త్వరిత వాస్తవాలు అక్షాంశరేఖాంశాలు: 16.665011°N 78.489796°E /, రాష్ట్రం ...
Remove ads

చరిత్ర

ఈ ప్రాంతాన్ని పూర్వం కలువకుర్తి అని పిలిచేవారు. నిరంకుశ నిజాం పాలన వ్యతిరేక పోరాటంలో కల్వకుర్తిలో లింగారెడ్డి నాయకత్వంలో తదితరులు నిజాం వ్యతిరేక ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు.1989లో ఇక్కడి నుండి పోటీ చేసిన అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిత్తరంజన్ దాస్ చేతిలో పరాజయం పొందడంతో అప్పుడు ఈ నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

గణాంకాలు

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం - మొత్తం 64,095 - పురుషులు 32,642 - స్త్రీలు 31,453.అక్షరాస్యుల సంఖ్య 36352.మండలంలో పట్టణ జనాభా 28110 కాగా గ్రామీణ జనాభా 36043.[4]

రవాణా సౌకర్యాలు

అంతర్రాష్ట్ర రహదారి అయిన హైదరాబాదు - శ్రీశైలం రహదారి కడ్తాల్, ఆమనగల్లు, కల్వకుర్తిల గుండా జిల్లా నుంచి వెళుతుంది. దీనిని జాతీయ రహదారిగా చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది.నాగర్‌కర్నూల్ జిల్లా లోని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు డిపోలలో కల్వకుర్తి బస్సు డిపో ఒకటి.

విద్యాసంస్థలు

  • ప్రభుత్వ జూనియర్ కళాశాల ( స్థాపన : 1970-71)
  • వై.ఆర్.ఎం.జూనియర్, డిగ్రీ కళాశాల ( స్థాపన : 1997-98)
  • ఉషోదయ జూనియర్, డిగ్రీ కళాశాల ( స్థాపన : 1992-93)
  • కార్లోబొనివిని స్మారక జూనియర్ కళాశాల (సి.బి.యం) ( స్థాపన : 2001-02)
  • ఎ.పి.ఆర్.ఎస్ (బి.సి) బాలికల గురుకుల పాఠశాల
  • శ్రీ కృష్ణవేణి జూనియర్ కళాశాల

ఇవే కాకుండా ఈ మధ్య కాలంలో మరికొన్ని ప్రయివేటు కళాశాలలు, పాఠశాలలు కూడా ఏర్పాటు చేయటం జరిగింది.

Remove ads

నీటిపారుదల, భూమి వినియోగం

మండలంలో 6 చిన్ననీటిపారుదల వనరుల ద్వారా 312 హెక్టార్ల ఆయకట్టు వ్యవసాయ భూములున్నాయి. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు జలయజ్ఞంలో ప్రారంభించబడి పురోభివృద్ధిలో ఉంది.[5]

మూలాలు

ఇవి కూడా చూడండి

వెలుపలి లింకులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads