కిమి వర్మ
From Wikipedia, the free encyclopedia
Remove ads
కిమి వర్మ ప్రముఖ బాలీవుడ్ నటి, ఫ్యాషన్ డిజైనర్.[1] బాంబే విశ్వవిద్యాలయంలో ఎంబిఎ చదివిన తరువాత ఆమె లాస్ ఏంజిలెస్ కు మారిపోయారు. ప్రస్తుతం కూడా ఆమె అక్కడే నివసిస్తున్నారు. ఆమెకు స్వంతంగా స్త్రీల ఫ్యాషన్ హౌస్ ఉంది. ఆ కంపెనీకి లీడ్ డిజైనర్, సి.ఈ.వోగా కిమీ పనిచేస్తున్నారు.

1994లో మిస్ బాంబే,[2] ఫెమినా మిస్ ఇండియా బ్యూటిఫుల్ హైర్ టైటిల్స్ ను గెలుచుకున్నారు. చాలా పంజాబీ సినిమాల్లో అవకాశాలు వచ్చాయి ఆమెకు. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెలెస్ లో వస్త్రాల డిజైనర్ గా పనిచేస్తున్నారు.
Remove ads
వ్యక్తిగత జీవితం
1977 నవంబరు 20న పంజాబ్లో జన్మించారు కిమి. పంజాబీ హిందూ కుటుంబంలో పుట్టారామె. పంజాబ్ లో పుట్టినా ఆమె చదువు ముంబైలో సాగింది. బాంబే విశ్వవిద్యాలయం నుండి ఎంబిఎ పట్టా అందుకున్నారు కిమి. ఆ తరువాత ఆమె కాలిఫోర్నియాలోని లాస్ ఏంజలస్ కు మకాం మారిపోయారు ఆమె. ప్రస్తుతం లాస్ ఏంజలస్ లో లేడీస్ ఫ్యాషన్ హౌస్ నడుపుతున్నారు కిమి. ఆ కంఫెనీకి సి.ఈ.వో గానే కాక, లీడ్ డిజైనర్ గా కూడా వ్యవహరిస్తున్నారు ఆమె. కిమి మోడల్ గానూ, నటిగానూ కూడా చాలా సంవత్సరాలు పనిచేశారు. అన్నీ పంజాబీ సినిమాలే చేశారు కిమి.
Remove ads
కెరీర్
నసీబో(1994)లో ఒక పాత్రతో తెరంగేట్రం చేశారు కిమి. ఆ తరువాత కహర్(1997), జీ ఆయున్ ను, అసును మాన్ వత్నా డా, మేరా పిండ్-మై హోం వంటి పంజాబీ సినిమాల్లో నటించారామె. కొన్ని టివి సీరియల్స్ లోనూ, మోడల్ గానూ కూడా పనిచేశారు కిమి.
సినిమాలు
- 1994 - నసీబో
- 1997 - కహర్
- 2000 - షాహీద్ ఉదమ్ సింగ్
- 2002 - జీ ఆయన్ ను
- 2004 - అసను మాన్ వత్నా డా
- 2008 - మేరా పిండ్-మై హోమ్
- 2009 - సాత్ శ్రీ అకల్
- 2010 - ఇక్ కుడీ పంజాబీ డీ
- 2012 - అజ్ డీ రంఝే
మూలాలు
బయటి లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads