శ్రీకృష్ణ తులాభారం 1935, ఏప్రిల్ 22న విడుదలైన తెలుగు చలనచిత్రం. సి.పుల్లయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కపిలవాయి రామనాధశాస్త్రి, కాంచనమాల, లక్ష్మీరాజ్యం, రేలంగి వెంకట్రామయ్య, ఋష్యేంద్రమణి నటించారు. ఋషేంద్రమణి ఇందులో తొలిసారిగా సత్యభామగా నటించగా రేలంగికి ఇది తొలిచిత్రం. ఈ సినిమాను కలకత్తాలో చిత్రీకరించారు.[1] కాంచనమాల, లక్ష్మీరాజ్యంలకు కుడా ఇది తొలిచిత్రం.
నటవర్గం
- జై సింగ్ (శ్రీకృష్ణుడు)
- కపిలవాయి రామనాధశాస్త్రి (నారద)
- కాంచనమాల (మిత్రవింద)
- కాకినాడ జోగినాథం (వసంతక)
- గుంటూరు సభారంజని (రుక్మిణి)
- లక్ష్మీరాజ్యం (నళిని)
- రేలంగి వెంకట్రామయ్య (విధూషకుడు)[2]
- ఋష్యేంద్రమణి (సత్యభామ)
సాంకేతికవర్గం
- దర్శకత్వం: సి.పుల్లయ్య
- నిర్మాత: వై.వి.రావు
- నిర్మాణ సంస్థ: మదన్ థియేటర్స్
- పాటలు, పద్యాలు: చందాల కేశవదాసు, ముత్తరాజు సుబ్బారావు, స్థానం నరసింహారావు
పాటలు
ఈ సినిమాతో కేశవదాసు సినీ కవిగా ఉన్నత స్థానానికి చేరుకున్నాడు. ఈ చిత్రంలో భలే మంచి చౌకబేరము,మునివరా తుదికిట్లు నానున్ మోసగింతువా, కొట్టు కొట్టండి బుర్ర పగలు గొట్టండి అనే మూడు పాటలు రాశాడు. వీటిలో భలే మంచి చౌకబేరము పాట బహుళ జనాదరణ పొందింది. ఈ మూడు పాటలను ఆ తరువాత మరో రెండుసార్లు శ్రీకృష్ణ తులాభారం (1955), శ్రీకృష్ణ తులాభారం (1966) నిర్మించినపుడు కూడా వాడుకున్నారు.[3]
మూలాలు
ఇతర లంకెలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.