కొమ్మూరి సాంబశివ రావు

ప్రముఖ రచయిత, డిటెక్టివ్ నవలలతో ప్రసిద్ధుడు From Wikipedia, the free encyclopedia

Remove ads

కొమ్మూరి సాంబశివ రావు (1926-1994) ఒక ప్రముఖ నవలా రచయిత.[1] తెలుగులో తొలి హారర్ నవలా రచయిత. ప్రముఖ తెలుగు రచయితల కుటుంబంలో జన్మించాడు. సినీ జర్నలిస్టుగా, పత్రికా సంపాదకుడిగా పనిచేశాడు. 90 కి పైగా నవలలు రాసి డిటెక్టివ్ నవలా రచయితా సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఆయన సృష్టించిన డిటెక్టివ్ యుగంధర్, అతని అసిస్టెంట్ రాజు పాత్రలు తెలుగు పాఠకులకు పరిచయమైన పేర్లు.

త్వరిత వాస్తవాలు కొమ్మూరి సాంబశివ రావు, జననం ...
Remove ads

జీవిత విశేషాలు

సాంబశివరావు 1926 అక్టోబరు 26 న తెనాలిలో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు వెంకట్రామయ్య, పద్మావతి. వెంకట్రామయ్య ప్రముఖ రచయిత చలంకు స్వయానా తమ్ముడు.[2] చలాన్ని తన తాత దత్తత తీసుకోవడంతో ఆయన ఇంటి పేరు గుడిపాటిగా మారింది. వెంకట్రామయ్యకు అప్పట్లో తెనాలిలో ప్రింటింగ్ ప్రెస్ ఉండేది. సాంబశివరావు తల్లి పద్మావతి బళ్ళారి రాఘవ బృందంతో కలిసి నాటకాలు వేస్తుండేది. కొడవటిగంటి కుటుంబరావు భార్యయైన వరూధిని ఈయనకు అక్క. అలా ఈయన కొడవటిగంటి రోహిణీప్రసాద్కు మేనమామ అవుతాడు.[3] ఆయన చెల్లెలు ఉషారాణి డిల్లీలోని నేషనల్ బుక్ ట్రస్ట్లో తెలుగు విభాగానికి అధ్యక్షురాలిగా ఉండేది.

Remove ads

నవలలు

కొమ్మూరి 14 సంవత్సరాల వయసు నుండే కథలు రాయడం ప్రారంభించాడు. 1957-1980 మధ్యలో ఆయన విస్తృతంగా రచనలు చేశాడు. ఆంగ్ల రచయిత ఎడ్గర్ వాలేస్ ఆయనకు స్ఫూర్తి. భారత మాజీ ప్రధాని పి.వి. నరసింహా రావు ఈయన రచనలను అభిమానించే వాడు. మల్లాది వెంకటకృష్ణమూర్తి కొమ్మూరి నుంచి స్ఫూర్తి పొందాడు.[2]

ఆయన డిటెక్టివ్ నవలల్లో కనిపించే పాత్రలు డిటెక్టివ్ యుగంధర్, అతని సహాయకుడు రాజు, పోలీసు ఇన్ స్పెక్టరు స్వరాజ్య రావు. వీటిలో చాలా నవలలు మద్రాసు పట్టణం నేపథ్యంలో రాసినవి.

  • లక్షాధికారి హత్య
  • చావు కేక
  • అర్ధరాత్రి అతిథి
  • ఉరితాడు
  • ప్రమీలాదేవి హత్య
  • చీకటికి వేయి కళ్ళు
  • అడుగో అతనే దొంగ
  • మతిపోయిన మనిషి
  • నేను చావను
  • ప్రాక్టికల్ జోకర్
  • ప్రమాదం జాగ్రత్త
  • నువ్వు ఎవరి కోసం
  • ఒక వెన్నెల రాత్రి
  • ఒక చల్లని రాత్రి
  • ప్రపంచానికి 10 గంటల్లో ప్రమాదం
  • లాకెట్ మర్మం
  • ఇరవై నాలుగు గంటలలో
  • 28 మెట్లు
  • అడ్డదారులున్నాయి జాగ్రత్త
  • అడుగో అతనే హంతకుడు
  • అడుగు పడితే అపాయం
  • ఐదుగురు అనుమానితులు
  • అర్ధరాత్రి పిలుపు
  • అతను అతను కాదు
  • చావు తప్పితే చాలు
  • చేతులు ఎత్తు
  • ఎర్రని గుర్తు
  • గణ గణ మోగిన గంట
  • మళ్ళీ ఎప్పుడో ఎక్కడో
  • ముందు నుయ్యి వెనుక గొయ్యి
  • నన్ను చంపకండి
  • నెఫాలో కెప్టెన్ నరేష్
  • నేను నేను కాను
  • నంబర్ 444
  • నంబర్ 555
  • నంబర్ 678
  • నంబర్ 777
  • నంబర్ 888
  • నంబర్ 787
  • పదును లేని కత్తి గుళ్ళు లేని పిస్తోలు
  • పాపం పిలిచింది
  • పారిపోయిన ఖైదీ
  • సుజాత
  • తలుపు తెరిస్తే చస్తావు
  • వలలో చిక్కిన వనిత
  • x808
Remove ads

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads