గుంటూరు పశ్చిమ మండలం
గుంటారు జిల్లాకు చెందిన మండలం From Wikipedia, the free encyclopedia
Remove ads
గుంటూరు పశ్చిమ మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్టం, గుంటూరు జిల్లాకు చెందిన మండలం.[2] ఇది గుంటూరు ఆదాయ విభాగం పరిపాలన క్రింద ఉంది. గతంలోఉన్న గుంటూరు మండలాన్ని గుంటూరు పశ్చిమ, గుంటూరు తూర్పు మండలాలుగా విభజించుట ద్వారా ఈ మండలం 2022 జిల్లాల పునర్ల్యస్థీకరణలో భాగంగా ఏర్పడింది.దీని ప్రధాన కార్యాలయం గుంటూరు నగరంలో ఉంది.[3][4][5][6]
Remove ads
పరిపాలన
ఈ మండల పరిపాలన తహశీల్దార్ అజమాయిషీలో సాగుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ సీఆర్‌డీఏ అధికార పరిధిలో ఆంధ్రప్రదేశ్ రాజధానిప్రాంతంలో భాగంగా ఉంది. గుంటూరు పశ్చిమ శాసనసభ నియోజకవర్గం, గుంటూరు లోక్‌సభ నియోజకవర్గంలో ఒక విభాగం.
మండలం లోని పట్టణ ప్రాంతాలు, గ్రామాలు
గుంటూరు పశ్చిమ మండలం గుంటూరు నగరపాలక సంస్థ పశ్చిమ భాగం, అంకిరెడ్డిపాలెం, చౌడవరం, నల్లపాడు, పెదపలకలూరు, పొత్తూరు, వంటి పట్టణ సమ్మేళనాలు ఉన్నాయి.[3] చినపలకలూరు మినహా మిగిలిన అన్ని ప్రాంతాలు ఇప్పటికే డీ-నోటిఫై చేసి, 2012లో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేసారు.[7][8][9]
ఇవి కూడా చూడండి
గుంటూరు మండలం - ఇది చారిత్రిక మండలం. ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ - 2022లో ముందు ఈ మండలం ఉనికిలో ఉంది. పునర్వ్యవస్థీకరణ భాగంగా గుంటూరు జిల్లా పరిధిని సవరించి, దీని స్థానంలో గుంటూరు తూర్పు మండలం, గుంటూరు పశ్చిమ మండలం అనే రెండు మండలాలు ఏర్పడ్డాయి.
మూలాలు
వెలుపలి లంకెలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads