గుడిహత్నూర్ శివాలయం
From Wikipedia, the free encyclopedia
Remove ads
గుడిహత్నూర్ శివాలయం తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలో 44 వ.జాతీయ రహదారి ప్రక్కన శివాలయం ఉంది.ఇది ఏడు వందల సంవత్సరాల చరిత్ర కల్గి కాకతీయుల కాలంలో నిర్మించిన అతి ప్రాచిన ఆలయం [1] .[2][3].
ఈ శివాలయం (గుడి) చుట్టు గుడిల సంఖ్య ఎక్కువగా ఉండడం చేత ఇక్కడి ప్రజలు గుడి ఉన్న ఊరు గుడి ఉన్న ఊరు అని పలుకుతు కాలానికి అనుగుణంగా అది గుడిహత్నూర్ అయిందని పెద్దలు అంటారు.
Remove ads
ఆలయ నిర్మాణం
ఈ శివాలయాన్ని మహాదేవాలయం అని కూడా ఇక్కడి భక్తులు పిలుస్తారు. వేయి సంవత్సరాల పురాతన ఆలయం అని ఇక్కడి పెద్దలు చేపుతారు.ఆలయ నిర్మాణానికి ఇటుకలు, సిమెంట్, కాంక్రేంటు ఉపయోగించకుండా కేవలం పెద్ద పెద్ద బండరాళ్లతో నిర్మించారు. బండారాళ్ళనే పిల్లర్లుగా మలచి మొత్తం 24 రాతి పిల్లర్లతో అద్భుతమైన ఆలయం నిర్మించారు.ఆ పిల్లర్ల పై హిందూ సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడేలా అందమైన డిజైన్ చేక్కి శిల్పకళను నిర్మించారు.గర్భగుడి ముఖద్వారం పై అబ్బురపరిచే శిల్పకళా నైపుణ్యం బండరాళ్లను స్తంభాలుగా మలిచి శిల్పాలను చూడముచ్చటగా అర్చించారు. గర్భగుడిలో స్వాగత తోరణం కట్టి అందులో దేవుడి ప్రతిమను అద్భుతంగా చెక్కారు.వినాయకుడి గర్భగుడిలో నల్లరాతితో వెలుగులీనుతున్న శివలింగం, నంది విగ్రహాలు శిల్పకళా నైపుణ్యానికి అద్దం పడుతుంది. ఆలయంలో కుడివైపున విఠల్ రుక్మిణీ ఆలయం, ఎడుమ వైపు దుర్గా దేవి ఆలయలు కొత్తగా నిర్మించడం విశేషం.
Remove ads
ఆలయ ప్రత్యేకత
ఈ శివాలయం గర్భగుడిలో ఉన్న అఖండ జ్యోతి కోన్ని దశాబ్ధాలుగా ఆరిపోకుండా నిర్విరామంగా వెలుగుతున్నె ఉండడం విశేషం ఉంది[4].
మహాశివరాత్రి ఉత్సవాలు
శివాలయంలో మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఆలయంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. గుడిహత్నూర్ మండల కేంద్రానికి చెందిన భక్తులతో పాటు పరిసరా గ్రామాల నుండి కూడా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకోని పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం నుంచే భక్తులు ఆలయాల వద్ద బారులు తీరుతారు[5].
అఖండ హరినామ సప్తహ
ఈ శివాలయంలో ఏడు రోజులు పాటు అఖండ హరినామ సప్తాహం అనే కార్యక్రమం ఆలయ కమీటి అధ్వర్యంలో నిర్వహిస్తారు. ఆ సప్తా సమయంలో బ్రహ్మముహూర్తాన స్వామి వారికి పూజలు ప్రత్యేక హరతీ నిర్వహిస్తారు. ప్రముఖ మహారాజ్ చే ప్రవచనాలు, భజనాలు నిర్వహించడం వలన భక్తుల్లో ఆధ్యాత్మిక భక్తి భావం, క్రమశిక్షణ, దైవనామస్మరణ వలన జీవన విధానంలో మార్పులు వచ్చి సన్మార్గంలో దైవ నామసర్ణంలో భక్తులు ఉంటారని నమ్ముతారు.
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads