గుప్పెడు మనసు

From Wikipedia, the free encyclopedia

గుప్పెడు మనసు
Remove ads

కె. బాలచందర్ దర్శకత్వంలో 1979లో వచ్చిన ఒక తెలుగు చిత్రం. సాధారణ చిత్రాలకు భిన్నంగా బాలచందర్ సినిమాలన్నీ సాగుతాయి. అసాధారణమనుకున్న విషయం ఒకటి తనకు సంభంధించిన మనుషుల మధ్యే చోటుచేసుకోవటంతో , సుజాత మనసులోని సంఘర్షణ కొత్తకోణంలో ఆవిష్కృతమౌతుంది ఈ చిత్రంలో. సుజాత, శరత్ బాబు భార్యాభర్తలు. సుజాత సెన్సారు సభ్యురాలు. సరిత (వయసులో వారికన్నా చాల చిన్నది) వారి కుటుంబ స్నేహితురాలు. సుజాత ఒక చిత్రం సెన్సారు చేసేటపుడు అభ్యంతరం చెప్పిన సంఘటన వారి కుటుంబంలోనే తారసిల్లుతుంది. ఇదీ చిత్రకథ. బాలమురళీ కృష్ణ పాడిన ఆత్రేయ గీతం మౌనమే నీ భాష ఓ మూగమనసా ఈ చిత్రంలోనిదే.[1]

త్వరిత వాస్తవాలు దర్శకత్వం, తారాగణం ...
Remove ads

తారాగణం

సాంకేతిక వర్గం

  • స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె.బాలచందర్
  • మాటలు: గణేష్ పాత్రో
  • పాటలు: ఆచార్య ఆత్రేయ
  • నేపథ్య గానం:మంగళంపల్లి బాలమురళీకృష్ణ, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం
  • కధ: షరీఫ్
  • సంగీతం: ఎం.ఎస్.విశ్వనాథన్
  • ఛాయా గ్రహణం: బి.ఎస్.లోకనాథ్
  • కళ: ఎ.రామస్వామి
  • కూర్పు: ఎన్.ఆర్.కిట్టు
  • నిర్మాతలు: పి.ఆర్.గోవిందరాజన్, జె.దొరస్వామి
  • నిర్మాణ సంస్థ: కళాకేంద్ర మూవీస్
  • విడుదల:02:11:1979.

పాటలు

ఈ చిత్రం లోని పాటలు రచయిత ఆచార్య ఆత్రేయ.

  1. కన్నె వలపు కనుల పిలుపు ఎదురు చూస్తున్నవి - ఎస్.పి. బాలు, వాణీ జయరాం
  2. నేనా పాడనా పాట మీర అన్నది మాట - వాణీ జయరాం, ఎస్.పి. బాలు
  3. నువ్వేనా సంపంగి పువ్వుల నువ్వేనా జాబిలి నవ్వున - ఎస్.పి. బాలు
  4. మౌనమె నీ భాష ఓ మూగ మనసా - మంగళంపల్లి బాలమురళీకృష్ణ

మూలాలు

బయటి లింకులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads