చంటి

From Wikipedia, the free encyclopedia

చంటి
Remove ads

చంటి 1991 లో రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో వెంకటేష్, మీనా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో నటనకు వెంకటేష్ కు ఉత్తమ నటుడిగా, ఉత్తమ గాయకుడిగా ఎస్. పి. బాలుకు నంది పురస్కారాలు లభించాయి. ఈ సినిమాకు చిన్నతంబి అనే తమిళ సినిమా మాతృక. ఈ సినిమా కన్నడలో రామాచారి అనే పేరుతో, హిందీలో అనారీ అనే పేరుతో పునర్నిర్మితమైంది. హిందీ రీమేక్ లో వెంకటేష్ Downloading నటించాడు.[1]

త్వరిత వాస్తవాలు చంటి, దర్శకత్వం ...
Remove ads

కథ

నందిని ఒక జమీందారు కుటుంబంలో పుడుతుంది. వారి వంశంలో లేకలేక కలిగిన ఆడపిల్ల ఆమె. కానీ ఆమె పుట్టగానే తల్లిదండ్రులకు కోల్పోవడంతో ఆమె ముగ్గురు అన్నయ్యలు ఆమెను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటారు. ఆమె జాతకం ప్రకారం అన్నయ్యలు నచ్చిన వ్యక్తితోకాక వేరే వ్యక్తితో పెళ్ళి అవుతుందని ఒక జ్యోతిష్కుడు చెబుతాడు. దాంతో ఆమెకు ఇంట్లోంచి బయటకు వెళ్ళకుండా అంగరక్షకులను ఏర్పాటు చేసి పెంచుతుంటారు. అదే ఊళ్ళో పుట్టిన చంటి, ఒక అమాయకుడు. అతనికి తన తల్లి, పాటలే లోకం. ఒకసారి నందిని అంగరక్షకులతో గొడవపడ్డ చంటి వారిని కొడతాడు. దాంతో నందిని అన్నయ్యలు అతన్నే ఆమెకు అంగరక్షకుడిగా నియమిస్తారు. నందిని నెమ్మదిగా అతన్ని అభిమానించడం మొదలుపెడుతుంది.

Remove ads

తారాగణం

నిర్మాణం

అభివృద్ధి

చంటి సినిమాకి తమిళంలో విడుదలై ఘనవిజయం సాధించిన చిన్న తంబి సినిమా మాతృక. చిన్న తంబి సినిమాకి రచయిత, దర్శకుడు పి. వాసు, సినిమాలో ప్రధాన పాత్రలు ధరించినది ప్రభు, ఖుష్బు. ఘనవిజయం సాధించిన ఈ తమిళ చిత్రం హక్కులు కొని తెలుగులో తీయాలని పలువురు భావించారు. బి.గోపాల్ తన దర్శకత్వంలో బాలకృష్ణతో తీయాలని భావించారు, అయితే అప్పటికే కె. ఎస్. రామారావు సినిమా హక్కుల్ని కొనేశారు. ఆయన వెంకటేష్తో తీద్దామని నిర్ణయించుకున్నారు.[2] తమిళంలో నటించిన ఖుష్బూ మళ్ళీ తెలుగులో వెంకటేష్ సరసన నటించడానికి అంగీకరించకపోవడంతో మీనాను కథానాయికగా తీసుకున్నారు.

విడుదల

జనవరి 10, 1992 న విడుదలైన ఈ చిత్రం అన్ని కేంద్రాల్లో విజయం సాధించింది. 40 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుంది.

పాటలు

సంగీతం ఇళయరాజా

  • అన్నుల మిన్నల అమ్మడి కన్నులు (రచన : సాహితి, గానం : ఎస్.పి.బాలు)
  • ఇది తైలం పెట్టి తాళం పట్టి (రచన : వేటూరి., గానం : ఎస్.పి.బాలు)
  • జాబిలికి వెన్నెలకి పుట్టిన పున్నమిలే (రచన. సాహితీ :,గానం : ఎస్.పి.బాలు)
  • ఎన్నెన్నో అందాలు..ఏవేవో రాగాలు (రచన. వేటూరి,  :, గానం : ఎస్.పి.బాలు, చిత్ర)
  • పావురానికి పంజరానికి పెళ్ళిచేసే పాడు లోకం (రచన :వేటూరి, గానం : ఎస్.పి.బాలు)
  • ఓ ప్రేమా నా ప్రేమా (రచన : వేటూరి, గానం : ఎస్.పి.బాలు, )
  • జాబిలికి వెన్నెలకీ ,(ఫిమేల్ వాయిస్)( రచన: సాహితి, గానం.కె ఎస్ చిత్ర)
  • ఓ ప్రేమా నా ప్రేమా,(ఫిమేల్ వాయిస్) ,(రచన వేటూరి, కె ఎస్ చిత్ర)
Remove ads

అవార్డులు

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads