జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం
తెలంగాణలోని హైదరాబాద్‌లో ఇంజనీరింగ్-కేంద్రీకృత విశ్వవిద్యాలయం From Wikipedia, the free encyclopedia
Remove ads
జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ( జె ఎన్ టి యు అనగా Jawaharlal Nehru Technological University (J.N.T.U), తెలంగాణ రాజధాని హైదరాబాదులో గల ప్రముఖ సాంకేతిక విశ్వవిద్యాలయం. జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభచే దేశంలో మొట్టమొదటి సాంకేతిక విశ్వవిద్యాలయంగా 1972 అక్టోబర్ నెల 2వ తేదీన స్థాపించబడింది. తరువాత ఆగస్టు 18 నాటి 2008 ఆంధ్రప్రదేశ్ శాసనసభ 31 చట్టం మేరకు సెప్టెంబరు 2008 లో నాలుగు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో పునర్వ్యవస్థీకరించబడింది.
- జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, హైదరాబాద్
- జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, అనంతపూర్
- జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, కాకినాడ
- జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్, ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్
Remove ads
ఉపకులపతుల జాబితా
- 1.కట్టా నర్సింహారెడ్డి - 21మే 2021 నుండి 20 మే 2024[1][2]
విద్యా శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన బుర్రా వెంకటేశం ఇన్ ఛార్జి వీసీ గా పని చేశాడు.ప్రభుత్వం అతనిని టీజీ పీఎస్సీ చైర్మన్ గా నియమించడంతో ప్రభుత్వం తదుపరి ఆదేశాలు జారీ అయ్యే వరకు బాల కిష్టారెడ్డిని నియమించింది.
- 3వి.బాలకిష్టా రెడ్డి (06 డిసెంబర్ 2024 నుండి 17 ఫిబ్రవరి 2025 వరకు)
జేఎన్టీయూ హెచ్ ఇన్ ఛార్జి వీసీ గా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి నియమితులయ్యాడు. అక్టోబర్/2024లో సెర్చ్ కమిటీ సమావేశం నిర్వహించి గవర్నర్ విష్ణు దేవ్ వర్మ ఆమోదంతో విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీధర్ జీవో జారీ చేశారు.
- 4.టి.కిషన్ కుమార్ రెడ్డి(18 ఫిబ్రవరి 2025 నుండి )
జే ఎన్ టీయూ ఉపకులపతిగా ప్రొఫెసర్ టి.కిషన్ కుమార్ రెడ్డి నియమితులయ్యారు. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవీ లో కొనసాగుతారు.సేర్చ కమిటీ సిఫార్సు చేసిన వారిలో కిషన్ కుమార్ రెడ్డి పేరును గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదించడంతో విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి యోగితారాణా నియామక ఉత్తర్వులు 13 ఫిబ్రవరి 2025న జారీ చేశారు.ఈ మేరకు 18 ఫిబ్రవరి 2025 న ఆయన బాధ్యతలు స్వీకరించారు[3].
- కూడేరు రాజగోపాల్: 2005-2008[4]
Remove ads
ఇతర వివరాలు
ఇక్కడికి సమీపంలో మెట్రో స్టేషను ఉంది.
మూలాలు
బయటి లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads