జాన్ రైట్
From Wikipedia, the free encyclopedia
Remove ads
జాన్ రైట్ (ఆంగ్లం: John Wright; 1954 జులై 5) భారత జట్టుకు తొలి విదేశీ కోచ్. న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకి ప్రాతినిధ్యం వహించిన మాజీ అంతర్జాతీయ క్రికెటర్. ఆయన అంతర్జాతీయ క్రికెట్ లోకి 1978లో ఇంగ్లండ్‌పై అరంగేట్రం చేశాడు. ఆయన ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ (ఎంబిఇ) గ్రహిత.
ఆయన 5,000 కంటే ఎక్కువ టెస్ట్ పరుగులు చేసి మొదటి న్యూజిలాండ్ టెస్ట్ ఆటగాడుగా నిలిచాడు.[2] 12 టెస్ట్ సెంచరీలతో ఒక్కో ఔట్‌కి సగటున 37.82 పరుగులు చేశాడు, వాటిలో 10 న్యూజిలాండ్‌లో ఉన్నాయి. అతను 1977 నుండి 1988 వరకు ఇంగ్లాండ్‌లోని డెర్బీషైర్ తరపున కూడా ఆడాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో అతను 50కి పైగా ఫస్ట్-క్లాస్ సెంచరీలతో సహా 25,000 కంటే ఎక్కువ పరుగులు చేశాడు.[3] అతను లిస్ట్ - ఎ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో 10,000కు పైగా పరుగులు చేశాడు.
ఆయన పదవీ విరమణ 1993లో జరిగింది. ఆ తరువాత 2000 నుండి 2005 వరకు భారత జాతీయ క్రికెట్ జట్టుకు కోచ్‌గా పనిచేశాడు. అలాగే 2010 నుండి 2012 వరకు న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు కూడా కోచ్‌గా వ్యవహరించాడు.
Remove ads
సంగీతం పై మక్కువ
క్రికెటర్‌గా పర్యటనలో ఉన్నప్పుడు జాన్ రైట్ ఎల్లప్పుడూ తన గిటార్‌ను వెంటపెట్టుకుంటాడు. ఆయన 2017లో తన తొలి ఆల్బమ్ రెడ్ స్కైస్(Red Skies)ని విడుదల చేశాడు. అంతర్జాతీయ క్రికెటర్‌గా, కోచ్‌గా ఉన్న ఆయన తన కెరీర్ మొత్తం పాటలతోనే సాగింది. ఆయన జంప్ ది సన్(Jump the Sun) పేరుతో కొత్త పాటల ఈపిని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు.[4][5]
ప్రచురణలు
న్యూజిలాండ్ రచయిత పాల్ థామస్‌తో కలిసి 1990లో జాన్ రైట్ క్రిస్మస్ ఇన్ రరోటోంగా (Christmas in Rarotonga) అనే ఆత్మకథను రాశాడు.[6] భారతీయ జర్నలిస్టు శారదా ఉగ్రా, పాల్ థామస్‌లతో కలిసి, జాన్ రైట్ భారత జట్టు కోచ్‌గా తన అనుభవాలను వివరిస్తూ 2006లో జాన్ రైట్స్ ఇండియన్ సమ్మర్స్ అనే పుస్తకానికి సహ రచయితగా ఉన్నాడు.[7]
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads