జుబేర్ హంజా

దక్షిణాఫ్రికా అంతర్జాతీయ క్రికెటర్ From Wikipedia, the free encyclopedia

Remove ads

మొహమ్మద్ జుబేర్ హంజా[1] (జననం 1995, జూన్ 19) దక్షిణాఫ్రికా అంతర్జాతీయ క్రికెటర్.[2] 2019 జనవరిలో దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు తరపున టెస్ట్ క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు, రీడ్‌మిషన్ తర్వాత దక్షిణాఫ్రికా 100వ టెస్ట్ ప్లేయర్ గా నిలిచాడు.[3] దేశీయ క్రికెట్‌లో, 2020-21 సీజన్‌కు ముందు కేప్ కోబ్రాస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.[4]

త్వరిత వాస్తవాలు వ్యక్తిగత సమాచారం, పూర్తి పేరు ...
Remove ads

క్రికెట్ రంగం

2018 డిసెంబరులో, పాకిస్తాన్‌తో జరిగే సిరీస్ కోసం దక్షిణాఫ్రికా టెస్టు జట్టులో హమ్జా ఎంపికయ్యాడు.[5] 2019, జనవరి 11న పాకిస్తాన్‌పై దక్షిణాఫ్రికా తరపున తన అరంగేట్రం చేశాడు.[6] 2021 మే లో, జింబాబ్వే పర్యటనకు దక్షిణాఫ్రికా A జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.[7] 2021 జూన్ లో, మొదటి అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో, హంజా అజేయంగా 222 పరుగులు చేశాడు, దీని వలన దక్షిణాఫ్రికా ఎ జట్టు జింబాబ్వే ఎ జట్టుపై ఇన్నింగ్స్ 166 పరుగుల తేడాతో విజయం సాధించింది.[8]

2021 నవంబరులో, నెదర్లాండ్స్‌తో జరిగే సిరీస్ కోసం దక్షిణాఫ్రికా వన్డే ఇంటర్నేషనల్ జట్టులో అతను ఎంపికయ్యాడు.[9] 2021, నవంబరు 26న దక్షిణాఫ్రికా తరపున నెదర్లాండ్స్‌పై తన వన్డే అరంగేట్రం చేసాడు.[10]

2022 మార్చిలో, జనవరిలో ఐసీసీ డోపింగ్ నిరోధక పరీక్ష తర్వాత హమ్జా నిషేధిత పదార్థమైన ఫ్యూరోసెమైడ్‌కు పాజిటివ్ పరీక్షించారు.[11] హంజా పరీక్ష ఫలితాన్ని వివాదం చేయలేదు, ఐసీసీచే తాత్కాలికంగా సస్పెండ్ చేయబడే ముందు,[12] స్వచ్ఛంద సస్పెన్షన్‌కు అంగీకరించాడు.[13]

2023 ఏప్రిల్ లో, శ్రీలంక పర్యటన కోసం దక్షిణాఫ్రికా ఎ జట్టు ఫస్ట్-క్లాస్, లిస్ట్ ఎ జట్టు స్క్వాడ్‌కి రీకాల్ చేయబడ్డాడు.[14]

Remove ads

మూలాలు

బాహ్య లింకులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads