జె.ఎఫ్.ఆర్.జాకబ్

From Wikipedia, the free encyclopedia

జె.ఎఫ్.ఆర్.జాకబ్
Remove ads

జాకబ్ ఫర్జ్ రాఫెల్ "జె.ఎఫ్.ఆర్." జాకబ్ (1923 – 13 జనవరి 2016) భారత సైనిక దళంలోని లెప్టినెంటు జనరల్. ఆయన పాకిస్తాన్‌తో 1971లో జరిగిన యుద్ధంలో ఢాకాలోని ఆ దేశ బలగాలు భారత్ బలగాలకు లొంగిపోవడానికి సంప్రదింపులు జరిపినవారు. ఆయన ఆ కాలంలో మేజర్ జనరల్ గా యుండి భారత సైనిక దళం లోని తూర్పు దళానికి అధిపతిగా వ్యవహరించారు. తన 36 సంవత్సరాల సైనిక జీవితంలో రెండవ ప్రపంచ యుద్ధం, ఇండో పాక్ వార్ (1965) లలో పాల్గొన్నారు. తరువాత ఆయన గోవా, పంజాబ్ రాష్ట్రాలకు గవర్నర్ గా కూడా వ్యవహరించారు.

త్వరిత వాస్తవాలు జె.ఎఫ్.ఆర్.జాకబ్, జన్మనామం ...
Remove ads

బాల్యా జీవితం

ఆయన 1923 లో కలకత్తా, బెంగాల్ ప్రెసిడెన్సీ లో జన్మించారు. ఆయన కుటుంబం 18వ శతాబ్దం మధ్యలో ఇరాక్ నుండి కలతత్తాకు వచ్చి స్థిరపడింది. వారు మతపరంగా జ్యూరిచ్ కుటుంబానికి చెందినవారు.[1] ఆయన తండ్రి ఎలియాస్ ఇమాన్యుయేల్ ప్రముఖ వ్యాపారస్తుడు. ఆయన తండ్రి అనారోగ్యంగా యున్నప్పుడు జాకబ్ తన 9వ యేట డార్జిలింగ్ దగ్గరలో గల కుర్సియాంగ్ వద్ద బోర్డింగ్ పాఠశాలలో చేరారు. తరువాత ఆయన సెలవులలో మాత్రమే ఇంటికి పోయేవాడు.[2]

జాకబ్ 19 ఏండ్ల వయసులో సైన్యంలో చేరారు. రెండో ప్రపంచయుద్ధంతోపాటు, 1965, 1971లలో ఇండియా-పాకిస్థాన్ మధ్య జరిగిన పోరాటాల్లో పాల్గొన్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో, 1965లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో భారత్ తరపున వీరోచితంగా పోరాడిన జాకబ్ 1978లో పదవీ విరమణ పొందారు.


Remove ads

మరణం

ఆయన దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ జనవరి 13 2016 న తన 92వ యేట మరణించాడు.

మూలాలు

ఇతర లింకులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads