టామ్ బ్లండెల్

From Wikipedia, the free encyclopedia

టామ్ బ్లండెల్
Remove ads

థామస్ అక్లాండ్ బ్లండెల్ (జననం 1990, సెప్టెంబరు 1) న్యూజీలాండ్ క్రికెట్ ఆటగాడు. 2017 జనవరిలో న్యూజీలాండ్ జాతీయ క్రికెట్ జట్టు తరపున అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. వెల్లింగ్టన్ తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్ కూడా క్రికెట్ ఆడాడు.[1] 2019 ఏప్రిల్ లో వన్డే మ్యాచ్‌లో క్యాప్ చేయనప్పటికీ, 2019 క్రికెట్ ప్రపంచ కప్ కోసం న్యూజీలాండ్ వన్ డే ఇంటర్నేషనల్ జట్టులో ఎంపికయ్యాడు.[2] 2019–2021 ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ గెలిచిన న్యూజీలాండ్ జట్టులో బ్లండెల్ సభ్యుడిగా ఉన్నాడు. 2023లో <i id="mwGQ">విస్డెన్</i> క్రికెటర్స్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గ్రహీతలలో ఒకడిగా నిలిచాడు.

త్వరిత వాస్తవాలు వ్యక్తిగత సమాచారం, పూర్తి పేరు ...
Remove ads

అంతర్జాతీయ కెరీర్

2017 జనవరిలో, ల్యూక్ రోంచి గాయపడిన తర్వాత, బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో మ్యాచ్‌కి న్యూజీలాండ్ ట్వంటీ 20 ఇంటర్నేషనల్ జట్టులో వికెట్ కీపర్‌గా చేర్చబడ్డాడు.[3] 2017 జనవరి 8న బంగ్లాదేశ్‌పై న్యూజీలాండ్ తరపున తన టీ20 క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు.[4]

2017 జనవరిలో, ఆస్ట్రేలియాపై వికెట్ కీపర్‌గా న్యూజీలాండ్ వన్డే ఇంటర్నేషనల్ జట్టులో చేర్చబడ్డాడు, కానీ అతను ఆడలేదు.[5] 2017 నవంబరులో వెస్టిండీస్‌తో సిరీస్ కోసం న్యూజీలాండ్ టెస్ట్ జట్టులో చేర్చబడ్డాడు.[6] 2017, డిసెంబరు 1న వెస్టిండీస్‌పై న్యూజీలాండ్ తరపున తన అరంగేట్రం చేశాడు.[7] గాయపడిన బిజె వాట్లింగ్ స్థానంలో వికెట్-కీపర్‌గా నియమితుడయ్యాడు,[8] 107 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు, ఇది న్యూజీలాండ్ వికెట్ కీపర్ అరంగేట్రం చేసిన అత్యధిక టెస్ట్ స్కోరు.[9] 2007లో మాట్ ప్రియర్ తర్వాత టెస్టు అరంగేట్రంలోనే సెంచరీ సాధించిన తొలి వికెట్ కీపర్‌గా కూడా నిలిచాడు.[10]


2019 ఏప్రిల్ లో, 2019 క్రికెట్ ప్రపంచ కప్ కోసం న్యూజీలాండ్ జట్టులో ఎంపికయ్యాడు.[11] [12] అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ టోర్నమెంట్ కోసం ఐదు ఆశ్చర్యకరమైన ఎంపికలలో ఇతనిని ఒకరిగా పేర్కొంది.[13] అయితే టోర్నీలో ఇతను ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఆ తర్వాతి నెలలో, న్యూజీలాండ్ క్రికెట్ ద్వారా 2019–20 సీజన్ కోసం కొత్త కాంట్రాక్ట్‌ను పొందిన ఇరవై మంది ఆటగాళ్ళలో ఒకడిగా ఉన్నాడు.[14]

2020 జనవరిలో, భారత్‌తో జరిగే సిరీస్ కోసం న్యూజీలాండ్ వన్ డే ఇంటర్నేషనల్ జట్టులో బ్లండెల్ ఎంపికయ్యాడు.[15] 2020, ఫిబ్రవరి 5న న్యూజీలాండ్ తరపున భారతదేశానికి వ్యతిరేకంగా వన్డే అరంగేట్రం చేసాడు.[16]

Remove ads

మూలాలు

బాహ్య లింకులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads