ట్వింకిల్ ఖన్నా
From Wikipedia, the free encyclopedia
Remove ads
ట్వింకిల్ ఖన్నా (జననం 1974 డిసెంబరు 29) అసలు పేరు టీనా జతిన్ ఖన్నా. ఈమె ప్రముఖ భారతీయ ఇంటీరియర్ డిజైనర్, పత్రికా కాలమిస్టు, రచయిత్రి, మాజీ నటి కూడా. ఆమె మొదటి సినిమా బర్సాత్ (1995)కు ఫిలింఫేర్ ఉత్తమ తొలి చిత్ర నటి పురస్కారం (బెస్ట్ ఫీమేల్ డెబ్యూ) పొందారు. తెలుగు చిత్రం శీను (1999)లో కథానాయికగా కనిపించారీమె. ప్రముఖ నటులు [[రాజేష్ ఖన్నా|రాజేష్ ఖన్నా]], డింపుల్ కపాడియాల కుమార్తె ఈమె. నటిగా ఆమె చివరి చిత్రం లవ్ కే లియే కుచ్ భి కరేగా (2001). బాబీ డియోల్, అజయ్ దేవగణ్, సైఫ్ అలీ ఖాన్, ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, వెంకటేష్, గోవిందా, అక్షయ్ కుమార్ వంటి నటులతో ఎన్నో సినిమాల్లో నటించారామె.
2001లో అక్షయ్ కుమార్ను వివాహం చేసుకున్నారు ట్వింకిల్. అదే సంవత్సరం నుండి సినిమాల్లో నటించడం కూడా మానేశారు. ఇంటీరియర్ డిజైనింగ్ లో ప్రొఫెషనల్ డిగ్రీ పట్టా లేకపోయినా, ఒక ఆర్కిటెక్ట్ వద్ద 2 ఏళ్ళు పనిచేసి, ఆ రంగంలో నైపుణ్యం సంపాదించుకున్నారు ఆమె. ముంబై ప్రధాన కార్యాలయంగా గల ది వైట్ విండో అనే ఇంటీరియర్ డిజైనింగ్ వ్యాపార సంస్థకు సహ యజమాని కూడా అయ్యారు. గ్రేజింగ్ గోట్ ప్రొడక్షన్స్ అనే సినీ నిర్మాణ సంస్థకు సహ వ్యవస్థాపకురాలుగా దాదాపు 6 చిత్రాలకు సహ నిర్మాణ బాధ్యతలు నిర్వహించారు ట్వింకిల్. మరాఠీ భాషలో 72 మైల్స్ అనే సినిమా కూడా తీశారు. తీస్ మార్ ఖాన్ (2010)లో అతిథి పాత్రలో కనిపించారామె.
Remove ads
కెరీర్
నటన
రాజ్ కుమార్ సంతోషి దర్శకత్వం వహించిన బర్సాత్ (1995) సినిమాలో బాబీ డియోల్ తో కలసి నటించారు ట్వింకిల్. ఈ సినిమాకు ఆమెను ధర్మేంద్ర ఎంచుకున్నారు. ఈ సినిమా విడుదల కాకముందే 2 ఇతర సినిమాలకు ఒప్పుకున్నారు ఆమె.[1] ఆ సంవత్సరానికిగానూ 6వ అతి ఎక్కువ వసూళ్ళు సాధించిన చిత్రంగా నిలిచింది ఆ సినిమా.[2] ఫిలింఫేర్ ఉత్తమ తొలిచిత్ర నటి అవార్డు కూడా ఈ చిత్రం ద్వారా అందుకున్నారామె.[3] ఆ తరువాతి సంవత్సరమే అజయ్ దేవగణ్ సరసన జాన్, సైఫ్ అలీ ఖాన్ పక్కన దిల్ తేరా దీవానా సినిమాల్లో నటించారు. న్యూ స్ట్రెయిట్స్ టైమ్స్ పత్రిక కు చెందిన కె.ఎన్.విజియన్ ఆమె గురించి రాస్తూ "ఖన్నా సాధారణ హిందీ సినీ నటిలా ఉండరు" అని రాశారు.[4] దిల్ తేరా దీవానా సినిమా విడుదలైనప్పుడు మాత్రం "ఇంతకుముందు సినిమాల్లా కాకుండా ఈ చిత్రంలో ఖన్నా చాలా అందంగా ఉన్నారు, బాగా నటించారు" అని కితాబిచ్చారు ఆయన.[5] 1997లో విడుదలైన ఉఫ్! యే మొహొబ్బత్, ఇతిహాస్ సినిమాలు రెండూ ఫ్లాప్ అయ్యాయి.[6][7] 1998లో సల్మాన్ ఖాన్ తో కలసి నటించిన జబ్ ప్యార్ కిసీసే హోతా హై సినిమా ఒక్కటే విడుదలైంది.[8]
1999లో అక్షయ్ కుమార్ తో ఇంటర్నేషనల్ ఖిలాడీ, జుల్మీ అనే రెండు సినిమాల్లో నటించారు ట్వింకిల్. ఈ రెండు సినిమాలూ విజయం సాధించలేదు.[9] అదే సంవత్సరం తెలుగులో వెంకటేష్ తో కలసి శీను సినిమాలో నటించారు ఆమె. షారుఖ్ ఖాన్ తో కలసి బాద్షా (1999) సినిమాలో కనిపించారు ఖన్నా.[10] అదే సంవత్సరం సైఫ్ అలీ ఖాన్ తో కలసి యే హై ముంబై మేరీ జాన్ సినిమాలో చేశారు. 2000లో ఆమిర్ ఖాన్ తో కలసి మేళా సినిమాలో నటించారు ఖన్నా[11] ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది.[12] మలేషియాలోని షా అలమ్ అవుట్ డోర్ స్టేడియంలో జుహీ చావ్లా, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లతో కలసి ఈమె చేసిన కచేరీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.[13][14] చల్ మేరే భాయ్ లో అతిథి పాత్రలోనూ, గోవిందా (నటుడు) తో కలసి జోరు కా గులాం, జోడి నెం.1 (2001) సినిమాల్లో నటించారు ఆమె.[15] ఈ సినిమాలో ఆమె నటనకు చాలా విమర్శలు వచ్చాయి.[16] ఒక ఇంటర్వ్యూలో కుచ్ కుచ్ హోతా హై సినిమాలో రాణీ ముఖర్జీ కన్నా ముందు ఆ పాత్రకు ట్వింకిల్ ను అనుకున్నటు కరణ్ జోహర్ తెలిపారు. 2001లో అక్షయ్ కుమార్తో వివాహం అయ్యాకా ఆమె సినిమాలకు దూరమయ్యారు.[17] తెలుగు సినిమా మనీకి రీమేక్ అయిన లవ్ కే లియే కుచ్ భీ కరేగా (2001) ఆమె ఆఖరి సినిమా. ఈ సినిమా ఏవరేజ్ హిట్ గా నిలిచింది.[18]
Remove ads
వ్యక్తిగత జీవితం
డింపుల్ కపాడియా, రాజేష్ ఖన్నాల కూతురు ట్వింకిల్ ఖన్నా[19] ఈమె సోదరి రింకిల్ ఖన్నా కూడా నటే.[20] కాస్ట్యూం డిజైనర్ సింపుల్ కపాడియా ఈమెకు పిన్ని.[21] ఫిలింఫేర్ పత్రికకు జరిగే ఫోటోషూట్ లో మొదటిసారి అక్షయ్ ను కలిశారు ఆమె.[22] 17 జనవరి 2001న అక్షయ్ ను వివాహం చేసుకున్నారు ట్వింకిల్.[23] వీరికి ఒక కొడుకు ఆరవ్[24], ఒక కూతురు నితారా[25]. కుమార్ ఎక్కువగా తన విజయానికి కారణం ట్వింకిలే అని చెబుతూ ఉంటారు.[26][27] 2009లో పీపుల్ మేగజైన్ ట్వింకిల్ ను 4వ బెస్ట్ డ్రెస్డ్ సెలెబ్రటీ ఇన్ ఇండియాగా పేర్కొంది.[28] నవంబరు 2014 నుంచి ట్విట్టర్ ఎకౌంట్ వాడుతున్నారామె.[29]
Remove ads
సినిమాలు
అవార్డులు
Remove ads
References
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads