డేవిడ్ ధావన్

From Wikipedia, the free encyclopedia

డేవిడ్ ధావన్
Remove ads

డేవిడ్ ధావన్ (జననం 1955 ఆగస్టు 16[1]) ప్రముఖ భారతీయ దర్శకుడు. ఆయన అసలు పేరు రాజిందర్ ధావన్. పూణె లోని ఫిలిం  అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో నటన నేర్చుకునేందుకు ప్రయత్నించి, ఎడిటింగ్ నేర్చుకున్నారు.

Thumb
డేవిడ్ ధావన్

తొలినాళ్ళ జీవితం

డేవిడ్ పంజాబ్ అగర్తలలోని పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించారు.  తన తండ్రి యూకో బ్యాంక్ మేనేజర్ కావడంతో వారి కుటుంబ కాన్పూర్ కు ట్రాన్స్ ఫర్ పై వెళ్ళింది. 12వ తరగతి వరకు క్రైస్ట్ చర్చ్ కళాశాలలోనే చదువుకున్నారు. ఆ తరువాత పుణే లోని ఫిలిం ఇన్స్టిట్యూట్ లో నటన నేర్చుకునేందుకు చేరారు. కానీ సతీష్ షా, సురేష్ ఒబెరాయ్ వంటి వారిని చూసి, నటన తన వల్ల అవ్వదని భావించి, ఎడిటింగ్ నేర్చుకున్నారు డేవిడ్.

Remove ads

కెరీర్

దర్శకత్వంలోకి రాకముందు ధావన్ ఎడిటర్ గా తన కెరీర్ ను మొదలు పెట్టారు. కామెడీ సినిమాలు దర్శకత్వం చేయడంలో సిద్ధహస్తుడు ఆయన.[2] 1993లో విడుదలైన ఆంఖే ఆయన కెరీర్ లోనే అతి పెద్ద హిట్.[2] పార్టనర్ (2007) సినిమా కూడా మంచి విజయం సాధించింది.[3]

ఆసియా ఫిలిం & టెలివిజన్ అకాడమీ, ఆసియా స్కూల్ ఆఫ్ మీడియా స్టడీస్ బోర్డలలో డేవిడ్ సభ్యునిగా ఉన్నారు. ఆసియా స్కూల్ ఆఫ్ మీడియా స్టడీస్ నుండి సందీప్ మార్వా ధావన్ కు అకాడమీ అవార్డు ఇచ్చి గౌరవించారు. 2008లో స్టార్ ప్లస్ లో వచ్చే నచ్ బలియా 3 లోనూ, హన్స్ బలియా షోలలోనూ న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు ఆయన.

గోవిందా తో కలసి..

గోవిందా తో ఎన్నో సినిమాలు తీశారు డేవిడ్. తాకత్వర్ (1989) వీరీ కాంబినేషన్ లో మొదటి సినిమా. వీరిద్దరూ దాదాపు 17  కామెడీ సినిమాలు చేశారు. తాకత్వర్ (1989), స్వర్గ్ (1990), షోలాఔర్ షబ్నమ్ (1992), ఆంఖే (1993), రాజా బాబు (1996), కూలీ నెం.1 (1995), సాజన్ చలే ససురాల్ (1996), బనారసీబాబు (1997), దీవానా మస్తానా (1997), హీరో నెం.1 (1997), బడే మియాన్ చోటే మియాన్ (1998), హసీనా మాన్ జాయేగి (1999), కున్వారా (2000), జోడి నెం.1 (2001), ఏక్ ఔర్ ఏఖ్ గ్యారాహ్ (2003), పార్ట్ నర్ (2007),  డు నాట్ డిస్టర్బ్ (2009) సినిమాలు వీరి కాంబినేషన్లో వచ్చాయి. ఇందులో పార్ట్ నర్ సినిమాలో సల్మాన్ ఖాన్ కూడా నటించారు. ఈ సినిమా 300 మిలియన్లు వసూలు చేసింది.[4] అదే సంవత్సరంలో  ధావన్ ను, గోవిందాను తన షో 10 కా దమ్ కు అతిధులుగా పిలిచారు సల్మాన్. 

Remove ads

వ్యక్తిగత జీవితం

ధావన్ భార్య కరుణ.[5] [6] వీరికి ఇద్దరు కుమారులు రోహిత్ ధావన్, వరుణ్ ధావన్. నటుడు అనిల్ ధావన్ డేవిడ్ సోదరుడు. అతని మేనల్లుడు సిద్దార్ధ్ ధావన్ కూడా నటుడే.[7]

సినిమాలు

మరింత సమాచారం సంవత్సరం, చిత్రం ...
Remove ads

అవార్డులు, నామినేషన్లు

మరింత సమాచారం సంవత్సరం, చిత్రం ...
Remove ads

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads